News


బడా షేర్లపైనే ఇన్వెస్టర్ల దృష్టి!

Wednesday 16th October 2019
Markets_main1571209495.png-28921

ప్రస్తుత ఒడిదుడుకుల మార్కెట్లో ఆయా రంగాల్లో టాప్‌ స్టాకులను మాత్రమే ఇన్వెస్టర్లు నమ్ముకుంటున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే ఆయా రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న కంపెనీ మార్కెట్‌ విలువకు, దాని తర్వాత రెండో స్థానంలో ఉన్న కంపెనీ మార్కెట్‌ విలువకు మధ్య వ్యత్యాసం గత రెండేళ్లలో మరింత పెరుగుతూ వస్తోందని వివరిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం రిస్కీ మార్కెట్లో కేవలం అగ్రస్థానంలో ఉన్న కంపెనీల షేర్లపై మాత్రమే ఇన్వెస్టర్లు భరోసా ఉంచడమేనని తెలిపారు. గత రెండేళ్లలో ఐటీ, బ్యాంకింగ్‌, ఆటో, స్టీల్‌ తదితర రంగాల్లోని టాప్‌ కంపెనీల షేర్లు, అదే రంగంలోని రెండో స్థానంలో ఉన్న కంపెనీ షేరుతో పోలిస్తే అవుట్‌పెర్ఫామ్‌ చేశాయి. అగ్రగామి కంపెనీలు డౌన్‌ట్రెండ్‌లో మార్జిన్‌, రెవెన్యూల పరంగా తక్కువ ఒత్తిడి ఎదుర్కొంటాయని ఇన్వెస్టర్లు నమ్మడమే ఇందుకు కారణం.

ఉదాహరణకు ఐటీ దిగ్గజం టీసీఎస్‌ మార్కెట్‌ క్యాప్‌ తన సమీప ప్రత్యర్ధి ఇన్ఫోసిస్‌ కన్నా రెండేళ్లలో రెట్టింపయింది. ప్రస్తుతం ఇరు కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ వ్యత్యాసం రూ.4.2 లక్షల కోట్లకు చేరింది. 2017లో ఈ వ్యత్యాసం రూ. 2.4 లక్షల కోట్లు మాత్రమే ఉంది. ఇదే విధంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్‌ క్యాప్‌ ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్‌ క్యాప్‌ కన్నా 2017లో 2.3 లక్షల కోట్ల రూపాయలు అధికంకాగా, ప్రస్తుతం ఈ గ్యాప్‌ రూ. 3.8 లక్షల కోట్లకు పెరిగింది. ఒడిదుడుకుల మార్కెట్లో మదుపరులు రక్షణాత్మకంగా వ్యవహరించేందుకు మొగ్గు చూపుతున్నారని, దీంతో ప్రతి రంగంలో మార్కెట్‌ లీడర్‌పైనే ఎక్కువ నమ్మకం పెడుతున్నారని ఎలారా సెక్యూరిటీస్‌ విశ్లేషించింది. ఇలాంటి లీడర్‌ కంపెనీల ఎర్నింగ్స్‌ అంచనాలు బలంగా ఉంటున్నాయని తెలిపింది. రెండేళ్లలో టాప్‌ కంపెనీకి, నెంబర్‌2 కంపెనీకి మధ్య నికరలాభాల్లో వ్యత్యాసం కూడా పెరిగింది. ఉదాహరణకు 2017 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌, ఇన్ఫీ మధ్య నికర లాభంలో వ్యత్యాసం రూ. 500 కోట్లుండగా, 2019 ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యత్యాసం 1500 కోట్లను దాటింది. మార్కెట్స్‌లో ఆందోళన రాజ్యం చేస్తూ, ఎకానమీలో వృద్ది మందగిస్తూ ఉన్న సమయాల్లో ఇన్వెస్టర్లు లీడర్‌ కంపెనీలనే రక్షణ కోసం ఆశ్రయిస్తారని మోతీలాల్‌ ఓస్వాల్‌ తెలిపింది. 



You may be interested

బ్రోకరేజ్‌లు టార్గెట్‌ పెంచిన షేర్లివే..!

Wednesday 16th October 2019

అమెరికా - చైనాల వాణిజ్య ఒప్పందం, ఆర్థిక రంగంలోని అనిశ్చితి, మార్కెట్‌ వర్గాలు ప్రభుత్వం నుంచి మరిన్ని ఉద్దీపన చర్యలు ఆశించడటం లాంటి ప్రతికూలాంశాలు నెలకొన్న నేపథ్యంలో దేశీయ కంపెనీలు తమ రెండో త్రైమాసిక ఫలితాలకు విడుదలకు సిద్ధమైమయ్యాయి. ఈ తరుణంలో క్యూ2 ఫలితాలు ఎలాంటాయోనని​మార్కెట్‌ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కంపెనీల ఆదాయాలు ఆశించిన స్థాయిలో ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎఫ్‌ఎంజీసీ రంగానికి చెందిన అవెన్యూ సూపర్‌ మార్ట్‌,

బజాజ్‌ కన్జ్యూమర్‌ 15% ర్యాలీ!

Wednesday 16th October 2019

  బజాజ్‌ రీసోర్సెస్‌, బజాజ్‌ కన్జ్యూమర్‌ కేర్‌లో తన 22 శాతం వాటాను ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవి ద్వారా రూ. 628 కోట్లకు మంగళవారం విక్రయించింది. ఫలితంగా బజాజ్‌ కన్జ్యూమర్‌ కేర్‌ షేరు విలువ బుధవారం ట్రేడింగ్‌లో ఉదయం 11.01 సమయానికి  15.76 శాతం లాభపడి రూ. 235.75 వద్ద ట్రేడవుతోంది. బజాజ్‌ రీసోర్సెస్‌ మొత్తంగా 3,22,65,100 బజాజ్‌ కన్జ్యూమర్‌ కేర్‌ షేర్లను షేరు రూ. 194.56 చొప్పున, రూ.

Most from this category