News


ఇరాన్‌ ఉద్రిక్తతలు తగ్గేవరకూ గరిష్టంలోనే చమురు

Friday 3rd January 2020
Markets_main1578039593.png-30649

చమురు ధరలు ఇప్పటికే 3 శాతం అప్‌
ఇరాన్‌ ప్రతిచర్యలు ప్రభావం చూపవచ్చు

గురువారం రాత్రి బాగ్దాద్‌ విమానాశ్రయంవద్ద అమెరికా నిర్వహించిన వైమానిక దాడుల కారణంగా ఇరానియన్‌ జనరల్‌ కాసిమ్‌ మృతి చెందడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ దాడుల్లో ఇరాక్‌ చెందిన అధికారులు సైతం మరణించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 3 శాతం ఎగశాయి. ప్రపంచ చమురు సరఫరాలలో మూడో వంతు వాటాను కలిగిన ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రభావం‍ చూపుతున్నాయి. ఈ దాడులపై ఇరాన్‌ ఎలా ప్రతిస్పందిస్తుందన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైనట్లు వంద ఇన్‌సైట్స్‌ వ్యవస్థాపకులు, సీఈవో వందన హరి పేర్కొన్నారు. ఈ దాడుల కారణంగా మధ్యప్రాచ్యంలోని దేశాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చే అవకాశముందంటున్నారు. ఇతర వివరాలు చూద్దాం..

ప్రతి చర్యలు లేకుంటే..
అమెరికా, ఇరాన్‌ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలు మధ్యప్రాచ్యంపై ప్రభావాన్ని చూపే అవకాశముంది. ఈ ప్రాంతంలోని దేశాలన్నీ ఒకే బాటలోకి వచ్చే వీలుంది. తద్వారా ఇరాన్‌కు మద్దతుగా లేదా అమెరికావైపు మొగ్గుచూపవచ్చు. ఉద్రిక్తతలు చల్లబడేవరకూ చమురు ధరలపై ప్రభావం కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితులపై పూర్తి వివరాలు తెలియని నేపథ్యంలో పరిణామాలు ఊహించడం కష్టమే. ఈ దాడుల అంశంపై అటు అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ లేదా ఇటు ఇరాన్‌ ఎలాంటి అధికారిక ధృవీకరణలూ చేయలేదు. దీంతో నెమ్మదిగా పరిస్థితులు ఉపశమించవచ్చు కూడా. 2019లో సౌదీ అరేబియాపై దాడుల నేపథ్యంలో ఇరాన్‌కు వ్యతిరేకంగా ట్రంప్‌ ఎలాంటి చర్యలకూ దిగకపోవడం ఈ సందర్భంగా ‍ప్రస్తావించదగ్గ అంశం!You may be interested

ఏడాది గరిష్టానికి జీఎంఆర్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేరు

Friday 3rd January 2020

 మౌలిక సదుపాయాల హైదరాబాద్‌ సంస్థ జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో ఏడాది గరిష్టాన్ని తాకింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు రూ.21.65 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి షేరు కొనుగోళ్ల మద్దతు లభించడంతో షేరు ఇంట్రాడేలో 7.60 శాతం పెరిగి రూ.23.35 వద్ద గరిష్టాన్ని తాకింది. ఈ ధర షేరుకు ఏడాది గరిష్టస్థాయి కావడం విశేషం. మధ్యాహ్నం గం.2:30ని.లకు 5శాతం లాభంతో 22.75 వద్ద ట్రేడ్‌

తొలి త్రైమాసికానికి 8 రికమండేషన్లు

Friday 3rd January 2020

కొత్త ఏడాది తొలి త్రైమాసికం చివరకు(మార్చి చివరకల్లా) మంచి రాబడిని అందించే ఎనిమిది షేర్లను బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. 1. సుదర్శన్‌ కెమికల్స్‌: టార్గెట్‌ రూ. 470. ఐఐఎఫ్‌ఎల్‌ సిఫార్సు. క్రమానుగత వృద్దిని సాధిస్తూ వస్తోంది. మార్కెట్‌ వాటా పెంచుకుంటూ ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద పిగ్‌మెంట్‌ ఉత్పత్తిదారుగా అవతరించింది. అంతర్జాతీయంగా రెండు బడా కంపెనీలు ఈ వ్యాపారం నుంచి తప్పుకోవడం కంపెనీ మరింత ఎదిగేందుకు దోహదం చేయనుంది.  2. ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌:

Most from this category