News


ఇండెక్స్‌ ఫండ్స్‌ కూడా పోర్ట్‌ఫోలియోలో ఉండాలి

Sunday 17th November 2019
Markets_main1574013859.png-29650

మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారు కొంత మొత్తం పెట్టుబడులను ఇండెక్స్‌ ఫండ్స్‌కు కూడా కేటాయించుకోవాలని ఆర్థిక సలహాదారుల సూచన. ముఖ్యంగా ఇటీవలి కాలంలో మార్కెట్లను పరిశీలిస్తే.. ప్రధాన సూచీలు లాభాలను ఇచ్చాయి. కానీ, సూచీల్లోనే సగం స్టాక్స్‌ ఏ మాత్రం రాబడులను ఇవ్వలేదు. అయినా నిఫ్టీ నికరంగా లాభాలను ఇవ్వడం చూశాం. దీంతో ఇండెక్స్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వారు సూచీల ర్యాలీతో కచ్చితంగా లాభపడ్డారు. నిజానికి ఇన్వెస్టర్లలోనూ ఇండెక్స్‌ ఫండ్స్‌ (వీటినే పాసివ్‌ ఫండ్స్‌ అని కూడా అంటారు) పట్ల ఆకర్షణ పెరుగుతున్నట్టు తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల్లో, పాసివ్‌ ఫండ్స్‌ ఆస్తుల విలువ గత కొన్ని నెలలుగా పెరుగుతుండడం దీన్నే సూచిస్తోంది.

 

‘‘గడిచిన ఏడాది కాలంలో మార్కెట్‌ కరెక్షన్‌లో ఉన్నప్పుడు.. యాక్టివ్‌గా పనిచేసే మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలను ఇండెక్స్‌ ఫండ్స్‌ పరంగా అధిగమించాయి. చాలా మంది ఇన్వెస్టర్లు గత పనితీరు ఆధారంగా ఏ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేయాలన్నది నిర్ణయించుకుంటారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు ఈ పథకాలను (పాసివ్‌ ఫండ్స్‌) విక్రయిస్తున్నారు’’ అని లాడర్‌7 ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌కు చెందిన సురేష్‌ సెడగోపన్‌ అన్నారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ అడ్వైజర్లు ఇండెక్స్‌ ఫండ్స్‌ను పోర్ట్‌ఫోలియోకు జోడించుకునేందుకు ఇది అనువైన సమయంగా పేర్కొంటున్నారు. ‘‘తక్కువ వ్యయాలున్న సాధనం ఇది. బెంచ్‌మార్క్‌తో పోటీపడడం కష్టంగా ఉన్న సమయంలో తక్కువ రిస్కీ ఆప్షన్‌. తమ పెట్టుబడుల్లో కొంత మేర ఇండెక్స్‌ ఫండ్స్‌కు తప్పుకుండా కేటాయించుకోవాలి’’ అని ప్లాన్‌ అహెడ్‌ వెల్త్‌ అడ్వైజర్స్‌ వ్యవస్థాపకుడు విషాల్‌ ధావన్‌ సూచించారు.  

 

మార్కెట్‌ అన్నది ఇండెక్స్‌ ఫండ్స్‌ దిశగా పెద్ద ఎత్తున అడుగులు వేయడం మొదలైందంటున్నారు ఫండ్స్‌ అడ్వైజర్లు, ఆర్థిక సలహాదారులు.  గత రెండేళ్లలో లార్జ్‌క్యాప్‌ విభాగంలో ఇండెక్స్‌ ఫండ్స్‌ పనితీరు ఇదే తెలియజేస్తుందంటున్నారు. ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ ఫండ్స్‌(యాక్టివ్‌)తో పోలిస్తే ఇండెక్స్‌ ఫండ్స్‌లో వ్యయాలు తక్కువ. ఇన్వెస్టర్లకు 0.5-1.5 శాతం వరకు వార్షికంగా ఇండెక్స్‌ ఫండ్స్‌లో ఆదా అవుతుంది. చూడ్డానికి స్వల్ప మొత్తమే అయినా, దీర్ఘకాలంలో సంపద సృష్టిలో భారీ అంతరానికి ఇది దారితీస్తుందని గుర్తు పెట్టుకోవాలి. అధిక అనిశ్చితులు, పథకాల పనితీరును పరిశీలించుకునే ఇబ్బందులను ఇండెక్స్‌ ఫండ్స్‌ తప్పిస్తాయని జెర్మినేట్‌ వెల్త్‌ సొల్యూషన్స్‌ వ్యవస్థాపకుడు సంతోష్‌జోసెఫ్‌. You may be interested

అంతర్జాతీయ అంశాలే నడిపిస్తాయ్‌..!

Monday 18th November 2019

అమెరికా–చైనాల మధ్య పాక్షికంగా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం  గురువారం ఎఫ్‌ఓఎంసీ మినిట్స్‌ వెల్లడి- ఈవారంలో రేంజ్‌ బౌండ్‌కు చాన్స్‌: సామ్కో సెక్యూరిటీస్‌ ముంబై: కంపెనీల క్యూ2(జూలై–సెప్టెంబర్‌) ఫలితాల సీజన్‌ దాదాపుగా పూర్తైన నేపథ్యంలో అంతర్జాతీయ అంశాలే ఈ వారంలో దేశీ స్టాక్‌ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అమెరికా–చైనాల మధ్య పాక్షికంగా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని శ్వేతసౌధానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు తాజాగా

ఎకానమీ ఇప్పట్లో కోలుకోదా..? మార్కెట్ల పరిస్థితి?

Sunday 17th November 2019

హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణం మరింత తగ్గడంతో ఆర్థిక మందగమనంపై ఆందోళనలు అధిగమయ్యాయి. ఆర్థిక రికవరీ తక్షణమే ఉండొచ్చనేదాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ తోసిపుచ్చారు. ఆర్థిక మందగమనం, ఆర్‌బీఐ రేట్ల కోతపై ఆశలు సన్నగిల్లడంతో స్టాక్‌ మార్కెట్లు గతవారం ఫ్లాట్‌గా ముగిశాయి. మరి ఈ సమయంలో విశ్లేషకులు, మార్కెట్‌ నిపుణులు ఏమంటున్నారో వారి ట్వీట్లను గమనిస్తే తెలుస్తుంది.   ఈ సమయంలో టెలికం కంపెనీలు ఏజీఆర్‌ బకాయిలను ఖాతాల్లో చూపించాయి. ప్రభుత్వం పెద్ద ఉపశమనం

Most from this category