News


భద్రం బీకేర్‌ఫుల్‌ ఇన్వెస్టరూ!

Thursday 4th October 2018
Markets_main1538637489.png-20854

నిపుణుల సూచన
దేశీయ మార్కెట్లలో బేర్స్‌ చెలరేగుతున్న ప్రస్తుత సమయంలో ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, అప్రమత్తంగా ఉండాలని మార్కెట్‌ నిపుణులు నొక్కి చెబుతున్నారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఒడిదుడుకులను తీసుకువస్తాయని, జాగ్రత్తగా లేకుంటే పెట్టుబడి మట్టికొట్టుకుపోతుందని హెచ్చరిస్తున్నారు. ఇన్వెస్టర్లు క్వాలిటీ కంపెనీలనే నమ్ముకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో ఎండమావుల వెంట పరుగెట్టవద్దని సలహా ఇస్తున్నారు. బలమైన కార్పొరేట్‌ గవర్నెన్స్‌, ముందు చూపు, మంచి వ్యాపారం, లాభదాయక ఫలితాలు ఉన్న కంపెనీల షేర్లను ఆకర్షణీయ వాల్యూషన్లకు దిగివచ్చినప్పుడు కొనుగోలు చేయమని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ సూచించింది. వినిమయం, ఐటీ, రూరల్‌ రంగాల స్టాకులు మిడ్‌టర్మ్‌లో మంచి రాబడినిస్తాయని అంచనా వేసింది. రూపాయి పతనం ఆగుతుందని బ్రోకరేజ్‌ సంస్థ భావిస్తోంది. ఇరాన్‌ ఆంక్షలపై స్పష్టత వస్తే క్రూడాయిల్‌ ధర దిగిరావచ్చని అభిప్రాయపడింది. దీనికితోడు ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా రూపీ పతనానికి అడ్డుకట్ట పడవచ్చని అంచనా వేసింది. రూపీ క్షీణతను ఆపేందుకు ప్రభుత్వం వద్ద ఇంకా పలు సాధనాలున్నాయని తెలపింది. 2013తో పోలిస్తే ప్రస్తుతం ఎకానమీ చాలా బాగుందని, అందువల్ల రూపీ సంక్షోభం రాకపోవచ్చని తెలిపింది. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ విషయంలో ప్రభుత్వం రంగప్రవేశం చేయడం వల్ల ఇకపై ఈ గందరగోళం సద్దుమణగవచ్చని అంచనా వేసింది. నాణ్యమైన ఎన్‌బీఎఫ్‌సీలను పరిశీలించవచ్చని సూచించింది. 



You may be interested

ఈ పతనం.. ఎందుకు?

Thursday 4th October 2018

దేశీ స్టాక్‌మార్కెట్‌ ఆరంభంలోనే భారీగా పతనమైంది. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు 1.5 శాతానికిపైగా పడిపోయాయి. సమయం గడిచే కొద్ది నష్టాలు కూడా పెరిగాయి. మధ్యాహ్నాం కల్లా ఇండెక్స్‌లు 2.5 శాతంమేర క్షీణించాయి. సెన్సెక్స్‌-30 దాదాపు 850 పాయింట్లమేర పడిపోయింది. నిఫ్టీ-50 దాదాపుగా 250 పాయింట్లమేర క్రాష్‌ అయ్యింది. 10,600 మార్క్‌ను పరిక్షీస్తోంది. నిఫ్టీలో సుమారు 41 స్టాక్స్‌ నష్టాల్లోనే ఉన్నాయి. ఐషర్‌ మోటార్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, గెయిల్‌

ఆగని ఐటీ షేర్ల పతనం

Thursday 4th October 2018

మార్కెట్‌ పతనం గురువారం గంట గంటకు పెరుగుతోంది. మధ్యాహ్నం గం.12:00లకు సెన్సెక్స్‌ 800 పాయింట్ల నష్టపోగా, నిఫ్టీ సూచీ 250 పాయింట్ల నష్టపోయి 10600 దిగువకు చేరుకుంది. మార్కెట్‌ పతనంతో భాగంగా అన్ని రంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. అత్యధికంగా ఐటీ రంగానికి చెందిన షేర్లు నష్టపోయాయి. డాలర్‌ మారకంలో రూపాయి కనిష్టానికి చేరుకున్నప్పటికీ.., నేటి ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు నష్టాల బాట పట్టడం గమనార్హం. ఎన్‌ఎస్‌ఈలో

Most from this category