News


వచ్చే ఏడాదిలో రూ.50వేల కోట్ల ఐపీఓలు

Tuesday 31st December 2019
Markets_main1577783007.png-30560

వచ్చే ఏడాదిలో భారతీయ కంపెనీలు ఐపీఓ ద్వారా రూ.50వేల కోట్ల నిధుల సమీకరణ సిద్ధమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది(2019)లో 16 కంపెనీలు సమీకరించిన రూ.12,362 కోట్లతో పోలిస్తే ఈ మొత్తం(రూ.50వేల కోట్లు) విలువ నాలుగు రెట్లు అధికంగా ఉంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఎస్‌బీఐ కార్డు అండ్‌ పేమెంట్‌(రూ.9వేల నుంచి 10వేల కోట్లు), యూటీఐ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(రూ.3,5000 నుంచి రూ.4,000), హోమ్‌ ఫస్ట్‌ ఫైనాన్స్‌ (రూ.1500 కోట్లు), కంప్యూటర్‌ ఏజ్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెన్‌(రూ.1500 కోట్లు) కంపెనీల ఐపీఓలు నిధులను సమీకరించనున్నాయి. ద్వితీయార్థంలో మజగాన్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌, ఈక్విటీ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, ఇమామి సిమెంట్స్‌, ఈజీ ట్రిప్‌ ప్లానర్స్‌, పురానిక్‌ బిల్డర్స్‌, సంహి హోటల్స్‌, ఇండియన్‌ రెనవెబుల్‌ ఎనర్జీ డెవెలప్‌మెంట్‌ ఏజెన్సీ కంపెనీల ఐపీఓలు నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి.

‘‘సెకండరీ మార్కెట్లో ర్యాలీ కొనసాగడంతో పాటు ఫిబ్రవరిలో కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఎలాంటి ప్రతికూల సర్‌ప్రైజ్‌లు లేకపోతే కంపెనీల ఐపీఓలు విజయవంతంగా పూర్తి అవుతాయి’’ అని ప్రైమ్‌ డాటాబేస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రణవ్‌ అన్నారు. ఐపీఓ ప్రక్రియ ద్వారా 21 కంపెనీలు దాదాపు రూ.18700 కోట్ల నిధుల సమీకరణకు ఇప్పటికే మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబి నుంచి అనుమతులు దక్కించుకున్నాయి. మరో 13 కంపెనీలు రూ.18వేల సమీకరించేందుకు సెబీ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయని ప్రైమ్‌ డాటా బేస్‌ గణాంకాలు చెబుతున్నాయి. 

ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు ప్రస్తుతం సెకండరీ మార్కెట్‌లో అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఏడాదిలో రెండు, మూడు త్రైమాసికాల్లో స్టాక్‌ మార్కెట్లు ఇదే జోరు కొనసాగిస్తే దాదాపు రూ.40వేల కోట్ల విలువైన ఐపీఓలు దలాల్‌స్ట్రీట్‌ను తాకే అవకాశం ఉందని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ హెడ్‌ ఒకరు తెలిపారు. 

 2019లో ఐపీఓ ఇష్యూలను పూర్తి చేసుకుని ఎక్చ్సేంజీల్లో లిస్ట్‌ అయిన కంపెనీల షేర్లలో చాలావరకూ లాభాల్ని పంచాయి. ఐఆర్‌టీసీ, ఎఫిల్‌ ఇండియా, ఇండియా మార్ట్‌ ఇండర్‌ మెస్‌ కంపెనీ షేర్లు ఇష్యూ ధర కంటే రెట్టింపు లాభాల్ని ఇన్వెస్టర్లకు పంచాయి. ప్రతి ఐదింటిలో 4 ఐపీఓలు ఇన్వెస్టర్లకు లాభాల్ని పంచాయి.  ఈ ఏడాది బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీ 13శాతం ర్యాలీ చేయగా, బీఎస్‌ఈ ఐపీఓ ఇండెక్స్‌ 36శాతం పెరగడం విశేషం. 

 

కార్పోరేట్‌ కంపెనీలు నిధుల సమీకరణలో భాగంగా ఈ 2019 ఏడాదిలో రైట్స్‌ ఇష్యూ, క్యూఐపీ ఇష్యూలకు కూడా ప్రాముఖ్యత పెరిగింది. ఈ ఏడాదిలో దాదాపు 50 కంపెనీలు రైట్స్‌ ఇష్యూలో ద్వారా రూ.52,053 కోట్లను సమీకరించాయి. గడిచిన ఐదేళ్లలో ఇంతస్థాయిలో రైట్స్‌ ఇష్యూ ద్వారా నిధుల సమీకరించడం ఇదే తొలిసారి. అత్యధికంగా వోడాఫోన్‌ ఐడియా రూ.25వేల కోట్లను, భారతీ ఎయిర్‌టెల్‌ రూ.24,939 కోట్లను సమీకరించాయి. 

భారత కంపెనీల ఐపీఓలు, క్యూఐపీ ఇష్యూల్లో విదేశీ ఇన్వెస్టర్లు సుమారు 3.9 డాలర్ల బిలియన్‌ డాలర్ల పెట్టబడులు పెట్టారు. ఇక సెంకడరీ మార్కెట్లో 9.9 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. 



You may be interested

10 శాతం రాబడికి మూడు రికమండేషన్లు

Tuesday 31st December 2019

వచ్చే నెల రోజుల్లో దాదాపు 10 శాతం వరకు రాబడినిచ్చే మూడు స్టాకులను బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేశాయి. 1. వరుణ్‌ బెవరేజెస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 790. స్టాప్‌లాస్‌ రూ. 680. డైలీ చార్టుల్లో స్వల్పకాలిక నిరోధం రూ. 713ను దాటి బ్రేకవుట్‌ సాధించింది. స్టాకు ప్రస్తుతం తన కీలక డీఎంఏలకు పైన కదలాడుతోంది. ఆర్‌ఎస్‌ఐ, ఎంఏసీడీ బుల్లిష్‌గా మారాయి.  2. సుదర్శన్‌ కెమికల్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 450. స్టాప్‌లాస్‌ రూ.

మిడ్‌క్యాప్‌ ఎన్‌బీఎఫ్‌సీలవైపు చూపు

Tuesday 31st December 2019

ఇప్పటికే ఎన్‌బీఎఫ్‌సీ విభాగంలో భారీ కరెక్షన్‌ ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ తదితరాలు ఆకర్షణీయం హేమంగ్‌ జాని, సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌, షేర్‌ఖాన్‌ 2019 ముగింపు దశకు చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే ఏడాది(2020) వెలుగులో నిలవగల కౌంటర్లవైపు మార్కెట్‌ దృష్టి పెట్టనున్నట్లు బ్రోకింగ్‌ సంస్థ షేర్‌ఖాన్‌, సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ హేమంగ్‌ జాని చెబుతున్నారు. ఇటీవల వృద్ధి బాటలో సాగుతున్న స్టాక్స్‌కు ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇచ్చే వీలున్నట్లు తెలియజేశారు. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా పలు

Most from this category