News


2020లో ఈ సూత్రాలు మర్చిపోకండి

Tuesday 31st December 2019
Markets_main1577773152.png-30555

కొత్త ఏడాది ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే మదుపరులు తప్పక గుర్తుంచుకోవాల్సిన నాలుగు సూత్రాలను నిపుణులు వివరిస్తున్నారు. 
1. క్వాలిటీనే కీలకం: సైక్లిక్స్‌ మార్కెట్లో మార్పులు తీసుకువస్తుంటాయి, కానీ ఎప్పుడూ కాలపరీక్షకు నిలిచేది క్వాలిటీ మాత్రమే. నాణ్యమైన స్టాకులు మార్కెట్‌ ఆటుపోట్లను తట్టుకుంటాయని మరచిపోకండి. 
2. రిస్కు- రివార్డు: మార్కెట్లో కేవలం వాల్యూషన్లు మాత్రమే పరిశీలించి నిర్ణయం తీసుకోకుండా రిస్కు- రివార్డు నిష్పత్తిని సైతం లెక్కించి నిర్ణయం తీసుకోవాలి. బలమైన యాజమాన్యం, స్థిరమైన వృద్ధి, రుణభారం తక్కువగా ఉన్న పద్దుపుస్తకం.. ఈ లక్షణాలున్న స్టాకు చౌకగా రాదు. అలాంటప్పుడు వీటి విషయంలో కేవలం వాల్యూషన్లే పరిగణించకుండా, రిస్కు రివార్డు ఎంత ఉందో లెక్కించుకొని ముందుకు పోవాలి. 
3. దీర్ఘకాలం ఉండాలి: లాంగ్‌టర్మ్‌ పెట్టుబడులే ఎప్పుడైనా మంచి రాబడిని అందిస్తాయని మరవద్దు. స్వల్పకాలానికి చేసే ట్రేడ్స్‌ కన్నా దీర్ఘకాలానికి పెట్టే పెట్టుబడులు ఎక్కువ శాతం మంచి రాబడినిస్తాయి. 
4. వృద్ధి vs వాల్యూ: వాల్యూ షేరుకు వాల్యూ ట్రాప్‌కు మధ్య తేడా గుర్తించడం సాధారణ ఇన్వెస్టర్‌కు చాలా కీలకం. ఇందుకు ఒక సాధారణ చిట్కా ఉపయోగపడుతుంది. స్థిరమైన వ్యాపార వృద్ది సాధిస్తూ ఉన్న కంపెనీ షేరును వాల్యూషేరుగా పరిగణించవచ్చు. 
ద్రవ్యోల్బణం పెరుగుతున్న సంకేతాలు, వృద్ది మందగిస్తున్న సిగ్నల్స్‌ వస్తున్న ప్రస్తుత తరుణంలో పెట్టుబడిని సురక్షితంగా ఉంచుకోవడానికి మదుపరులు అధిక ప్రాధాన్యమివ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. 



You may be interested

ఆటో, ఆటో విడిభాగాల షేర్లు భేష్‌

Tuesday 31st December 2019

ఆర్థిక మందమనంలోనూ ఆశలు రేపుతున్న ఆటో రంగం క్వాంటమ్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ నీరజ్‌ దివాన్‌ ఇప్పటికే ఆర్థిక మందగమన ప్రభావం పలు రంగాలపై కనిపిస్తోంది. అయితే ఇటీవల ఆటో, ఆటో విడిభాగల పరిశ్రమలో కొంతమేర ఆశావహ పరిస్థితులకు బీజం పడిందని చెబుతున్నారు క్వాంటమ్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ నీరజ్‌ దివాన్‌. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్థిక మందగమనం, బడ్జెట్‌ తదితర అంశాలపై నీరజ్‌ పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. ఈ

స్టాక్స్‌ కన్నా బంగారమే బెటర్‌!

Tuesday 31st December 2019

ఈక్విటీల్లో అప్‌ట్రెండ్‌ తాత్కాలికమే 2020లో పసిడి ర్యాలీ పక్కా ఒకపక్క సురక్షిత పెట్టుబడిసాధనంగా పేరొందిన బంగారం ధర పెరుగుతోంది.. మరోపక్క ఈక్విటీలు ప్రపంచవ్యాప్తంగా అప్‌ట్రెండ్‌ కొనసాగిస్తున్నాయి. దీంతో సాధారణ మదుపరి ఈక్విటీల్లో పెట్టుబడులకు వెనకముందూ ఆలోచిస్తున్నాడు. సాధారణంగా బంగారం ధర పెరగడం, ఈక్విటీల్లో డౌన్‌ట్రెండ్‌కు సంకేతంగా భావిస్తారు. ఈక్విటీలు ర్యాలీ జరిపే సమయాల్లో బంగారం ధర నేల చూపులు చూస్తుంటుంది. కానీ ఈసారి తద్భిన్నంగా రెండూ ర్యాలీ జరుపుతుండడం ఇన్వెస్టర్లలో అయోమయం పెంచుతోంది.

Most from this category