News


హాస్పిటల్స్‌, ఫార్మాపై దృష్టి పెట్టవచ్చు

Thursday 23rd January 2020
Markets_main1579773422.png-31140

దేశీ మార్కెట్లపై దృష్టిపెట్టిన హెల్త్‌కేర్‌ కంపెనీలపట్ల ఆసక్తిగా ఉన్నట్లు దీపన్‌ మెహతా చెబుతున్నారు. ఆరోగ్యపరిరక్షణ రంగంలో హాస్పిటల్స్‌ కౌంటర్లను ఎంపిక చేసుకోనున్నట్లు తెలియజేశారు. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలిగ్జిర్‌ ఈక్విటీస్‌ వ్యవస్థాపకులు, డైరెక్టర్‌ అయిన మెహతా మార్కెట్ల నడకసహా పలు అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..

పెయింట్స్‌ ఖరీదెక్కువ
పెయింట్స్‌ రంగ కౌంటర్లు ప్రస్తుతం అత్యంత ఖరీదుగా ఉన్నాయి. ఉదాహరణకు ఏషియన్‌ పెయింట్స్‌ నిర్వహణ లాభం 8 శాతం వృద్ధి చెందిన నేపథ్యలో షేరు విలువ 60 రెట్లు అధికంగా(పీఈ) ట్రేడవుతోంది. ఈ స్థాయి పీఈలో షేర్లు స్థిరంగా కొనసాగడం కష్టమే. పెయింట్ల పరిశ్రమ విస్తృతి, పోటీ తదితర అంశాల కారణంగా దీర్ఘకాలంలో భారీ వృద్ధికి అవకాశాలు తక్కువే. నిజానికి ఈ రంగం సానుకూల ఫలితాలు సాధిస్తున్నప్పటికీ అధిక పీఈల కారణంగా వీటిలో పెట్టుబడులు లాభదాయకం కాకపోవచ్చు. ఇకబీమా రంగ కంపెనీలు సైతం ఇటీవల భారీ ర్యాలీ చేశాయి. మొత్తం ప్రీమియం నుంచి నికర లాభం వరకూ కంపెనీల పనితీరును అంచనా వేయడం క్లిష్టమైన విషయం. దేశీయంగా బీమా కంపెనీలకు పలు అవకాశాలున్నప్పటికీ గత ఏడాది కాలంలో పలు కంపెనీల షేర్లు బాగా పెరిగిపోయాయి. దీంతో ఇవి అత్యంత వ్యయభరితంగా మారాయి. ఇకపైన కూడా ఈ కంపెనీలు మంచి పనితీరును ప్రదర్శించే అవకాశముంది. స్వల్పకాలానికి వీటిలో పెట్టుబడులను రిస్క్‌ఫ్రీగా పేర్కొనవచ్చు. అయితే రెండు, మూడేళ్ల కాలాన్ని పరిగణిస్తే.. రిస్క్‌ అధికమనే చెప్పాలి. విస్తరించిన బ్యాలన్స్‌షీట్‌, బిజినెస్‌లు లేదా రంగాలవారీగా సమస్యలు ఎదుర్కొంటున్న కొన్ని నాణ్యమైన మిడ్‌ క్యాప్స్‌ ఇకపై పుంజుకునే అవకాశముంది. వృద్ధి అవకాశాలతోపాటు చౌకగా లభిస్తున్న మిడ్‌ క్యాప్స్‌ మార్కెట్లను ఆకట్టుకోనున్నాయి.
ఎల్‌అండ్‌టీ
డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఎల్‌అండ్‌టీ అంచనాలకు అనుగుణంగా ఆర్డర్లబుక్‌ను బలపరచుకుంటోంది. తద్వారా రెండు, మూడేళ్ల కాలానికి మెరుగైన ఫలితాలు సాధించే వీలుంది. ఆర్డర్లను పూర్తిచేయడం వేగమందుకోగానే మార్జిన్లు సైతం బలపడే అవకాశముంది. ఇటీవల మౌలిక రంగంలో నెలకొన్న స్థబ్దత కారణంగా ఎల్‌అండ్‌టీ షేరు  అండర్‌పెర్ఫార్మర్‌గా నిలిచింది. కంపెనీపరంగా సానుకూల వార్తలు, ఆర్డర్లు ఊపందుకోవడం వంటి సంకేతాలు కనిపిస్తే.. ఔట్‌పెర్ఫార్మ్‌ చేసే వీలుంది. ఇటీవల ఇన్వెస్టర్ల సహనాన్ని పరీక్షించినప్పటికీ ఇన్‌ఫ్రా రంగం జోరందుకుంటే అత్యధిక స్థాయిలో లబ్ది పొందగల దిగ్గజంగా చెప్పవచ్చు.
ఫార్మా, హాస్పిటల్స్‌
దేశీయంగా దృష్టిపెట్టిన ఫార్మా, హెల్త్‌కేర్‌(హాస్పిటల్స్‌) కంపెనీలపట్ల ఆసక్తిగా ఉన్నాం. దేశీ మార్కెట్ల నుంచి అత్యధికంగా ఆదాయం పొందుతున్న ఆల్కెమ్‌ లేబొరేటరీస్‌, జేబీ కెమికల్స్‌ వంటి కంపెనీలపట్ల సానుకూల థృక్పథాన్ని కలిగి ఉన్నాం. యూఎస్‌ జనరిక్‌ మార్కెట్లపై ఆధారపడని దివీస్‌ లేబ్స్‌, బయోకాన్‌ వంటి కంపెనీలను ఇన్వెస్ట్‌మెంట్స్‌కు పరిగణించవచ్చు. ఈ బాటలో హాస్పటల్‌ స్టాక్స్‌నూ ఎంపిక చేసుకోవచ్చు. నారాయణ హృదయాలయ, యాస్టర్‌ డీఎంలతోపాటు షాల్బీ హాస్పిటల్స్‌ ఈ జాబితాలో చేర్చవచ్చు. ఇవన్నీ విస్తరణ ప్రణాళికలు అమలుచేస్తున్నాయి. అయితే కంపెనీల వృద్ధికి అనుగుణంగా ఈ కౌంటర్లు సైతం అధిక పీఈలలోనే ట్రేడవుతున్నాయి.
హౌసింగ్‌ ఫైనాన్స్‌కు ఓటు
హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలవైపు దృష్టిసారించవచ్చు. ఈ రంగం‍లో కేన్‌ ఫిన్‌ హోమ్స్‌ అనూహ్య ఫలితాలతో ఆశ్చర్యపరిచింది. ఈ రంగం‍లోని ఇతర కంపెనీలు సైతం​ ప్రోత్సాహకర పనితీరును ప్రదర్శిస్తున్నాయి. చాలవరకూ కంపెనీలు స్టాండెలోన్‌ ప్రాతిపదికన మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. అయితే ఇటీవల ఈ రంగం​ఎదుర్కొన్న సమస్యల నేపథ్యంలో షేర్లు భారీ దిద్దుబాటుకు లోనయ్యాయి. ఎల్‌ఐసీ హౌసింగ్‌, పీఎన్‌బీ హౌసింగ్‌, రెప్కో తదితర కంపెనీలు సైతం మంచి పనితీరు చూపే వీలుంది. ఈ కంపెనీలన్నీ సింగిల్‌ పీఈలలో ట్రేడవుతున్నాయి. అందుబాటు ధరల గృహ నిర్మాణాలు, రియల్టీ రంగం‍ జోరందుకుంటే.. హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల పీఈలు మెరుగుపడతాయి. You may be interested

3 రోజుల నష్టాలకు చెక్‌- లాభాల ముగింపు

Thursday 23rd January 2020

సెన్సెక్స్‌ 271 పాయింట్లు జూమ్‌ నిఫ్టీ 73 పాయింట్లు అప్ రియల్టీ జూమ్‌- మీడియా డౌన్‌ దేశీ స్టాక్‌ మార్కెట్లలో వరుస నష్టాలకు చెక్‌ పడింది. మూడు రోజుల అమ్మకాలకు బ్రేక్‌వేస్తూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు ప్రస్తావించదగ్గ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 271 పాయింట్లు ఎగసి 41,386 వద్ద నిలవగా.. నిఫ్టీ 73 పాయింట్లు పుంజుకుని 12,180 వద్ద స్థిరపడింది. బడ్జెట్‌పై ఇన్వెస్టర్ల అంచనాలకుతోడు, ట్రేడర్ల షార్ట్‌ కవరింగ్‌జత కలవడంతో మార్కెట్లు

టెలికం ఎస్‌పీవీ ఏర్పాటు యోచనలో ప్రభుత్వం?!

Thursday 23rd January 2020

టెలికం రంగానికి సాయం చేసేందుకు ఒక స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌(ఎస్‌పీవీ) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు బిజినెస్‌స్టాండర్డ్‌ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు సీఓఏఐ తన సభ్యులకు పంపినట్లు చెబుతున్న వివరాలను నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం టెలికం కంపెనీలు తమ ఏజీఆర్‌ బకాయిలను వార్షిక వాయిదాల రూపంలో ఎస్‌పీవీకి జమ చేయమని ప్రభుత్వం కోరనుంది. ఈ మొత్తాలను ఈక్విటీకింద పరిగణిస్తారు. దీంతో పాటు టెలికం కంపెనీలకు అవసరమైన 5జీ

Most from this category