News


మరొక విజిల్‌బ్లోయర్‌తో ఇన్ఫీ 1% డౌన్‌

Wednesday 13th November 2019
Markets_main1573620212.png-29551

ఇన్ఫోసిస్‌ సీఈవో సలీల్ పరేఖ్‌కు వ్యతిరేకంగా మరొక విజిల్‌ బ్లోయర్‌ కంపెనీ చైర్మన్‌కు, స్వతంత్ర బోర్డు డైరక్టర్లకు లేఖ రాయడంతో బుధవారం సెషన్‌లో ఇన్ఫోసిస్‌ షేరు విలువ 1 శాతం మేర నష్టపోయి ప్రారంభమైంది. ఉదయం 9.52 సమయానికి ఇన్ఫోసిస్‌ షేరు 1.24 శాతం నష్టపోయి రూ. 695.65 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 704.40 వద్ద ముగిసిన ఈ షేరు, బుధవారం సెషన్లో రూ. 696.50 వద్ద ప్రతికూలంగా ప్రారంభమైంది. 
విజిల్‌బ్లోయర్‌ ఫిర్యాదు..  
    నియామక నిబంధనల ప్రకారం కంపెనీ సీఈఓ,  ప్రధాన కార్యాలయమైన బెంగళూరు నుంచి కార్యకలాపాలు సాగించాల్సి ఉండగా ఆయన ముంబైలోనే ఉంటున్నారని విజిల్‌బ్లోయర్‌, కంపెనీ చైర్మన్‌ నందన్‌ నిలేకనికి, స్వతంత్ర డైరక్టర్లకు లేఖ రాశారు.  పరేఖ్‌ తరచూ ముంబై నుంచి బెంగళూరుకు రాకపోకలు సాగిస్తుండటం వల్ల కంపెనీకి రవాణా చార్జీలు, విమాన టికెట్‌ చార్జీల రూపంలో ఇప్పటికి రూ.22 లక్షల దాకా ఖర్చయిందని తెలిపారు. ఆయన బెంగళూరుకు మారని పక్షంలో ఖర్చులన్నింటినీ సీఈవో జీతం నుంచే రాబట్టాలని కోరారు.



You may be interested

ఆల్‌టైం హై వద్ద ఎంటర్‌ కావడం తప్పా?

Wednesday 13th November 2019

ఇన్వెస్టర్లలో భయాలు... నిపుణుల సమాధానాలు, సూచనలు... దేశీయ మార్కెట్‌, ఎకానమీ రెండూ భిన్న ప్రదర్శన చూపుతున్నాయి. ఒకపక్క మార్కెట్స్‌ ఆల్‌టైమ్‌ హైల వద్ద కదలాడుతుంటే, మరోపక్క ఎకానమీలో పరిస్థితి మందగమనం దిశగా కదులుతోందని గణాంకాలు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టీ గరిష్ఠాల వద్ద ఉన్నప్పుడు ఎంటరైన ఇన్వెస్టర్లలో అనవసరంగా ఎంటరయ్యామన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ విషయమై నిపుణుల సమాధానాలు, సూచనలు ఇలా ఉన్నాయి.. = ఎకానమీ ఎలా ఉన్నా, ఆల్‌టైమ్‌ హైల వద్ద

29 పైసలు నష్టపోయిన రూపీ

Wednesday 13th November 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో బుధవారం సెషన్లో 29 పైసలు బలహీనపడి 71.75 వద్ద ప్రారంభమైంది. కాగా యుఎస్‌-చైనా వాణిజ్య ఒప్పందం ఖరారుపై అనుమానాలు రావడంతోపాటు, హాంగ్‌కాంగ్‌లో రాజకీయ అనిశ్చితి వలన సోమవారం సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 19 పైసలు న‍ష్టపోయి  71.46 వద్ద ముగిసింది. గురునానక్‌ జయంతి సందర్భంగా మంగళవారం(నవంబర్‌ 12) సెషన్‌లో ఫారెక్స్‌ మార్కెట్లు పనిచేయలేదు.    ‘యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే అవకాశాలు

Most from this category