News


ఆటో, బ్యాంక్‌, మెటల్స్‌పై పాజిటివ్‌!

Thursday 17th October 2019
Markets_main1571296395.png-28950

రిలయన్స్‌ సెక్యూరిటీస్‌
రెండో త్రైమాసిక సీజన్‌ ఆరంభం కావడంతో మార్కెట్లు క్రమంగా రికవరీ చూపుతున్నాయి. ప్రస్తుత రేంజ్‌లో మార్కెట్‌ రాబోయే వారాల్లో కన్సాలిడేట్‌ అవుతుందని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. ఈ స్థితిలో నిర్ధిష్టస్టాకుల్లోనే కదలికలుంటాయని, ఇన్వెస్టర్లు ఎంపిక చేసిన స్టాకుల్లో పెట్టుబడులు పెడతారని, ముఖ్యంగా ఫలితాలు వస్తున్న కంపెనీల స్టాకుల్లో కదలికలుంటాయని తెలిపింది. బ్యాంకు నిఫ్టీ తన 200 రోజుల డీఎంఏను బలంగా దాటి క్లోజయితే ర్యాలీ జరుపుతుందని అంచనా వేసింది. నెలవారీ చార్టుల్లో నిఫ్టీ హయ్యర్‌ టాప్స్‌ చూపుతోందని, పాజిటివ్‌ వార్తలు వస్తే సూచీలు ముందుకు కదలవచ్చని తెలిపింది. ప్రధాన సూచీల్లో అప్‌మూవ్‌ క్రమంగా చిన్న, మిడ్‌క్యాప్‌ సూచీలను కదిలిస్తుందని తెలిపింది. నిఫ్టీతో పోలిస్తే నిఫ్టీ నెక్ట్స్‌ 50 సూచీ గతేడాది కన్నా దాదాపు 3.3 శాతం దిగువన ఉందని, అందువల్ల ఇందులో ఇకపై పాజిటివ్‌ కదలికలుంటాయని అంచనా వేసింది.

రంగాల వారీగా ఆటో, బ్యాంకింగ్‌, మెటల్‌ రంగాలపై బుల్లిష్‌గా ఉన్నట్లు తెలిపింది.
స్వల్పకాలానికి మూడు స్టాకులను రికమండ్‌ చేసింది...
1. ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1460. స్టాప్‌లాస్‌ రూ. 1190.
2. కమ్మిన్స్‌ ఇండియా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 650. స్టాప్‌లాస్‌ రూ. 540.
3. కాడిలా హెల్త్‌కేర్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 265. స్టాప్‌లాస్‌ రూ. 220. 



You may be interested

పన్ను తగ్గింపుతో ప్రైవేటు బ్యాంకులకు అధిక లాభం

Thursday 17th October 2019

-పంకజ్‌ పాండే, ఐసీఐసీఐ డైరక్ట్‌ ప్రస్తుతం మెటల్‌ స్టాకులకు దూరంగా ఉండాలని ఐసీఐసీఐ డెరక్ట్‌, రీసెర్చ్‌ హెడ్‌, పంకజ్‌ పాండే ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. బ్యాంకింగ్‌ సెక్టార్‌కు సంబంధించి ఎన్‌ఐఐ వృద్ధి దృక్పథం ఆధారంగా ప్రైవేట్‌ బ్యాంకులు లేదా మిడ్‌ క్యాప్‌ బ్యాంకు ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు. ఆటో స్టాక్స్‌ను కొనుగోలు చేయడానికి ఇంకొంత కాలం వేచి ఉండడ మంచిదని తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.... నాణ్యమైన స్టాకులను విడిచిపెట్టకండి.. వివిధ

ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో ఫండ్స్‌ కొనుగోళ్ల జోరు

Thursday 17th October 2019

దేశీయ మ్యూచువల్ ఫండ్లు ప్రైవేట్‌రంగ బ్యాంకు షేర్ల కొనుగోళ్లకు ఆస్తకి చూపుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ చివరి నాటికి మ్యూచువల్ ఫండ్ల ఫోర్ట్‌ఫోలియోలో ప్రైవేట్‌రంగ బ్యాంకుల హోల్డింగ్‌ వాటా రికార్డు స్థాయిలో 20.8శాతానికి పెరిగినట్లు మోతిలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. గతేడాది ఇదే సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 470 బేసిస్‌ పాయింట్ల అధికమని గణాంకాలు చెబుతున్నాయి. పెట్టుబడిదారులు రక్షణాత్మక ధోరణి అవలంభిస్తుండం, కంపెనీ ఆదాయాల తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఆర్థిక

Most from this category