News


ఇన్‌ఫ్రా షేర్లకు ఆర్బిట్రేషన్‌ ఆశలు..!

Monday 13th January 2020
Markets_main1578895004.png-30886

క్లెయిముల పరిష్కారంపై అంచనాలు
లాభాల్లో సద్భావ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌
ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్లస్‌లో

జాతీయ రహదారుల అధీకృత సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) తాజాగా ఆర్బిట్రేషన్‌ క్లెయిముల సెటిల్‌మెంటులవైపు దృష్టి సారిస్తున్నట్లు ప్రకటించింది. కోర్టు వెలుపల పరిష్కారానికి(ఔట్‌ ఆఫ్‌ కోర్టు సెటిల్‌మెంట్‌) వీలుగా చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. తద్వారా రూ. 70,000 కోట్ల విలువైన క్లెయిముల పరిష్కార ప్రయత్రాలు ఊపందుకోనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే గత నెల(డిసెంబర్‌)లో రహదారులు, రవాణా శాఖల కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ రూ. 80,000 కోట్ల విలువైన 318 ఆర్బిట్రేషన్‌ కేసుల పరిష్కార సన్నాహాలు చేస్తున్నట్లు పార్లమెంట్‌లో ప్రకటించారు. ఈ బాటలో ఎన్‌హెచ్‌ఏఐ చర్యలు చేపడుతున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో సోమవారం ట్రేడింగ్‌లో పలు మౌలిక సదుపాయాల రంగ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సద్భావ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

జోరుగా..
ఉదయం 11 ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో సద్భావ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్‌ షేరు 6.3 శాతం జంప్‌చేసి రూ. 42 వద్ద ట్రేడవుతోంది. ఇక ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్స్‌ సైతం 5 శాతం ఎగసి రూ. 87కు చేరింది. ఈ బాటలో హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌ 1.5 శాతం పుంజుకుని రూ. 268 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 274 వరకూ పెరిగింది. ఇక దిలీప్‌ బిల్డ్‌కాన్‌ 0.8 శాతం లాభపడి రూ. 412 వద్ద కదులుతోంది. తొలుత రూ. 416 వద్ద గరిష్టానికి చేరింది. ఇతర కౌంటర్లలో అశోకా బిల్డ్‌కాన్‌ 0.5 శాతం బలపడి రూ. 104 వద్ద, కేకుమార్‌ ఇన్‌ఫ్రా‍ప్రాజెక్ట్స్‌ 0.5 శాతం బలపడి రూ. 157 వద్ద, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ 0.25 శాతం లాభంతో రూ. 279 వద్ద ట్రేడవుతున్నాయి. ఇంట్రాడేలో అశోకా బిల్డ్‌ రూ. 106ను తాకగా.. కేఎన్‌ఆర్‌ రూ. 286కు చేరింది. ఇక జేకుమార్‌ రూ. 160 వరకూ ఎగసింది.You may be interested

ప్రాఫిట్‌ ఎప్పుడు బుక్‌ చేయాలి?

Monday 13th January 2020

ఆల్‌టైమ్‌ హై వద్ద సూచీలు దేశీయ మార్కెట్లు గతవారం ఆరంభ నష్టాల నుంచి వెనక్కుమరలి ఆల్‌టైమ్‌ హైకి దూసుకుపోయాయి. సోమవారం నిఫ్టీ 12300 పాయింట్ల పైన బలంగా ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో లాభాల్లో ఉన్న పోర్టుఫోలియోల నుంచి లాభాలు స్వీకరించాలా? లేక అలాగే కొనసాగాలా? అని ఇన్వెస్టర్లు డైలమాలో ఉంటారు. కొందరేమో వచ్చిన లాభాలు మటుమాయం కాకముందే స్వీకరించడం మంచిదని, కొందరేమో మరిన్ని లాభాలను వదులుకొని స్వల్పలాభాలకు ఆశపడకూడదని భావిస్తుంటారు. మరి

ప్రారంభంలో రికార్డుల హోరు

Monday 13th January 2020

రెండోరోజూ ఆల్‌టైం హైని అందుకున్న నిఫ్టీ  డిసెంబర్‌ 20న తర్వాత తొలిసారి ఆల్‌టైంకి సెన్సెక్స్‌ ఐటీ, మెటల్‌, బ్యాంక్‌ ఫార్మా షేర్ల ర్యాలీతో సోమవారం ఉదయం ట్రేడింగ్‌లోనే సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు కొత్త జీవితకాల గరిష్టస్థాయిలను అందుకున్నాయి. సెన్సెక్స్‌ 294 పాయింట్ల లాభంతో 41,893 వద్ద  నిఫ్టీ 81 పాయింట్లు లాభపడి 12,337.75 వద్ద ఆల్‌టైం హైకి అందుకున్నాయి. అమెరికా చైనాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడవచ్చనే అంచనాలతో నేడు ఆసియా

Most from this category