News


అధిక రాబడులకు...ఎఫ్‌ఐఐలు ఇండియాకు రావాల్సిందే!

Wednesday 3rd July 2019
Markets_main1562149197.png-26770

ఈక్విటీ పెట్టుబడులపై మంచి రాబడి సంపాదించాలని భావించే విదేశీ మదుపరులు ఇండియా ఈక్విటీలను మరువలేరని, ప్రపంచంలో భారత ఎకానమీ చాలా బలంగా కనిపిస్తోందని మాన్యులైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ అభిప్రాయపడింది. ట్రేడ్‌ వార్‌ నేపథ్యంలో చైనా అస్థిరతను ఎదుర్కొంటోందని, విదేశీ మదుపరులకు ఇప్పుడు ఒక సురక్షితమైన, పరుగులు తీసే ఎకానమీ కావాలని సంస్థ ఎండీ రానా గుప్తా చెప్పారు. భారత్‌ తన ఎకానమీకి లక్షల కోట్ల డాలర్లను జత చేస్తోందన్నారు. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ ఈక్విటీలపై పాజిటివ్‌గా ఉన్నారని చెప్పారు. ఈ ఏడాది స్థిర ప్రభుత్వ అంచనాలతో ఈక్విటీల్లోకి దాదాపు 1100 కోట్ల డాలర్లు వచ్చాయని తెలిపారు. ఎఫ్‌ఐఐల దన్నుతో దేశీయ సూచీలు ఆల్‌టైమ్‌ హైల వద్ద కదలాడుతున్నాయని తెలిపారు. 
అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై సందేహాలు నెలకొన్న తరుణాన, స్థానిక డిమాండ్‌తో ముందుకు కదిలే మార్కెట్ల కోసం ఇన్వెస్టర్లు చూస్తున్నారని, అలాంటి వాటిలో భారత్‌ ముందుందని తెలిపారు. దీంతో పాటు తక్కువ వడ్డీరేట్లు, స్థిర ప్రభుత్వం కూడా మదుపరులను ఆకర్షిస్తున్నాయన్నారు. తమ ఫండ్‌ గత మూడేళ్లలో సరాసరిన ఏడాదికి 12 శాతం రాబడులు ఇచ్చిందని తెలిపారు. ప్రస్తుతం తాము ప్రైవేట్‌ బ్యాంకులు, బీమా కంపెనీలపై ఎక్కువ ఫోకస్‌ చేస్తున్నామని తెలిపారు. వీటితో పాటు గృహ నిర్మాణం, సెరామిక్స్‌, పెయింట్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌ రంగాలు సైతం బాగున్నాయని గుప్తా చెప్పారు. దేశీయ స్టాక్స్‌కు చమురు ధరలు పెరగడం, అంతర్జాతీయ మాంద్యం, వర్దమాన మార్కెట్లలోకి నిధుల ప్రవాహం సన్నగిల్లడం కీలక రిస్కులని వివరించారు. 


FPI

You may be interested

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్‌

Wednesday 3rd July 2019

అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలకు తోడు ఎల్లుండి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతతో మార్కెట్‌ బుధవారం ఫ్లాట్‌గా ముగిసింది. సెన్సెక్స్‌ 22 పాయింట్లు లాభపడి 39,839 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 6 పాయింట్లు స్వల్పంగా లాభపడి11,916 వద్ద ముగిసింది. సూచీలకు ఇది వరుసగా మూడోరోజు లాభాల ముగింపు. ఇంట్రాడేలో బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్స్‌, రియల్టీ, మీడియా షేర్లకు కొనుగోళ్లు మద్దతు లభించింది. అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌లకు రూ.74,000కోట్ల బెయిలవుట్‌

Wednesday 3rd July 2019

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన భారతీ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌), మహానగర్‌ టెలిపోన్‌ నిగమ్‌(ఎమ్‌టీఎన్‌ఎల్‌)లకు రూ.74,000 కోట్ల బెయిఅవుట్‌ ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్కీమ్‌లో ఎక్సి‍ట్‌ ప్యాకేజితో పాటు అదనపు ఐదు శాతం పరిహారం, 4జీ స్పెక్ట్రమ్‌ నిబంధనలు, మూలధన వ్యయం మిళితమై ఉన్నాయి. ఆర్ధిక సంవత్సరం 2019 చివరి నాటికి అధిక రుణాలు కలిగిన ప్రభుత్వ రంగ సంస్థల్లో, రూ.13,804కోట్లతో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇండియా మొదటి స్థానంలో ఉంది. మూడవ స్థానంలో

Most from this category