News


ఈ స్థాయి నుంచి రికవరీ..: గౌరవ్‌గార్గ్‌

Wednesday 18th March 2020
Markets_main1584471020.png-32537

స్టాక్‌ మార్కెట్లు ఇంత తీవ్ర స్థాయిలో పడిపోవడానికి మన దేశంలో వ్యాపారాలు ఏమీ దెబ్బతినలేదని.. లేదా ఆర్థిక వ్యవస్థకు వచ్చిన తీవ్రమైన సమస్య ఏమీ లేదన్నారు క్యాపిటల్‌వయా గ్లోబల్‌ రీసెర్చ్‌ లిమిటెడ్‌కు చెందిన గౌరగ్‌గార్గ్‌. నిఫ్టీ-50 ఈ స్థాయి నుంచి కోలుకునేందుకు చక్కని అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. సమీప కాలానికి మార్కెట్‌ ఆకర్షణీయంగా ఉందన్నారు. 10,500 నిరోధం ఎదురుకావచ్చని అంచనా వ్యక్తం చేశారు. నిఫ్టీ, సెన్సెక్స్‌ ఇప్పటికే 25 శాతం వరకు దిద్దుబాటుకు గరి అయిన విషయాన్ని గుర్తు చేశారు. చారిత్రక గమనాలను చూసినా, మార్చి 13 సెషన్‌లో రివకరీ అయిన తీరును గమనించినా మార్కెట్లు కోలుకునేందుకు అవకాశాలున్నట్టు చెప్పారు. అంతర్జాతీయంగా కరోనా వైరస్‌ కారణంగా ప్రతికూల సెంటిమెంట్‌ ఫలితమే మార్కెట్‌ పతనంగా పేర్కొన్నారు. అంతేకానీ, వ్యాపార పరిస్థితులు దెబ్బతినడం లేదా ఆర్థిక వ్యవస్థ ప్రతికూల స్థితిలోకి వెళ్లిపోవడం ఏమీ జరగలేదన్న విషయాన్ని గార్గ్‌ గుర్తు చేశారు.  

 

‘‘2008 నాటి మార్కెట్‌ పతనం నుంచి 2009 ఫిబ్రవరి వరకు ఎస్‌అండ్‌పీ 500 సూచీ తన విలువలో సగం మేర కోల్పోయింది. ఆ తర్వాత ఐదేళ్ల కాలంలో 153 శాతం పెరిగింది. ఆ సమయంలో మార్కెట్లలోకి ప్రవేశించిన ఏ ఇన్వెస్టర్‌ అయినా అద్భుతమైన రాబడులను అందుకున్నారు. ఇతర మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లలో ప్రస్తుతం పతనం కొంచెం తక్కువగానే ఉంది. ఆకర్షణీయమైన వ్యాల్యూషన్ల వద్ద ఉన్న వాటి కొనుగోలుకు చక్కని సమయం ఇది. ప్రస్తుత పరిస్థితి 2008 తరహాది కాదు. అప్పుడు లిక్విడిటీ సంక్షోభం పతనానికి దారితీసింది. కానీ, ప్రస్తుతమున్న సందర్భాల్లో రికవరీ చాలా వేగంగా ఉంటుంది’’ అంటూ గౌరవ్‌గార్గ్‌ పరిస్థితి గురించి వివరించారు. ఇన్వెస్టర్లు తమ వద్దనున్న నిధులను ఒకే విడత, ఒకే స్టాక్‌ లేదా ఒకే రంగంలో ఇన్వెస్ట్‌ చేయకుండా, క్రమంగా ఇన్వెస్ట్‌ చేసుకోవాలని ఆయన సూచించారు. తమ వెసులుబాటును బట్టి పలు రంగాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలని సూచించారు. దీనివల్ల రిస్క్‌లో వైవిధ్యం నెలకొని, రాబడులు మెరుగ్గా ఉంటాయన్నారు.

 

మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడులు స్థిరంగా రావడం ఈక్విటీల పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న నమ్మకానికి నిదర్శంగా పేర్కొన్నారు గార్గ్‌. మార్కెట్లు తీవ్ర అమ్మకాలను చవిచూస్తున్నా కానీ, ఇన్వెస్టర్లు వ్యాల్యూ బయింగ్‌ అవకాశంగా చూస్తున్నట్టు తెలిపారు. వ్యాల్యూ బయింగ్‌ చేసే వారు దీర్ఘకాల దృష్టితో ఉంటారని, కనుక సమీప కాలంలో వారు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోకపోవచ్చన్నారు. అయితే, ఈ సమయంలో స్టాక్స్‌ ఎంపిక విషయంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కంపెనీల బలాబలాలను అంచనా వేయడం, భవిష్యత్తు ప్రణాళికలు తదితర వాటిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. వినియోగ స్టాక్స్‌ కొనుగోళ్లకు మంచి అవకాశమని సూచించారు. 



You may be interested

ఈ స్టాక్స్‌కు మంచి డిమాండ్‌..!

Wednesday 18th March 2020

ఫిబ్రవరి రెండో వారం నుంచి మన ఈక్విటీ మార్కెట్లు నష్టాల ప్రయాణం మొదలుపెట్టాయి. కరోనా వైరస్‌ అంతర్జాతీయంగా వేగంగా విస్తరిస్తుండడంతో విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో అమ్మకాలకు దిగారు. ఫిబ్రవరి మొదటి సగ భాగం కూడా మార్కెట్లు పెరిగిందేమీ లేదు. స్థిరీకరణ దశలో ఉండి, రెండో భాగంలో అమ్మకాల కారణంగా నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఇప్పటి వరకు విదేశీ ఇన్వెస్టర్లు రూ.50వేల కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నారు. అయితే, దేశీయ ఇనిస్టిట్యూషనల్‌

చివరికి పతనమే- ఆగని అమ్మకాలు

Tuesday 17th March 2020

సెన్సెక్స్‌ 811 పాయింట్లు డౌన్‌ 230 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ మూడేళ్ల తదుపరి నిఫ్టీ 9,000 దిగువకు ప్రయివేట్‌ బ్యాంక్స్‌, మీడియా బోర్లా 59 శాతం దూసుకెళ్లిన యస్‌ బ్యాంక్‌  ప్రపంచ మహమ్మారిగా అవతారమెత్తిన కోవిడ్‌-19 ధాటికి మరోసారి దేశీ స్టాక్‌ మార్కెట్లు కుదేలయ్యాయి. సెన్సెక్స్‌ 811 పాయింట్లు పతనమై 30,579 వద్ద నిలవగా.. నిఫ్టీ 230 పాయింట్లు కోల్పోయి 8.967 వద్ద ముగిసింది. వెరసి మూడేళ్ల తదుపరి నిఫ్టీ 9,000 పాయింట్ల మైలురాయి దిగువన ముగిసింది.

Most from this category