News


‘నాణ్యమైన స్టాక్స్‌ను కొనుగోలు చేసుకోవచ్చు’

Monday 21st October 2019
Markets_main1571598079.png-29012

మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఉన్న అధిక వ్యాల్యూషన్లు పూర్తిగా ఆవిరైపోయాయని, ప్రస్తుత  స్థాయి నుంచి, వచ్చే రెండు మూడేళ్ల కాలం కోసం మంచి నాణ్యమైన, అధిక వృద్ధి అవకాశాలు కలిగిన మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చన్నది తమ అభిప్రాయంగా కోటక్‌ మహీంద్రా ఏఎంసీ ఈక్విటీ రీసెర్చ్‌ హెడ్‌ షిబాని కురియన్‌ పేర్కొన్నారు. మార్కెట్‌కు సంబంధించి వివిధ అంశాలపై ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.

 

‘‘కార్పొరేట్‌ పన్ను తగ్గింపు అన్నది చరిత్రాత్మక సంస్కరణ. దీని ప్రభావం కొంత కాలానికి కనిపిస్తుంది. పెట్టుబడుల ఆధారిత వృద్ధిని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. నిర్మాణాత్మక సంస్కరణలు ఆర్థిక వ్యవస్థను తదుపరి దశకు తీసుకెళతాయి. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు తర్వాత మన దేశం, ఇతర వర్ధమాన దేశాలకు పోటీగా మారింది. దీంతో కంపెనీలు నూతన సామర్థ్యాల కల్పన దిశగా అడుగులు వేయగలవు. సమీప కాలంలో కొంత మేర అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతాయి. అంతర్జాతీయ అంశాలకు తోడు దేశీయంగా వృద్ధికి సంబంధించిన అంశాల వల్లే ఇది. దేశీయంగా, అంతర్జాతీయంగా ఓ స్థాయి మందగమనానికి తోడు ఎన్‌బీఎఫ్‌సీ రంగం చుట్టూ ఉన్న అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. అయితే, కార్పొరేట్‌ పన్ను తగ్గింపు వల్ల 2019-20లో కంపెనీల లాభాలు 10-12 శాతం మేర వృద్ధి చెందగలవు. ప్రస్తుతం మార్కెట్‌ వ్యాప్తంగా స్టాక్స్‌ విలువలు ఆకర్షణీయంగా ఉన్నాయి. 

 

గత రెండేళ్లుగా కేవలం కొన్ని లార్జ్‌క్యాప్‌ కంపెనీల కదలికలే మార్కెట్‌ ర్యాలీకి మద్దతుగా ఉన్నాయి. లార్జ్‌క్యాప్‌నకు, మిడ్‌, స్మాల్‌క్యాప్‌నకు మధ్య వ్యాల్యూషన్ల అంతరం పెరిగిపోయింది. ఎన్‌ఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ సూచీకి, నిఫ్టీకి మధ్య పీఈ రేషియో పరంగా అంతరం 2014 నాటి స్థాయి కంటే దిగువకు వచ్చింది. దీంతో మిడ్‌క్యాప్‌ ‍స్టాక్స్‌లో ఉన్న అధిక వ్యాల్యూషన్లు మొత్తం కరిగిపోయాయి. వచ్చే రెండు మూడేళ్ల కాలం కోసం ఇన్వెస్ట్‌ చేసుకోవడాన్ని ఆరంభించకోవచ్చు. మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి ఏక మొత్తంలో వచ్చే పెట్టుబడులు తగ్గినప్పటికీ, సిప్‌ రూపంలో పెట్టుబడుల రాక స్థిరంగా ఉండడం ఇన్వెస్టర్లలో పరిపక్వతకు సంకేతం. దీర్ఘకాలానికి ఇది మేలు చేస్తుంది. గతంతో పోలిస్తే ఈక్విటీ ఇన్వెస్టర్లలో నేడు ఎంతో సహనం కనిపిస్తోంది. ప్రయివేట్‌ బ్యాంకులు, జీవిత బీమా కంపెనీలు, ఇండస్ట్రియల్స్‌, సిమెంట్‌, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు, గ్యాస్‌ యుటిలిటీ స్టాక్స్‌కు మేం ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆర్థిక వృద్ధి రికవరీతో ఈ రంగాలు ప్రయోజనం పొందుతాయని అంచనా వేస్తున్నాం’’ అని కురియన్‌ వివరించారు. 



You may be interested

లిక్విడ్‌ ఫండ్స్‌పైనా ఎగ్జిట్‌లోడ్‌

Monday 21st October 2019

లిక్విడ్‌ ఫండ్స్‌ అన్నవి అవసరమైనప్పుడు వెంటనే నగదుగా మార్చుకునేందుకు వీలున్న మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు. ఇప్పటి వరకు వీటిల్లో ఇన్వెస్ట్‌ చేసి మరుసటి రోజు వెనక్కి తీసుకున్నా కానీ ఎటువంటి చార్జీలు లేవు. కానీ, ఇకపై ఆ అవకాశం లేదు. లిక్విడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వారు, వారంలోపు తిరిగి వెనక్కి తీసుకుంటే చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. లిక్విడ్‌ ఫండ్స్‌లో దాదాపు అధిక భాగం పెట్టుబడులు ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల నుంచే

ఎస్‌బీఐ టార్గెట్‌ రూ.350: మోతీలాల్‌ ఓస్వాల్‌

Saturday 19th October 2019

స్థూల వ్యవస్థలో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ ఎస్‌బీఐ షేరు 32శాతం రాబడిని ఇస్తుందని మోతిలాల్‌ ఓస్వాల్‌ బ్రోకరేజ్‌ సంస్థ అభిప్రాయపడింది. ఈ బ్రోకరేజ్‌ సంస్థ ఇప్పటికే ఎస్‌బీఐ షేర్లపై బుల్లిష్‌ రేటింగ్‌ను ఇచ్చింది. ‘‘గత మూడు నెలల్లో షేరు 29శాతం వరకు కరెక‌్షన్‌ గురైంది. ఇది అనుకూలమైన రిస్క్-రివార్డ్‌ను తెలియజేస్తుంది. ఆర్థిక సంవత్సరం 2021నాటికి ఆస్తులపై రాబడి (ఆర్‌ఓఏ) 0.7శాతం, ఈక్విటీలపై రాబడి (ఆర్‌ఓఈ) 12.7శాతం మెరుగుపడేందుకు అవకాశాలున్నాయి. కాబట్టి గతంలో తాము ఈ

Most from this category