News


నిఫ్టీలో లాంగ్‌ పొజిషన్స్‌ తీసుకోవచ్చు!

Tuesday 18th February 2020
Markets_main1582008831.png-31893

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ 
నిఫ్టీలో బుల్లిష్‌ జోరు ఇంకా ముగిసిపోలేదని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది. నిఫ్టీ గతవారం చివరకు బుల్లిష్‌ పియర్సింగ్‌ లైన్‌ క్యాండిల్‌ ​ఏర్పరిచిందని తెలిపింది. నిఫ్టీ గత ర్యాలీ(11600- 12245)కు ఇంకా 50 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయిలను కోల్పోలేదని తెలిపింది. ఈ ర్యాలీకి 38.2, 50 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయిలు 12005, 11930 పాయింట్ల వద్ద ఉన్నాయని వివరించింది. అందువల్ల 11930 పాయింట్ల దిగువన నిఫ్టీ క్లోజయ్యేవరకు బుల్స్‌కు ఛాన్సులుంటాయని తెలిపింది. అందువల్ల ట్రేడర్లు 11930- 11990 పాయింట్ల రేంజ్‌లో కొత్త లాంగ్స్‌ను తీసుకోవచ్చని సిఫార్సు చేసింది. కొత్త లాంగ్స్‌కు 11900 పాయింట్లను స్టాప్‌లాస్‌గా(క్లోజింగ్‌ బేసిస్‌) పెట్టుకోవాలని సూచించింది. ఈ లాంగ్స్‌కు 12240 పాయింట్లను తొలి టార్గెట్‌గా 12430, 12600 పాయింట్లు మలి టార్గెట్లుగా పెట్టుకోవాలని తెలిపింది. 
వచ్చే మూడునాలుగు వారాల కోసం మూడు స్టాక్స్‌ను బ్రోకరేజ్‌ రికమండ్‌ చేసింది...
1. క్రాంప్టన్‌ గ్రీవ్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 326. స్టాప్‌లాస్‌ రూ. 272. రెండేళ్లుగా రూ. 195 వద్దకు రావడం, బలంగా బౌన్స్‌ కావడం చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో షేరు దీర్ఘకాలిక నిరోధాన్ని ఛేదించుకొని బయటపడింది. డీఎంఐ, ఏడీఎక్స్‌ ఇండికేటర్లు పాజిటివ్‌ రన్‌కు సంకేతాలు ఇస్తున్నాయి.
2. గోద్రేజ్‌ప్రాపర్టీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1248. స్టాప్‌లాస్‌ రూ. 1080. కొద్ది కాలంగా 50 వారాలా ఈఎంఏ వద్ద మద్దతు పొంది పైకి వచ్చింది. చార్టుల్లో హయ్యర్‌హై, లో ఏర్పరుస్తూ అప్‌మూవ్‌ కొనసాగింపు సంకేతాలు ఇస్తోంది. ఇటీవలే డబుల్‌టాప్‌ను ఛేదించి పాజిటివ్‌ బ్రేకవుట్‌ ఇచ్చింది. 
3. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1812. స్టాప్‌లాస్‌ రూ. 1630. డైలీ చార్టుల్లో రోజువారీ నిరోధక రేఖను దాటినట్లు చూపుతోంది. వాల్యూంలు కూడా అప్‌మూవ్‌ అనుకూలతను చూపుతున్నాయి. ప్రస్తుతం షేరు తన స్వల్ప, దీర్ఘకాలిక డీఎంఏలకు పైన ట్రేడవుతూ బుల్లిష్‌గా ఉంది. 



You may be interested

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు ఎన్‌సీఎల్‌టీ ఊరట

Tuesday 18th February 2020

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ను  రూ.19,700 కోట్లకు సొంతం చేసుకునేందుకు దివాలా చట్టం కింద జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ను ఎన్‌సీఎల్‌ఏటీ అనుమతించింది. అంతేగాకుండా పాత ప్రమోటర్లపై ఉన్న కేసులు కొత్త యాజమాన్యానికి వర్తించదని పేర్కొంది. ఈ నేపథ్యంలో మంగళవారం జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేరు 1.63 శాతం తగ్గి 283.45 పైసలు వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

అమ్మకాల ఒత్తిడిలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు

Tuesday 18th February 2020

3శాతం నష్టాన్ని చవిచూసిన పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌  మార్కెట్‌ నెలకొన్న అమ్మకాల ఒత్తిడిలో భాగంగా ప్రభుత్వరంగ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ నేడు 2,145.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. టెలికం కంపెనీలు ఏజీఆర్‌ బకాయిలను స్వల్పంగా చెల్లించినప్పటికీ, బ్యాంకింగ్‌ రంగంలో మొండి రుణాలపై ఆందోళనలతో ఇన్వెస్టర్లు మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రభుత్వ రంగ షేర్లను విక్రయిస్తున్నారు.

Most from this category