News


రూ.20వేల కోట్ల ఐపీవోలు

Tuesday 25th February 2020
Markets_main1582655144.png-32087

ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీవో గురించి మార్కెట్లో తెగ హడావిడి నడుస్తోంది. ఇదొక పెద్ద ఐపీవో అవుతుందని, 50 శాతం ప్రీమియంతో లిస్ట్‌ అవుతుందని, అద్భుతమైన షేరు అని, లాభాల గుడ్లు పెడుతుందని విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తీకరిస్తున్నారు. అయితే, ఒక్క ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీవోనే కాకుండా, వచ్చే రెండు నెలల్లో (మార్చి, ఏప్రిల్‌) సుమారు రూ.20,000 కోట్ల నిధుల సమీకరణకు పలు ఐపీవోలు రానున్నాయని విశ్లేషకులు అంచనాలు కడుతున్నారు. 

 

2019లో 16 కంపెఈలు ఐపీవో ఇష్యూతో ఇన్వెస్టర్ల ముందుకు వచ్చాయి. వీటిల్లో ఐఆర్‌సీటీసీ, ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌, పాలీక్యాబ్‌ ఇండియా తదితర కంపెనీలున్నాయి. ఇక్కడ పేర్కొన్న కంపెనీలు అన్నీ కూడా తమ వ్యాపారాల్లో అగ్రగామిగా ఉన్నవి కావడం గమనార్హం. అందుకే ఐపీవో ఇష్యూతో పోలిస్తే అద్భుత రాబడులను ఇచ్చాయి. 2020 కూడా ఐపీవోలకు బ్లాక్‌బస్టర్‌ సంవత్సరం అవుతుందని అంచనాలున్నాయి. ప్రభుత్వం ఆర్థిక వృద్ధి పునరుద్ధరణకు చేస్తున్న ‍ప్రయత్నాలు ఇందుకు తోడ్పడతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

 

‘‘ఫలితాల సీజన్‌ ముగిసిన తర్వాత ఐపీవో బజ్‌ మళ్లీ మొదలైంది. గత నెల రోజుల్లో ఇనిస్టిట్యూషన్ల నుంచి అమ్మకాలు పెద్ద మొత్తంలో లేకపోవడం మంచి విషయం. దీంతో ఎన్‌ఎస్‌డీఎల్‌, ఎస్‌బీఐ కార్డ్స్‌, బార్బెక్యూ నేషన్‌ తదితర కంపెనీలు ఐపీవోకు వస్తాయన్న నమ్మకం కలుగుతోంది’’ అని శామ్కో సెక్యూరిటీస్‌ సీఈవో జిమీత్‌మోదీ తెలిపారు. ప్రభుత్వం సైతం లిస్టెడ్‌ ప్రభుత్వరంగ సంస్థల ఎఫ్‌పీవోలతో వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. లిక్విడిటీ సంక్షోభం, ఆర్థిక వృద్ధి గణనీయంగా తగ్గుముఖం పట్టిన తర్వాత మార్కెట్లలో కొంత మేరకు స్థిరీకరణకు అవకాశం ఉందని చెప్పారు.

 

2020 తొలి రెండు నెలల్లో ఒక్క ఐపీవో కూడా రాలేదు. మార్చిలో ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీవో రూ.9,000 కోట్లకు పైగా నిధుల సమీకరణకు వస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తర్వాత క్రెడిట్‌కార్డుల వ్యాపారంలో రెండో అతిపెద్ద సంస్థగా ఎస్‌బీఐ కార్డ్స్‌ ఉంది. మార్చి 2న ఐపీవో ఇష్యూ ఆరంభం కానుండగా, 5న ముగియనుంది. ఇష్యూ ధరల శ్రేణి రూ.750-755. ఇక ఆంటోనీ వేస్ట్‌ హ్యాండ్లింగ్‌ సెల్‌ ఐపీవో కూడా మార్చి 4న ప్రారంభం అవుతోంది. ఈ ఇష్యూ రూ.300 కోట్ల వరకు సమీకరించనుంది. బర్గర్‌ కింగ్‌ ఇండియా, ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఐపీవో దరఖాస్తులు ఇప్పటికే సెబీ ఆమోదం పొందాయి. బర్గర్‌ కింగ్‌ మార్చిలో, ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఏప్రిల్‌లో ఐపీవో ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు కూడా మార్చిలో ఐపీవో ఇష్యూను చేపట్టనుంది. అలాగే, ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, యూటీఐ ఏఎంసీలు కూడా ఏప్రిల్‌లో ఐపీవోకు రానున్నట్టు తెలుస్తోంది.You may be interested

మా దగ్గర ఇన్వెస్ట్‌ చేయండి

Wednesday 26th February 2020

నియంత్రణలను మరింత సడలిస్తాం భారత కంపెనీలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆహ్వానం సీఈవోలతో భేటీ న్యూఢిల్లీ: తమ దేశంలో మరింతగా ఇన్వెస్ట్‌ చేయాలంటూ భారత కంపెనీలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆహ్వానించారు. పెట్టుబడులు పెట్టడాన్ని సులభతరం చేసే దిశగా నియంత్రణలను మరింతగా సడలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. భారత పర్యటనలో భాగంగా మంగళవారం దేశీ దిగ్గజ సంస్థల సీఈవోలతో రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ట్రంప్‌ పాల్గొన్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ, మహీంద్రా

ఇండియా సిమెంట్స్‌లో వాటా పెంచుకుంటున్న దమానీలు

Tuesday 25th February 2020

ఇండియా సిమెంట్స్‌ కంపెనీలో ఏదో జరుగుతోందా..? ఈ కంపెనీలో దమానీ సోదరులు వాటాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. చెన్నై క్రికెట్‌ లిమిటెడ్‌ ఐపీవోకు ప్లాన్‌ చేసుకుంటున్న క్రమంలోనే వీరు వాటాలు పెంచుకుంటున్నారా..? అన్న సందేహానికి తావిస్తోంది. సీఎస్‌ఎల్‌కు ప్రమోటర్‌ ఇండియా సిమెంట్స్‌ అని తెలిసిందే. డీమార్ట్‌ అధినేత రాధాకిషన్‌ దమానీ ఇండియా సిమెంట్స్‌లో 4.73 శాతం వాటా కలిగి ఉన్నారు. ముఖ్యంగా గత డిసెంబర్‌ త్రైమాసికంలోనే

Most from this category