News


3.65 కోట్లకు డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య

Wednesday 17th July 2019
Markets_main1563348970.png-27126

 

  • జూన్‌ 30తో ముగిసిన ఏడాదిలో 41 లక్షల కొత్త డీమ్యాట్‌ ఖాతాలు
  • దీనికి ముందు రెండేళ్లలో 35 లక్షలు, 25 లక్షల కొత్త ఖాతాలు చేరిక
  • బెంగుళూరు, హైదరాబాద్‌ వంటి నగరాలలో ఈక్విటీ సంస్కృతి విస్తరణ

దేశియంగా ఈక్విటీ మార్కెట్ల వైపు కొత్త ఇన్వెస్టర్లు ఆకర్షితులవుతున్నారని, జూన్‌ 30తో ముగిసిన ఏడాదికి గాను మొత్తం 41 లక్షల ఇన్వెస్టర్లు కొత్తగా డీమ్యాట్‌ ఖాతాలను తెరిచారని సెబీ విడుదల చేసిన డేటాలో పేర్కొంది. సెబీ  2011 నుంచి ఈ డేటాను వెల్లడించడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ ఏడాదిలోనే అత్యధిక డీమ్యాట్‌ ఖాతాలు తెరుచుకున్నాయి. దీంతో దేశియంగా స్టాక్‌ మార్కెట్ల ఇన్వెస్టర్లు 3.65 కోట్లకు పెరిగినట్టయ్యింది. 

మార్కెట్లు బాగాలేకపోయిన పెరిగాయి...
   బెంచ్ మార్క్ సెన్సెక్స్ గత జూన్ నుంచి 7 శాతం రిటర్నలను మాత్రమే ఇచ్చింది. అంతేకాకుండా బీఎస్‌ఈ మిడ్ క్యాప్ సూచీ 6 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 13 శాతం నష్టపోయాయి. అయినప్పటికి డీమ్యాట్‌ ఖాతాలు పెరగడం గమనర్హం.   నాలుగేళ్ల వ్యవధిలో మొత్తం ఖాతాల సంఖ్య దాదాపు సగం పెరిగింది. ఇది ఈక్విటీ మార్కెట్లపై ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ప్రాధాన్యతను సూచిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అంతకుముందు రెండేళ్లలో  35 లక్షలు, 25 లక్షల కొత్త డీమ్యాట్‌ ఖాతాలు ప్రారంభమయ్యాయి. దేశంలో ఆర్థిక అక్షరాస్యత పెరగడంతో ఈక్విటీల వైపు ఆకర్షితులవుతున్నారని విశ్లేషకులు తెలిపారు.  రియల్ ఎస్టేట్, బంగారం, ఇతర ఆస్తి తరగతులలో ఇన్వెస్ట్‌ చేసేవాళ్ల కంటే ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవాళ్లు గత ఐదేళ్లలో పెరిగారు. 
ప్రత్యే‍క్ష మార్కెట్‌ పెట్టుబడులు, ఎంఎఫ్‌ల ఖాతాలే ఎక్కువ...
  సెన్సెక్స్ 2016 నుంచి ఇప్పటి వరకు 70 శాతం వృద్ధి నమోదు చేసింది.  ప్రత్యక్ష మార్కెట్ పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్‌) యూనిట్ల కొనుగోలు, కన్వర్టిబుల్ కాని డిబెంచర్లకు (ఎన్‌సిడి) సభ్యత్వాల ఖాతాలు ఈ డేటాలో ఉన్నాయి.
‘ప్రత్యక్ష స్టాక్ పెట్టుబడులు, ఎంఎఫ్ మార్కెట్ల కోసం డీమ్యాట్‌ ఖాతాలు గణనీయంగా పెరిగాయి’ అని యస్‌ సెక్యూరిటీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రశాంత్ ప్రభాకరన్ అన్నారు. ‘కొత్త ఖాతాలను తెరవడానికి డిజిటల్ కెవైసిని, ఎలక్ట్రానిక్ సంతకాలను ఉపయోగిస్తున్నందున ఖాతాలు తెరవడం సులభతరం అయ్యింది. ట్రేడింగ్ ఖాతా తెరవడానికి ఇన్వెస్టర్లు ఇకపై వారాలు వేచి ఉండాల్సిన అవసరం లేదు’ అని తెలిపారు.
ఇతర నగరాలలో మార్కెట్‌ వాటా వృద్ధి..
  స్టాక్ మార్కెట్‌ పెట్టుబడులలో ముంబై అతిపెద్ద కేంద్రంగా కొనసాగుతుంది. దీనితోపాటు ఇతర ప్రధాన నగరాలు కూడా ఈక్విటీ సంస్కృతికి అలవాటు పడుతున్నాయి. ముఖ్యంగా బెంగుళూరు, హైదరాబాద్ వంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) హబ్‌లలో వేగంగా ఈ సంస్కృతి పెరుగుతోంది. నగదు మార్కెట్ వాల్యూమ్లలో బెంగళూరు వాటా ఎఫ్‌వై 13 లో 0.3 శాతం ఉండగా, ప్రస్తుతం ఇది 4.2 శాతానికి పెరిగింది. అదేవిధంగా హైదరాబాద్ వాటా ఎఫ్‌వై 13 లో 1.4 శాతం ఉండగా ఇప్పుడది 3.3 శాతానికి పెరిగింది. ‘స్టార్టప్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలు ఈ నగరాలలో వృద్ధి చెందుతుండడంతో  మొదటిసారి పెట్టుబడి పెట్టేవాళ్లను స్టాక్ మార్కెట్లు ఆకర్షిస్తున్నాయి’ అని బెంగళూరుకు చెందిన డిస్కౌంట్ బ్రోకరేజ్ జెరోధా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నితిన్ కామత్ అన్నారు. ‘ఈ ఇన్వెస్టర్లను సాంప్రదాయ ఇన్వెస్టర్లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటారు. వీళ్లు మార్కెట్ల గురించి తెలుసుకోవడానికి, పరిశోధన కోసం సమయాన్ని కేటాయిస్తున్నారు’ అని తెలిపారు. 
  మార్కెట్ వాల్యూమ్‌ల ప్రకారం అతిపెద్ద నగరమైన ముంబై వాటా ఎఫ్‌వై 13లో  63.8 శాతంగా ఉండగా ఇప్పుడది 63.6 శాతానికి తగ్గింది. పెట్టుబడిదారుల సంఖ్యతో పాటు నిధుల ప్రవాహాల నాణ్యత కూడా గణనీయంగా మెరుగుపడిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. గత ఏడాది ఆగష్టు, అక్టోబర్ మధ్య జరిగిన దిద్దుబాట్లలో సెన్సెక్స్ 13 శాతానికి పైగా పడిపోయింది. ఫలితంగా మార్కెట్లు కనీసం మూడు ప్రధాన అమ్మకాలకు గురయ్యాయి. మార్కెట్లో దిద్దుబాటు జరిగినప్పటికి స్వదేశీ మ్యూచువల్ ఫండ్స్ నెలకు సగటున 8,000 కోట్ల రూపాయల స్థిరమైన ప్రవాహాన్ని సాధించడం గమనర్హం. 

 You may be interested

కోటక్‌ బ్యాంక్‌ ర్యాలీ

Wednesday 17th July 2019

ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనైప్పటికీ, కోటక్‌ మహీంద్రా బ్యాంకు షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.1491.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో షేరు ఒకదశలో 3శాతం ర్యాలీ చేసి రూ.1546.80ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదుచేసింది. మధ్యా్‌హ్నం గం.1:45ని.లకు షేరు గతముగింపు ధర(రూ.1502.50)తో పోలిస్తే 2.50శాతం లాభంతో రూ.1540.00ల వద్ద

క్యు1లో ఎఫ్‌ఐఐలు వాటాలు పెంచుకున్న కంపెనీలివే!

Wednesday 17th July 2019

దేశీయ మార్కెట్లోని 84 కంపెనీల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు క్యు1లో వాటాలు పెంచుకున్నారు. ఇలా ఎఫ్‌ఐఐలు వాటాలు పెంచుకున్న కంపెనీల్లో హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్‌, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐఓసీ, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, ఎన్‌ఎండీసీ, ముతూట్‌ ఫైనాన్స్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌, ఆర్తి ఇండస్ట్రీస్‌ తదితరాలున్నాయి. ఎఫ్‌ఐఐలు వాటాలు పెంచుకున్న నేపథ్యంలో ఈ షేర్లలో కొత్తగా ఎంటర్‌కాదలిస్తే కేవలం ఈ ఒక్క పారామీటర్‌ ఆధారంగా నిర్ణయం

Most from this category