News


నిఫ్టీ పొజిషన్‌ హెడ్జింగ్‌కు పుట్‌ బటర్‌ఫ్లై వ్యూహం!

Monday 3rd February 2020
Markets_main1580712596.png-31466

ఫిబ్రవరి సీరిస్‌ను సూచీలు నెగిటివ్‌ అడుగులతో ఆరంభించాయి. నిఫ్టీ కీలకమైన 12000 పాయింట్లకు బాగా దిగువకు వచ్చింది. మరోవైపు బడ్జెట్‌ అనంతరం వీఐఎక్స్‌ ఒక్కమారుగా ఎగిసింది. ఈ నేపథ్యంలో నిఫ్టీలో ఉన్న పొజిషన్లు కాపాడుకునేందుకు మోడిపైడ్‌ పుట్‌ బటర్‌ఫ్లై వ్యూహం అవలంబించాలడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో సూచీలు ప్రస్తుతమున్న స్థానానికి దగ్గరగా  ఒక పుట్‌ను కొనడం, అంతకన్నా బాగా దిగువ పుట్స్‌ రెండిటిని విక్రయించడం చేస్తారు. అనంతరం అమ్మిన పుట్స్‌కు దగ్గరలోని పుట్‌ ఒకలాట్‌ను కొనడం జరగుతుంది. డౌన్‌బ్రేకవుట్‌లో ఈ వ్యూహం మంచి ఫలితమిస్తుంది. రిస్కుకూడా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
స్ట్రాటజీ...
వ్యూహంలో పుట్‌ ధరలు శనివారం ముగింపు ప్రకారం గణించి వివరించడం జరిగింది. సోమవారం ధరలకు అనుగుణంగా వ్యూహంలో స్వల్ప మార్పులు చేసుకోవాలి. 


- 11900 పుట్‌(ఫిబ్రవరి 6 ఎక్స్‌పైరీ) ఒక లాట్‌ను రూ. 109 దగ్గర కొనాలి.(ఒక పుట్‌ లాట్‌లో 75 షేర్లుంటాయి)
- 11700 పుట్(ఫిబ్రవరి 6 ఎక్స్‌పైరీ)రెండు లాట్లను ఒక్కొక్కటి రూ. 46 వద్ద విక్రయించాలి.
- 11550 పుట్‌(ఫిబ్రవరి 6 ఎక్స్‌పైరీ) ఒక లాట్‌ను రూ. 27 వద్ద కొనాలి. 
- వ్యూహం కాలపరిమితి 4 రోజులు. బ్రేక్‌ ఈవెన్‌ పాయింటు 11866 పాయింట్లు.
- రిస్కురివార్డు 3.5:1. స్టాప్‌లాస్‌ 11900 పాయింట్ల పైన. టార్గెట్‌ 11700 పాయింట్ల దిగువన.



You may be interested

ఈ 40 షేర్లకు బడ్జెట్‌ బూస్ట్‌!

Monday 3rd February 2020

బడ్జెట్‌లో సానుకూల ప్రతిపాదనల ఎఫెక్ట్‌ జాబితాలో ఐటీ, ఫుట్‌వేర్‌ తదితర రంగాలు ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్‌ రంగ షేర్లకూ లబ్డి కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో పలువురు నిరాశపడినప్పటికీ.. కొన్ని రంగాలకు మేలు జరగనున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఆయా రంగాలలోని కంపెనీలకు లబ్ది చేకూరే వీలున్నట్లు విశ్లేషిస్తున్నారు. బడ్జెట్‌ ప్రతిపాదనలతో ఏఏ రంగాలు, కంపెనీలపై సానుకూల ప్రభావం పడనుందన్న అంచనాల వివరాలు చూద్దాం.. ఎల్‌టీసీజీ ప్రస్తావనలేదు.. మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా బడ్జెట్‌ వెలువడలేదని

52 వారాల గరిష్టానికి 15 షేర్లు

Monday 3rd February 2020

సోమవారం ఎన్‌ఎస్‌ఈలో సుమారు 15 షేర్లు 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి. 52 వారాల గరిష్టానికి చేరిన షేర్లలో ఏజీసీ నెట్‌వర్క్స్‌, క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జూమర్‌ ఎలక్ట్రికల్స్‌, నెస్ట్లే ఇండియా, రుచీ సోయా ఇండస్ట్రీస్‌, సిర్కా పెయింట్స్‌ ఇండియా, యూనిటెక్‌, విశేష్‌ ఇన్ఫోటెక్‌లు ఉన్నాయి. 52 వారాల కనిష్టానికి 83 షేర్లు  ఎన్‌ఎస్‌ఈలో 83 షేర్లు 52 వారాల కనిష్టానికి చేరాయి. వీటిలో అలహాబాద్‌ బ్యాంక్‌, భారత్‌ హెవీ ఎలక్ట్రీకల్స్‌ లిమిటెడ్‌, సీఎస్‌బీ

Most from this category