News


ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ నష్టాలు రూ.1,062 ‍ కోట్లు

Friday 25th October 2019
Markets_main1571973713.png-29120

31 శాతం వృద్ధితో రూ.8,540కోట్లకు ఆదాయం 
-రుణ భారం రూ.19,842 కోట్లు 

న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ, ఇండిగో మాతృ కంపెనీ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌కు ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) సెప్టెంబర్‌ క్వార్టర్‌లో భారీగా నష్టాలు వచ్చాయి. గత క్యూ2లో రూ.652 కోట్ల నికర నష్టాలు రాగా ఈ క్యూ2లో ఈ నష్టాలు రూ.1,062 కోట్లకు పెరిగాయని ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ తెలిపింది. లీజు ఆస్తుల నిర్వహణకు సంబంధించి రూ.428 కోట్ల ఫారెక్స్‌ నష్టాలు, రూ.319 కోట్ల నిర్వహణ వ్యయాల కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని కంపెనీ సీఈఓ రొనొజాయ్‌ దత్తా చెప్పారు.  మొత్తం ఆదాయం రూ.6,514 కోట్ల నుంచి 31 శాతం వృద్ధితో రూ.8,540 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. 
9 శాతం పెరిగిన సగటు చార్జీ...
గత క్యూ2లో రూ.987 కోట్లుగా ఉన్న స్థూల నష్టాలు ఈ క్యూ2లో రూ.1,032 కోట్లకు పెరిగాయని దత్తా చెప్పారు. ఈ క్యూ2లో ఒక్కో విమాన ప్రయాణీకుడి నుంచి వచ్చిన సగటు చార్జీ 9 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఇక మొత్తం వ్యయాలు 28 శాతం పెరిగి రూ.9,572 కోట్లకు పెరిగాయని తెలిపారు. వృద్ధి ప్రణాళికలపైననే దృష్టి పెడుతున్నానమని, దేశీయంగా, అంతర్జాతీయంగా మరింతగా విస్తరిస్తామని పేర్కొన్నారు. నగదు నిల్వలు రూ.18,736 కోట్లుగా, నికర రుణ భారం రూ.19,842 కోట్లుగా ఉన్నాయని తెలిపారు. ఈ కంపెనీ మొత్తం 245 విమానాలతో 77 నగరాలకు విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఇండిగో షేర్‌ 1 శాతం లాభంతో రూ.1,668 వద్ద ముగిసింది. 



You may be interested

టెల్కోలకు 'సుప్రీం' షాక్‌

Friday 25th October 2019

ఏజీఆర్‌పై ప్రతికూల తీర్పు రూ. 92వేల కోట్లు రాబట్టుకోవడానికి  కేంద్రానికి అనుమతి  ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లపై పెనుభారం న్యూఢిల్లీ: టెల్కోల రాబడి (ఏజీఆర్‌) నిర్వచనం, కేంద్రానికి చెల్లించాల్సిన లైసెన్సు ఫీజులపై టెలికం కంపెనీలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఏజీఆర్‌కు సంబంధించి టెలికం శాఖ (డాట్‌) నిర్వచనం సరైనదేనని స్పష్టం చేసింది. టెల్కోల నుంచి రూ. 92,000 కోట్లు రాబట్టుకోవడానికి డాట్‌కు అనుమతిచ్చింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా సారథ్యంలోని త్రిసభ్య బెంచ్‌ గురువారం ఈ మేరకు తీర్పునిచ్చింది. ‘ఏజీఆర్‌

2019-20లో వృద్ధి 5.5 శాతమే: ఫిచ్‌ అంచనా

Friday 25th October 2019

న్యూఢిల్లీ: భారత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం  స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం- ఫిచ్‌  తగ్గించింది. 2019-20లో కేవలం 5.5 శాతం వృద్ధి రేటు మాత్రమే నమోదవుతుందని విశ్లేషించింది. ఈ ఏడాది జూన్‌లో ఫిచ్‌ తొలి అంచనా ప్రకారం ఈ రేటు 6.6 శాతం. బ్యాంకింగ్‌ రుణ వృద్ధి పడిపోవడాన్ని ఫిచ్‌ ఈ సందర్భంగా ఉటంకించింది. అయితే వృద్ధి రేటు 2020-21లో 6.2 శాతానికి

Most from this category