News


ఇంట్రాడే మార్జిన్లకు చెల్లుచీటి!

Friday 3rd January 2020
Markets_main1578027203.png-30642

పూర్తి మార్జిన్‌ ఉంచాలని ఎక్చేంజ్‌ల ఆదేశాలు
భారీగా తగ్గనున్న వాల్యూంలు
చిన్న బ్రోకరేజ్‌ల కనుమరుగు తప్పదంటున్న నిపుణులు
ట్రేడర్లలో బాగా పాపులరైన ఇంట్రాడే ట్రేడింగ్‌లో స్వల్పమార్జిన్ల కాలం ముగిసిపోతోంది. స్టాక్‌ లేదా డెరివేటివ్‌ విలువ లేదా మార్జిన్‌లో కొంత మొత్తం ఉంచి ఇంట్రాడేలో ట్రేడింగ్‌ చేసుకునే వెసులుబాటు ఇప్పటివరకు ఉంది. కానీ ఇకపై స్టాక్‌ లేదా డెరివేటివ్‌ విలువ లేదా మార్జిన్‌ మొత్తం ఉంటేనే క్లయింట్లను ఇంట్రాడే ట్రేడింగ్‌కు అనుమతించాలని ఎక్చేంజ్‌లు బ్రోకర్లను ఆదేశించాయి. ఈ మార్పు మార్కెట్‌లో ట్రేడింగ్‌ వాల్యూంలపై పెను ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఒక ట్రేడ్‌ ఆరంభానికి ముందు క్లయింట్‌ దగ్గర మొత్తం ఇనిషియల్‌ మార్జిన్‌ వసూలు చేయడం తప్పనిసరని బ్రోకర్లకు ఎక్చేంజ్‌లు ఆదేశించాయి. దీంతో ఇకపై బ్రోకరేజ్‌లు తమ క్లయింట్లకు ఇంట్రాడే ట్రేడింగ్‌ ప్రొడక్ట్స్‌ను అందించడం కుదరదు. ఇప్పటివరకు దాదాపు అన్ని బ్రోకింగ్‌ సంస్థలు తమ క్లయింట్లకు ఇంట్రాడే ప్లాన్స్‌ అందిస్తున్నాయి. కొన్ని బ్రోకింగ్‌ సంస్థలు క్లయింట్ల వద్ద ఉన్న సొమ్ముకు 50- 100 రెట్లు ఇంట్రాడే మార్జిన్లను అందిస్తున్నాయి. దీంతో చాలా మంది ఇంట్రాడే ట్రేడింగ్‌కు అలవాటు పడిపోయారు. ఇంట్రాడేలో వాల్యూంలు కూడా భారీగా పెరిగాయి. తాజా నిర్ణయంతో ఈ వాల్యూంలన్నీ దిగివస్తాయని, చిన్నా చితకా బ్రోకరేజ్‌లు మూతపడే పరిస్థితి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అనూహ్యమైన సంఘటనలు జరిగినప్పుడు ఇలా మార్జిన్లు తీసుకున్న ట్రేడర్లు బుక్కయితుంటారు. దీంతో వీరు, వీరికి మార్జినిచ్చిన బ్రోకర్లు ఒక్కోమారు డిఫాల్ట్‌ అవుతున్నారు. వీటన్నింటికీ ఇకపై చెక్‌ పడనుంది. 
ఏంటీ మార్జిన్‌?
ఉదాహరణకు నిఫ్టీ లాట్‌ సైజ్‌ 75. దాని ఫ్యూచర్‌ లాట్‌ విలువ దాదాపు రూ. 9.21 లక్షలు. ఈలాట్‌కు ఎక్చేంజ్‌లు అడిగే ఇనిషియల్‌ మార్జిన్‌ విలువ మొత్తం మార్జిన్‌లో 11.5 శాతం ఉంటుంది. అంటే రూ. 1.05 లక్షలుంటేనే నిఫ్టీ ఫ్యూచర్‌ లాట్‌ ట్రేడ్‌ చేయగలరు. కానీ ఇప్పటివరకు ఇంట్రాడేలో ట్రేడ్‌ చేసే కస్టమర్లకు పలు బ్రోకింగ్‌ సంస్థలు భారీ మార్జిన్‌ ఆందిస్తూ వస్తున్నాయి. సుమారు 20- 30వేల రూపాయలకు ఒక నిఫ్టీ లాట్‌ను ఇంట్రాడేలో ట్రేడ్‌ చేసే వీలు కల్పిస్తున్నాయి. అంటే మీ వద్ద ఒక లక్ష రూపాయలుంటే దాదాపు 3-5 లాట్స్‌ను ట్రేడ్‌ చేయగలరు. కానీ ఇకపై ఒక లక్ష రూపాయలకు ఒక లాట్‌ మాత్రమే ట్రేడ్‌ చేయడం కుదురుతుంది. చాలా స్టాక్‌ బ్రోకర్ల వాల్యూంల్లో ఇంట్రాడేవాల్యూంల విలువ దాదాపు 50 శాతం ఉంటుంది. ఇకపై ఇది భారీగా తగ్గనుంది. ట్రేడర్లు సంపూర్ణ సొమ్ము ఉంటేనే పొజిషన్లు తీసుకోవడం జరుగనుంది.

‘‘గత ఐదేళ్లలో ఈ ఇంట్రాడే ట్రేడింగ్‌లు భారీగా పెరిగాయి. చాలా సంస్థలు భారీగా మార్జిన్లు అందిస్తూ వచ్చాయి. కానీ ఇకపై ఇవన్నీ కుదరవు. క్లయింట్‌ ఖాతాలో సొమ్ములేకుంటే ఖాతాలో ఉన్న షేర్ల విలువ ఆధారంగా ట్రేడ్స్‌ చేసుకోవచ్చు.’’ అని ఒక ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ తెలిపింది. గురువారం ఈ విషయమై ఎక్చేంజ్‌లు వివిధ స్టాక్‌ బ్రోకర్లతో సమావేశం జరిపి మరిన్ని వివరాలు అందించాయి. సెబి ఆదేశానుసారమే ఈ నిర్ణయం వచ్చినట్లు నిపుణులు భావిస్తున్నారు. తాజా నిర్ణయం దీర్ఘకాలానికి మంచిదని, షార్ట్‌టర్మ్‌లో మాత్రం బ్రోకింగ్‌ పరిశ్రమ ఆదాయంపై ప్రభావం చూపుతుందని జిరోధా సీఈఓ నితిన్‌ కామత్‌ చెప్పారు. 



You may be interested

నష్టాల మార్కెట్లోనూ ఈ షేర్లు రయ్‌

Friday 3rd January 2020

ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ టీసీఎస్‌ లిమిటెడ్‌ ఓఎన్‌జీసీ లిమిటెడ్‌ కార్డ్స్‌ కేబుల్‌ ఇండస్ట్రీస్‌ ఇరాక్‌లోని బాగ్దాద్‌ విమానాశ్రయం వద్ద అమెరికా చేపట్టిన వైమానిక దాడులలో ఇరాన్‌, ఇరాక్‌లకు చెందిన ప్రముఖ వ్యక్తులు మరణించినట్లు వెలువడిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటును దెబ్బతీశాయి. దీంతో అమెరికా స్టాక్‌ ఫ్యూచర్స్‌ బలహీనపడగా.. దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం నేలచూపులతో ప్రారంభమై నీరసంగా కదులుతున్నాయి. ఉదయం 10 ప్రాంతంలో సెన్సెక్స్‌ 113 పాయింట్లు క్షీణించి 41,514ను తాకగా.. నిఫ్టీ 42 పాయింట్ల నష్టంతో

భగ్గుమన్న బంగారం

Friday 3rd January 2020

దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి ఫ్యూచర్ల ధర ఉదయం ట్రేడింగ్‌లో భారీగా లాభపడింది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి పతనం, అంతర్జాతీయంగా పసిడి ఫ్యూచర్ల ధర 4నెలల గరిష్టానికి చేరుకోవడంతో దేశీయ పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరిగింది. నేడు ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి కాంటాక్టు పసిడి ధర రూ.39,500.00 వద్ద ప్రారంభమైంది. ఇరాక్‌లోని బాగ్దాద్‌పై అమెరికా వైమానిక దాడుల నేపథ్యంలో అం‍తర్జాతీయ ముడిచమురు ధరలు భగ్గుమనడంతో రూపాయి విలువ బలహీనపడింది. ఆరు ప్రధాన

Most from this category