News


ఇన్‌ఫ్రా, రియల్టీ రంగాలపై బడ్జెట్‌ దృష్టి?!

Saturday 25th January 2020
Markets_main1579945403.png-31204

ద్రవ్యలోటు అదుపు కష్టమే
3.5 శాతంలోపు కట్టడి చేస్తే మార్కెట్లకు జోష్‌
- అనిల్‌ సరీన్‌, సీఈవో, సెంట్రమ్‌ పీఎంఎస్‌

బడ్జెట్‌లో ప్రభుత్వం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, రియల్టీ రంగాలపై దృష్టి పెట్టేవీలున్నట్లు చెబుతున్నారు అనిల్‌ సరీన్‌. ఆదాయాలు తగ్గుతున్న నేపథ్యంలో ద్రవ్యలోటు కట్టడి కష్టమేనని, అయితే 3.5 శాతం లక్ష్యాన్ని నిలుపుకుంటే మార్కెట్లకు జోష్‌ లభిస్తుందని సెంట్రమ్‌ పీఎంఎస్‌ విభాగ సీఈవో సరీన్‌ పేర్కొంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఇంకా పలు విషయాలపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. 

రెవెన్యూ వసూళ్లు తగ్గుతున్న నేపథ్యంలో ద్రవ్యలోటు కట్టడి కష్టమే. 3.5 శాతంలోపుకట్టడి చేస్తే సెంటిమెంటు బలపడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకురావలసి ఉంది. ఇందుకు దన్నుగా నిలిచే విధానాలు అవలంబించవలసి ఉంటుంది. ఇలాంటి పలు అంశాలకు బడ్జెట్‌ మంత్రదండం కానప్పటికీ.. ప్రభుత్వ విధానాలను వెల్లడించగలుగుతుంది. బడ్జెట్‌లో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, రియల్టీ రంగాలపై ప్రత్యేక దృష్టిపెట్టే అవకాశముంది. ఇప్పటికే ప్రభుత్వం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగానికి రూ. 105 లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించింది. ఇందుకు నిధుల సమీకరణ వంటి అంశాలపై ప్రభుత్వ గైడెన్స్‌కు ప్రాధాన్యత ఉంది. ఇదే విధంగా గత కొద్ది నెలలుగా సవాళ్లను ఎదుర్కొంటున్న రియల్టీ, ఎన్‌బీఎఫ్‌సీ రంగాలను దారిలో పెట్టే విధానాలు కీలకంగా నిలవనున్నాయి. వీటికితోడు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, విద్య తదితరాలకు చేపట్టే కేటాయింపులను పరిశీలించవలసి ఉంది. ఎల్‌టీసీజీ, డివిడెండ్‌ పంపిణీపై పన్ను వంటి అంశాలలో సానుకూల నిర్ణయాలు ఉండవచ్చని భావిస్తున్నాం.

బ్యాడ్‌ బ్యాంక్‌?
రియల్టీ రంగంలో నెలకొన్న సవాళ్లను అధిగమించేందుకు బ్యాడ్‌ బ్యాంక్‌ తరహా సొల్యూషన్‌కు తెరతీయవలసి ఉంది. మరోపక్క ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో నమోదవుతున్న ప్రొవిజన్ల కట్టడికి చర్చలు చేపట్టవలసి ఉంది. ఇదేవిధంగా డిజిన్వెస్ట్‌మెంట్‌ నిర్వహణకు సరైన దీర్ఘకాలిక విధానాలను రూపొందించవలసి ఉంది. గతంలో భారీ లక్ష్యాలను ప్రకటించినప్పటికీ వాటిని సాధించడంలో విఫలంకావడం వంటి సమస్యలు ఎదుర్కొనడంతో వీటిపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించవలసి ఉంది. ఇలాంటి పలు అంశాల నేపథ్యంలో ప్రభుత్వం బడ్జెట్‌ రూపకల్పనలో ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అయితే విభిన్న రంగాల నుంచి కనిపిస్తున్న డిమాండ్లను నెరవేర్చేందుకు భారీ బడ్జెట్‌ను ప్రకటించే అవకాశాలు తక్కువే.

కరెక్షన్‌కు చాన్స్‌?
బడ్జెట్‌ తదుపరి మార్కెట్లలో కరెక్షన్‌ అవకాశాలను కొట్టిపారేయలేము. ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ 13,000 పాయింట్ల మైలురాయివైపు ప్రయాణించే ముందు 11,000 స్థాయిని పరీక్షించే వీలుంది. బడ్జెట్‌కు ముందుగా మార్కెట్లు ర్యాలీ చేస్తున్న నేపథ్యంలో కొంతమేర అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చు. జీడీపీ నీరసించినప్పటికీ ఈక్విటీ మార్కెట్లకు పెట్టుబడులు తరలి వస్తున్నాయి. అయితే గత రెండు దశాబ్దాలలోలేని విధంగా లార్జ్‌ క్యాప్స్‌, మిడ్‌ క్యాప్స్‌ విలువల మధ్య వ్యత్యాసం అధికమైంది. 2019 సెప్టెంబర్‌తో ముగిసిన గత మూడు క్వార్టర్లలో ఎన్‌ఎస్‌ఈ-100 మిడ్‌ క్యాప్‌ ఆర్జన నిఫ్టీ-50 కంపెనీలతో పోలిస్తే ఎక్కువే. అయితే షేర్ల విలువలరీత్యా మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ చౌకగా ఉన్నాయి. దీంతో 2020 కేలండర్‌ ఏడాదిలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ ఔట్‌పెర్‌ఫార్మ్‌ చేయవచ్చని భావిస్తు‍న్నాం. You may be interested

ఈ వారంలో ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ, బడ్జెట్‌.. తస్మాత్‌ జాగ్రత్త!

Saturday 25th January 2020

నిపుణుల సూచన రాబోయే వారంలో జనవరి సీరిస్‌ ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ, బడ్జెట్‌ సెషన్‌ ఉన్నందున మార్కెట్లో తీవ్ర ఒడిదుడకులుంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈవారం సూచీలు నెగిటివ్‌గా ఆరంభమైనా, చివరి రెండు సెషన్లలో లాభాలను ఆర్జించింది. కొన్ని రోజులుగా నిఫ్టీ దాదాపు 300- 400 రేంజ్‌లో కదలికలు చూపింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి బ్రేకవుట్‌ కానీ, బ్రేక్‌డౌన్‌కానీ చూపలేదు. నిఫ్టీ కీలక ట్రెండ్‌లైన్‌

బడ్జెట్‌ నచ్చకపోతే మార్కెట్లో మహా పతనమే!

Saturday 25th January 2020

నిపుణుల అంచనా వచ్చే వారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై మార్కెట్‌ వర్గాల్లో చాలా ఆశలున్నాయి. ఈ ఆశలతో నిఫ్టీ 12వేల పాయింట్ల పైన కొనసాగుతూ వస్తోంది. చిన్న, మధ్యతరహా స్టాకుల్లో బడ్జెట్‌ ఆశలతో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. దీంతో నిఫ్టీ ఈ వారం 12400 పైన గరిష్ఠాలను తాకగలిగింది. అయితే అధిక వాల్యూషన్ల కారణంగా పైన నిలదొక్కుకోలేక వెనక్కు వచ్చింది. మరోవైపు ఐఎంఎఫ్‌ తాజాగా భారత వృద్ధి అంచనాలను 4.8 శాతానికి

Most from this category