News


ప్రాఫిట్‌ బుకింగ్‌కు ఇన్వెస్టర్ల మొగ్గు

Friday 29th November 2019
Markets_main1575023640.png-29957

డిసెంబర్‌ సీరిస్‌ను సూచీలు నష్టాలతో ఆరంభించాయి. జీడీపీ గణాంకాలు విడుదల కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌కు మొగ్గుచూపారు. జీడీపీ ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోతున్న అంచనాలు మార్కెట్‌పై ప్రభావం చూపాయి. అయితే ఇది స్వల్పకాలిక విరామమేనని, మిడ్‌- లాంగ్‌ టర్మ్‌కు సూచీల మూడ్‌ పాజిటివ్‌గానే ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎఫ్‌ఐఐ నిధుల రాకడ, అంతర్జాతీయ పరిణామాలు పాజిటివ్‌గా ఉండడం.. మార్కెట్‌పై పాజిటివ్‌ ప్రభావం కొనసాగిస్తాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ తెలిపింది. లిక్విడిటీ వరద కారణంగా సూచీలు ముందుకే పయనిస్తాయని తెలిపింది. అయితే స్వల్పకాలానికి కొంత ఒడిదుడుకులుండొచ్చన్నారు. 
భిన్నాభిప్రాయాలు
కొందరు నిపుణులు నిఫ్టీ 12500 పాయింట్లను త‍్వరలో తాకుతుందని భావిస్తుండగా, కొందరుమాత్రం రిస్కులు కొనసాగుతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ఎకానమీలో ఎలాంటి పురోగతి లేకపోవడం సెంటిమెంట్‌ను దెబ్బ తీస్తుందని ఈక్వినోమిక్స్‌రిసెర్చ్‌ తెలిపింది. వచ్చే ఆరునెలలు స్థూల ఆర్థికాంశాలు ఇలాగే ఉంటే రిస్కు ఎక్కువైతుందని తెలిపింది. అలాంటప్పుడు మార్కెట్‌ కరెక‌్షన్‌లోకి జారుతుందని తెలిపింది. స్టీవార్ట్‌ అండ్‌ మాక్రిట్చ్‌ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. మందగమనం సుదీర్ఘకాలముంటే వినిమయం, ప్రైవేట్‌ వ్యయంపై నెగిటివ్‌ ప్రభావం ఉంటుందని తెలిపింది. మార్కెట్లో విస్తృత స్థాయిలో షేర్లు ర్యాలీలో పాల్గొనడం లేదని, కొన్ని రంగాలు లేదా కొన్ని షేర్ల మద్దతుతో ర్యాలీ కొనసాగడం ఇబ్బందికరమని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలిపింది. ఇలాంటి స్థితిలో మార్కెట్‌ను నడుపుతున్న కొన్ని స్టాకుల్లో ఏదైనా నెగిటివ్‌ వార్త వస్తే మొత్తం మార్కెట్‌ మూడ్‌ నెగిటివ్‌లోకి జారుతుందని పేర్కొంది. ఆర్‌బీఐ రేట్‌ కట్‌ నిలిపివేస్తే మార్కెట్‌ మూడ్‌ వెనక్కు తగ్గుతుందని టార్గెట్‌ ఇన్వెస్టింగ్‌ తెలిపింది. యూఎస్‌ చైనా డీల్‌ కుదరకపోవడం, మరికొన్ని కంపెనీలు డిఫాల్ట్‌ కావడం లాంటివి మార్కెట్‌కు పొంచిఉన్న ముప్పులని జియోజిత్‌ సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది. 
వాల్యూషన్లు సమస్య కాదు
మార్కెట్లో ప్రీమియం వాల్యూషన్లు ఆందోళనకరం కాదని ఎక్కువమంది అనలిస్టులు అభిప్రాయపడ్డారు. మార్కెట్‌ను నడిపిస్తున్న టాప్‌ రంగాలు, కంపెనీల షేర్లను మినహాయించి చూస్తే వాల్యూషన్లు చాలా చౌకగా కనిపిస్తాయని తెలిపారు. అందువల్ల మొత్తం మార్కెట్‌ను పరిశీలిస్తే వాల్యూషన్లు చౌకగా ఉన్నాయనే చెప్పవచ్చన్నారు. మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఇంకా సరాసరి స్థాయిల కన్నా తక్కువే ఉందని అందువల్ల ప్రధాన సూచీల్లో మరో 5- 10 శాతం పెరుగుదలకు అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. You may be interested

రికార్డుల ర్యాలీకి బ్రేక్‌..!

Friday 29th November 2019

సూచీల గరిష్టస్థాయి వద్ద లాభాల స్వీకరణ 336.36 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌ సూచీల రెండు రోజుల రికార్డుల ర్యాలీకి శుక్రవారం బ్రేక్‌ పడింది. సూచీల జీవితకాల గరిష్టస్థాయిల వద్ద ట్రేడర్ల లాభాల స్వీకరణ, నేడు రెండో క్వార్టర్‌ జీడీపీ గణాంకాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత ఇందుకు కారణమయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల వాతావరణం సెంటిమెంట్‌ను కొంతమేర దెబ్బతీసింది. మార్కెట్‌ ముగిసే సరికి సెన్సెక్స్‌ 336 పాయింట్ల నష్టంతో 40,793.81 వద్ద స్థిరపడగా,

రిలయన్స్‌ రిఫైనింగ్‌ లాభాలను జియో అధిగమిస్తుంది

Friday 29th November 2019

‘రిలయన్స్‌ జియో లాభాలు, రిలయన్స్‌ రిఫైనింగ్‌, పెట్రోకెమికల్‌ పాలిమర్‌ వ్యాపారాల లాభాలను అధిగమిస్తుంది. దీని ప్రభావం కంపెనీ షేరు ధరలో కనిపిస్తుంది’ అని ఎండీ, కేఆర్‌ చోక్సి, దేవన్‌ చోక్సి ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లో.. రిలయన్స్‌ జియో హవా..   రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వినియోగధారిత వ్యాపారాలైన జియో, రిటైల్‌ ముందుకెళ్లేకొద్ది మరింతగా లాభాలను తెచ్చిపెడతాయి. రిలయన్స్‌ జియో అందించే లాభాలు 2021 లో, ప్రస్తుతం

Most from this category