News


ఈక్విటీలు, బంగారంలో ఇన్వెస్ట్‌ చేయవచ్చు!

Wednesday 11th March 2020
Markets_main1583907194.png-32404

దేశీ సమస్యలకు కరోనా కారణంకాదు
చైనా, సింగపూర్‌ పెట్టుబడులకు అనుకూలం
చమురు పతనంతో ఇండియాకు లాభం
- క్రిస్‌ ఉడ్‌, జెఫరీస్‌ గ్లోబల్‌ ఈక్విటీ హెడ్‌

నా అంచనాలు నిజమైతే రానున్న రెండు నెలల్లో కరోనా వైరస్‌ సంక్షోభానికి చెక్‌ పడుతుందం‍టున్నారు జెఫరీస్‌ గ్లోబల్‌ ఈక్విటీ హెడ్‌ క్రిస్టోఫర్‌ ఉడ్‌. ప్రపంచ దేశాలలో వేసవి ప్రారంభమైతే ఈ సమస్య మాసిపోనున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ ఈ అంచనాలు తప్పి వేసవిలోనూ కరోనా వ్యాప్తి చెందితే పరిస్థితులు మరింత సమస్యాత్మకంగా పరిణమిస్తాయని పేర్కొన్నారు. మార్కెట్లు, బంగారం, చమురు తదితర పలు అంశాలపై ఒక ఇంటర్వ్యూలో క్రిస్‌ ఉడ్‌ పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..

మార్కెట్లు మరింత వీక్‌
రానున్న నాలుగు, ఆరు వారాల్లో ప్రపంచ మార్కెట్లు మరింత నీరసించే వీలుంది. చైనాను వీడిన కరోనా అమెరికా, యూరోపియన్‌ దేశాలను వణికిస్తోంది. దీంతో ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు కొనసాగవచ్చు. పరిస్థితులు సమర్థవంతంగా నియంత్రిస్తున్న చైనా, సింగపూర్‌ మార్కెట్లలో ప్రస్తుతం ఇన్వెస్ట్‌ చేసేందుకు అనువుగా ఉన్నాయి. వియత్నాం సమావేశంలో రష్యా, సౌదీ అరేబియా మధ్య అవగాహన కుదరకపోవడంతో చమురు ధరలు పతనమయ్యాయి. డిస్కౌంట్లు, ఉత్పత్తి పెంపు ప్రకటించిన సౌదీ దీనికి కారణంకాగా.. 2016లో నమోదైన 27 డాలర్ల కనిష్టాన్ని చమురు ధరలు మరోసారి పరీక్షించే అవకాశముంది. చమురు ధరల పతనం ఇండియాకు మేలు చేయనుంది. అయితే ఫిబ్రవరి మొదలు పతన బాటలో సాగుతున్న రూపాయి ఆందోళనలు రేపుతోంది. చమురు పతనంతో కోలుకోవలసి ఉంది. ఆర్థిక మందగమనం, తగ్గిన పన్ను ఆదాయం, ఇటీవల దేశీయంగా తలెత్తుతున్న నిరసనలు వంటి అంశాలు రూపాయిని దెబ్బతీస్తున్నాయి.

ఫెడ్‌ వడ్డీ కోత
కరోనా కారణంగా అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లలో 0.5 శాతం కోత పెట్టింది. ఈ బాటలో మరిన్ని దేశాల కేంద్ర బ్యాంకులు చర్యలు చేపట్టవచ్చు. అయితే కరోనా సంక్షోభానికి ఈ చర్యలకు సంబంధంలేదు. కరోనా ప్రభావంతో ఆతిథ్యం, ట్రావెల్‌ రంగాలు బాగా దెబ్బతింటున్నాయి. నిజానికి వడ్డీ రేట్ల తగ్గింపుకంటే.. క్యాష్‌ఫ్లో సమస్యలు ఎదుర్కొంటున్న రంగాలకు దన్నుగా చర్యలు చేపట్టవలసి ఉంది. 

గ్రోత్‌ సైకిల్‌
దేశీయంగా ఆర్థిక పురోగతి సంకేతాలు అందవలసి ఉంది. ఈ దిశలో ఇప్పటికింకా స్పష్టమైన సంకేతాలు నమోదుకాలేదు. నిజానికి దేశీయంగా నెలకొన్న సమస్యలు వేరు. కరోనా వైరస్‌ ప్రభావం ఇక్కడ తక్కువే. ఆర్థిక మందగమన ప్రభావమే ఎక్కువ. దేశ ఆర్థిక వ్యవస్థ త్వరలో రికవరీ బాట పట్టే అవకాశముంది. ఈ సైక్లికల్‌ అప్‌లిఫ్ట్‌ను నిర్ధారించే పరిస్థితులు కనిపించవలసి ఉంది. ఇక ఆసియాలో చైనా ఆర్థిక వ్యవస్థ రెండో క్వార్టర్‌లో సాధారణ స్థితికి వస్తుందని విశ్వసిస్తున్నాం. కరోనా కారణంగా తొలి క్వార్టర్‌ దాదాపు తుడిచిపెట్టుకుపోయినట్లేనని భావిస్తున్నాం. 

ఈక్విటీలు గుడ్‌
ప్రస్తుత పరిస్థితుల్లో ఈక్విటీల నుంచి వైదొలగవలసిన అవసరం లేదు. అయితే బంగారాన్ని సైతం పెట్టుబడులకు పరిగణించవచ్చు. అమెరికా స్వల్పకాలిక రేట్లను తగ్గిస్తున్న నేపథ్యంలో పసిడి ధరలు మెరిసే అవకాశముంది. ఇక దేశీయంగా చూస్తే.. వడ్డీ రేట్ల తగ్గింపునకంటే బ్యాంకింగ్‌ వ్యవస్థ, ఎన్‌బీఎఫ్‌సీ రంగాల సమస్యల పరిష్కారాలపై దృష్టిపెట్టడం మేలు చేయగలదు. 

బీమా కంపెనీలపై
దేశీయంగా బడ్జెట్‌లో బీమా రంగ పెట్టుబడులకు సంబంధించిన పన్ను మినహాయింపులను రద్దు చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఓవైపు పీఎస్‌యూ దిగ్గజం ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ సన్నాహాలు ప్రకటిస్తూనే.. పన్ను విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇన్వెస్టర్లలో అయోమయానికి తావిచ్చాయి. ఇది ఎల్‌ఐసీ ఐపీవో విలువ తగ్గేందుకు దారితీయవచ్చు. కాగా.. దేశీయంగా చూస్తే బీమా రంగం దీర్ఘకాలిక స్టోరీగా భావిస్తున్నాం. బీమా రక్షణ మరింత మందికి చేరవలసి ఉంది. నాణ్యమైన ప్రయివేట్‌ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు, ఎన్‌బీఎఫ్‌సీ కౌంటర్లు దీర్ఘకాలంలో మెరుగైన పనితీరు చూపే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నాం.You may be interested

ఏడాది కనిష్టానికి 379 షేర్లు

Wednesday 11th March 2020

బుధవారం ఎన్‌ఎస్‌ఈలో 52 వారాల కనిష్టానికి 379 షేర్లు పతనమయ్యాయి. వాటిలో అబాన్‌ ఆఫ్‌షోర్‌, ఏబీబీ ఇండియా, ఏసీసీ, అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌, ఆధునిక్‌ ఇండస్త్రీస్‌, అడోర్‌ వెల్డింగ్‌, ఆగ్రో ఫోస్‌ ఇండియా, అజ్మెరా రియాల్టీ అండ్‌ ఇన్‌ఫ్రా ఇండియా, ఆక్స్‌ ఆఫ్టీఫైబర్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, అంకిత్‌ మెటల్‌ అండ్‌ పవర్‌, అన్సాల్‌ హౌసింగ్‌, అంటార్కిటికా, అపార్‌ ఇండస్ట్రీస్‌, అపోలో టైర్స్‌, ఆప్‌టెక్‌, ఆర్కీస్‌, ఆర్కోటెక్‌,

రూ.44,500పైన పసిడి!

Wednesday 11th March 2020

కోవిడ్‌-19 ప్రభావాన్ని ఆర్థిక వ్యవస్థపై తగ్గించడానికి ప్రపంచ దేశాలు విధానపరమైన చర్యలు చేపడుతుండడంతో కొంత మంది పెట్టుబడిదారుల్లో ఆందోళనలు తగ్గడంతో బుధవారం బంగారం ధర స్వల్పంగా బలపడింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో మొన్నటి ముగింపుతో  పోలిస్తే రూ.65 పెరిగి 10 గ్రాముల పసిడి రూ.43,801.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌ల్లో సైతం 2 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం 1,663.50 వద్ద

Most from this category