News


బీమా షేర్లు భేష్‌: జెఫరీస్‌ క్రిస్‌వుడ్‌

Saturday 8th February 2020
Markets_main1581136736.png-31620

బడ్జెట్‌.. యాంటీక్లయిమాక్స్‌
రియల్టీ, ఆటో రంగాలకు మొండిచేయి
క్రిస్టోఫర్‌ ఉడ్‌, ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్‌ హెడ్‌, జెఫరీస్‌ 

అంచనా వేసినట్లుగానే కేంద్ర బడ్జెట్‌ యాంటీక్లయిమాక్స్‌గా నిలిచిందని జెఫరీస్‌ ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్‌ హెడ్‌ క్రిస్టోఫర్‌ ఉడ్‌ వ్యాఖ్యానించారు. జపాన్‌మినహా ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఇండియా మార్కెట్‌కు రెడ్యూస్‌డ్‌ ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్‌బీఎఫ్‌సీలతోపాటు రియల్టీ, ఆటో తదితర రంగాలపై ఒక ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. 

ప్రభావం తక్కువే
ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు అవసరమైన చర్యలను బడ్జెట్‌లో తగిన స్థాయిలో ప్రతిపాదించలేదు. తద్వారా ఇన్వెస్టర్లు నిరాశకు లోనయ్యారు. ఇదే విధంగా రియల్టీ, ఆటో రంగాలకూ చేయూత కరువైంది. ఆదాయ పన్ను తగ్గింపు అంచనాలనూ నెరవేర్చలేదు. అంతేకాకుండా ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు, తదితర వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచారు. తద్వారా దేశీ తయారీని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావించింది. కాగా.. ప్రస్తుతం ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో నెలకొన్న లిక్విడిటీ సమస్యల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు, ఫైనాన్షియల్‌ రంగం కొంతమేర రిస్కులను ఎదుర్కోవలసి వస్తుంది. గతేడాది జీడీపీ నీరసించిన నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులు పూర్తిగా తొలగిపోలేదు. 

బీమా స్టాక్స్‌ భేష్‌
ఆదాయపన్ను మినహాయింపులకు సంబంధించి తాజా బడ్జెట్‌లో సవరణలు చేపట్టినప్పటికీ బీమా రంగం ఆసక్తికరంగా కనిపిస్తోంది. దీర్ఘకాలానికి దేశీ బీమా రంగం ఆసియాలోనే అత్యుత్తమ వృద్ధిని కనబరచనుంది. జులై, సెప్టెంబర్‌లలో పోర్ట్‌ఫోలియోలో చోటు కల్పించిన ఎస్‌బీఐ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 15 శాతం, 11 శాతం చొప్పున లాభపడటం విశేషం!
 You may be interested

రూ.40,500 పైకి పుత్తడి

Saturday 8th February 2020

బంగారం ధర భారీగా పెరిగి రూ.40,500 పైకి చేరింది. ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడుల వైపు దృష్టిపెట్టడం, అంతర్జాతీయంగా  ద్రవ్యోల్బణం  పెరగడంతో పసిడి ధరలు పెరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి దేశీయ ఎంసీఎక్స్‌లో రూ.300 పెరిగి 10 గ్రాముల బంగారం ధరం రూ. 40,644.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో గతరాత్రి 4 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం ధర 1,574 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  (శనివారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల

నిఫ్టీకి 12000 పాయింట్ల వద్ద మద్దతు!

Saturday 8th February 2020

నిఫ్టీకి తక్షణ మద్దతు 12000- 12080 పాయింట్ల వద్ద లభిస్తుందని, పైన 12160- 12200 పాయింట్ల వద్ద నిరోధం ఎదురవుతుందని టెక్నికల్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. శుక్రవారం నిఫ్టీ వెనుకంజ వేసి 12100 పాయింట్ల దిగువన క్లోజయింది. దీంతో 50 రోజుల డీఎంఏ మద్దతు కోల్పోయినట్లయింది. నిఫ్టీ చార్టుల్లో ప్రస్తుతం బేరిష్‌ ఎంగల్ఫింగ్‌ క్యాండిల్‌(డైలీ చార్టుల్లో), బుల్లిష్‌ క్యాండిల్‌(వీక్లీచార్టుల్లో) ఏర్పడ్డాయి. ప్రస్తుతం నిఫ్టీ కీలక స్థాయిల వద్ద ఉందని, బేర్స్‌, బుల్స్‌

Most from this category