News


38,000పైన ముగిసిన పసిడి

Saturday 30th November 2019
Markets_main1575093826.png-29976

ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ పతనం, అంతర్జాతీయంగా మార్కెట్లో పసిడి ధర 10డాలర్ల మేర లాభపడంతో శుక్రవారం ఎంసీఎక్స్‌ డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.38000 పైన ముగిసింది. రాత్రి ఎంసీఎక్స్‌ ట్రేడింగ్‌ ముగిసే సరికి పసిడి రూ.308లు లాభపడి రూ.38031.00 వద్ద స్థిరపడింది. హాంగ్‌కాంగ్‌లో చెలరేగిన రాజకీయ ఉద్రికత్తలతో అం‍తర్జాతీయంగా ఇతర కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ బలపడింది. ఈ క్రమంలో దేశీయంగా ఎంసీఎక్స్‌లో  డాలర్‌ మారకంలో రూపాయి 13పైసలు బలహీనపడి 71.74 వద్ద స్థిరపడింది. రూపాయి పతనం పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచింది. ఇక వారంలో దేశీయ సూచీలు రికార్డు గరిష్టాలను అందుకున్న నేపథ్యంలో పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ స్పల్పపరిమితి శ్రేణిలో కదలాడింది. వారం మొత్తం మీద పసిడి కేవలం రూ.37లు మాత్రమే పెరిగింది. 

అంతర్జాతీయంగా 10డాలర్లు అప్‌
అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చల సఫలతపై మరోసారి ఆందోళనలు తలెత్తడంతో శుక్రవారం పసిడి ఫ్యూచర్లు లాభపడ్డాయి. హాంకాంగ్‌ ఆందోళనకారులకు మద్దతునిచ్చే హ్యూమన్ రైట్స్ అండ్ డెమాక్రసీ యాక్ట్‌పై అమెరికా అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సంతకం చేశారు. హాంకాంగ్‌లో ఆందోళనకారులకు మద్దతు కొనసాగిస్తే, దానికి ప్రతిగా తాము కూడా తగిని రీతిలో బదులివ్వాల్సి ఉంటుందని చైనా అమెరికాను హెచ్చరించింది. ఈ రాజకీయ వైరుధ్యాలతో ఇరుదేశాల మధ్య జరగుతున్న వాణిజ్య యుద్ధ ఒప్పంద చర్చలపై ప్రభావాన్ని చూపవచ్చని పెట్టుబడుదారులు తన పెట్టుబడులను పసిడి ఫ్యూచర్ల వైపు మళ్లించారు. ఫలితంగా నిన్నరాత్రి అమెరికాలో మార్కెట్‌ ముగిసే సరికి ఔన్స్‌ పసిడి ధర 10.50డాలర్లు లాభపడి 1,470.30 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. నిన్న లాభాల్లో ముగిసినప్పటికీ.., ఈ నవంబర్‌లో మూడేళ్ల తరువాత అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. 

హాంగ్‌కాంగ్‌ విషయంలో అమెరికా తీసుకున్న నిర్ణయం చైనాను తీవ్రంగా నిరాశకు గురిచేసింది. ఇప్పటి వరకు ఇరుదేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు పక్కదారి పట్టే అవకాశం ఉంది. ఈ అంశం ఈక్విటీ మార్కెట్ల వైపు ప్రవహించే పెట్టుబడులను పసిడి ఫ్యూచర్ల వైపు మళ్లిస్తుంది. ప్రస్తుతస్థాయి పసిడికి కొనుగోలుకు సరైన సమయం. ఇప్పుడు పసిడి ట్రేడర్లు ఫెడ్‌ రిజర్వ్‌ మానటరీ పాలసీని విధానాన్ని ప్రభావితం చేసే అమెరికా ఆర్థిక గణాంకాలపై దృష్టిని సారించారు. వడ్డీరేట్లను తగ్గించేందుకు ఫెడ్‌ మొగ్గుచూపినట్లైతే... పసిడి ధర 1425డాలర్ల చేరుకునేందుకు ఎక్కువగా అవకాశాలున్నాయని​ఆర్‌జీఓ ఫ్యూచర్స్‌ సీనియర్‌ కమోడిటీ విశ్లేషకులు ఫిలిప్‌ అభిప్రాయపడ్డారు.

వాణిజ్య చర్చల్లో భాగంగా తొలి దశ ఒప్పందంపై అతిత్వరలో ఇరుదేశాధ్యక్షులు సంతకాలు పెట్టే అవకాశం ఉందనే అశావహన అంచనాలతో గత కొద్దిరోజులుగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు గరిష్టస్థాయి వద్ద ట్రేడ్‌ అవుతున్న తరుణంలో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ తగ్గింది. అయితే ధీర్ఘకాలంగా అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం, ఆర్థిక మందగమన భయాలతో పసిడి ధర ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 13.50శాతం లాభపడ్డాయి. 

 

 You may be interested

పావు శాతం రేట్‌ కట్‌ పక్కా?!

Saturday 30th November 2019

నిపుణుల అంచనా డిసెంబర్‌ 3-5న జరిగే సమీక్షా సమావేశంలో ఆర్‌బీఐ పావు శాతం మేర రేట్లను తగ్గించవచ్చని ఎక్కువమంది నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకపక్క ద్రవ్యోల్బణం పెరగడం, మరోపక్క ఎకానమీలో మందగమనం... ఆర్‌బీఐకి విషమ పరీక్షగా మారతాయని అభిప్రాయపడ్డారు. జీడీపీ వృద్ది అంచనాలను ఆర్‌బీఐ స్వల్పంగా తగ్గించవచ్చన్నారు. ఈ దఫా కూడా రేట్లు తగ్గిస్తే ఏడాదిలో ఆరు మార్లు ఆర్‌బీఐ రేట్ల కోత విధించినట్లవుతుంది. అంతేకాకుండా వరుసగా ఎక్కువమార్లు రేట్లు తగ్గించిన

నష్టాల్లో ముగిసిన అమెరికా మార్కెట్లు!

Saturday 30th November 2019

హాంగ్‌కాంగ్‌ ప్రజాసామ్యవాదుల నిరసనకు అమెరికా మద్దితిస్తుండడంతో అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం కుదురుతుందనే అంచనాలు ఇన్వెస్టర్లలో తగ్గాయి. దీంతోపాటు బ్లాక్‌ ఫ్రైడే రోజు వినియోగదారుల నుంచి డిమాండ్‌ తక్కువగా ఉండడంతో కూడా శుక్రవారం సెషన్‌లో అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.  యుఎస్‌ సాంకేతికత కలిగిన ఉత్పత్తులు చైనా నుంచి హువాయ్‌కి చేరకుండా ఉండేందుకు అమెరికా మరిన్ని చర్యలు తీసుకోనుందని రాయిటర్స్‌ వార్తా సంస్థ శుక్రవారం ప్రకటించింది. ఈ నివేదిక వెలువడిన తర్వాత అమెరికా మార్కెట్‌

Most from this category