News


ఇన్‌ఫ్రా, కన్జూమర్‌, ఫైనాన్స్‌కు ఫండ్స్‌ ఓటు

Wednesday 15th January 2020
Markets_main1579082205.png-30952

వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్న సార్వత్రిక బడ్జెట్‌ నేపథ్యంలో ఇటీవల మ్యూచువల్‌ ఫండ్స్‌ మౌలిక సదుపాయాలు(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌), వినియోగం(కన్జూమర్‌), ఆర్థిక సేవలు(ఫైనాన్స్‌) రంగాలపట్ల ఆసక్తి కనబరుస్తున్నాయి. డిసెంబర్‌(2019)లో దేశీ ఫండ్స్‌(ఎంఎఫ్‌లు) షాపింగ్‌ జాబితాలో ఈ రంగాల కంపెనీలకే ప్రాధాన్యం లభించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వివరాలు చూద్దాం...

దేశీ మ్యూచువల్‌ ఫండ్‌ అసోసియేషన్‌(యాంఫీ) వివరాల ప్రకారం గతేడాది(2019)లో స్టాక్‌ మార్కెట్లు 12 శాతం బలపడ్డాయి. ఇదే సమయంలో ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 10 శాతం పుంజుకుని రూ. 26.5 లక్షల కోట్లను తాకాయి. కాగా.. క్లోజ్‌డ్‌ ఎండెడ్‌ పథకాలుసహా డిసెంబర్‌ నెలలో ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ. 4,432 కోట్ల పెట్టుబడులు ప్రవహించాయి.

పెట్టుబడుల తీరిలా..

ఫండ్స్‌ పెట్టుబడుల జాబితాలో లార్జ్‌క్యాప్స్‌.. హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, అంబుజా సిమెంట్‌, డీఎల్‌ఎఫ్‌, నెస్లే, మారుతీ, అల్ట్రాటెక్‌, గోద్రెజ్‌ కన్జూమర్‌, టైటన్‌లకు ప్రాధాన్యత లభించింది. ఇక మిడ్‌క్యాప్స్‌లో క్వెస్‌ కార్ప్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జూమర్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్స్‌, ఎస్కార్ట్స్‌, జీఎంఆర్‌, గ్లెన్‌మార్క్‌, మైండ్‌ట్రీలలో ఫండ్స్‌ వాటా పెంచుకున్నాయి. ఇదే విధంగా స్మాల్‌ క్యాప్‌ విభాగంలో కేన్‌ఫిన్‌ హోమ్స్‌, ఎస్సెల్‌ ప్రొప్యాక్‌, సుప్రజిత్‌ ఇంజినీరింగ్‌, వెల్‌స్పన్‌ కార్ప్‌, నారాయణ హృదయాలయ, లా ఒపాలా, టీమ్‌లీజ్‌, డెల్టా కార్ప్‌, బలరామ్‌పూర్‌, వీమార్ట్‌లకు చోటు లభించింది.  

లార్జ్‌ క్యాప్స్‌(కొన్న షేర్లు లక్షల్లో)

కంపెనీ పేరు     డిసెంబర్‌     నవంబర్‌ 
హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ     13     6
అంబుజా సిమెంట్స్‌     1089     987
డీఎల్‌ఎఫ్‌             351     324
మారుతీ             181     168
నెస్లే             40     37

మిడ్‌ క్యాప్స్‌

క్వెస్‌ కార్ప్‌ 169     75
ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 1001     794
క్రాంప్టన్‌గ్రీవ్స్‌ కన్జూ. 1573     1253
మోతీలాల్‌ ఓస్వాల్‌ 46     37
ఎస్కార్ట్స్‌ 80     69

స్మాల్‌ క్యాప్స్‌

కేన్‌ ఫిన్‌ హోమ్స్‌ 88     69
ఎస్సెల్‌ ప్రొప్యాక్‌ 43     34
సుప్రజిత్‌ ఇంజి. 55     44
వెల్‌స్పన్‌ కార్ప్‌ 105 86
నారాయణ హృదయ 119     101


 You may be interested

చివర్లో రికవరీ- నష్టాలు స్వల్పమే

Wednesday 15th January 2020

సెన్సెక్స్‌ తొలుత 300 పాయింట్లు డౌన్‌ 80 పాయింట్లవరకూ జారిన నిఫ్టీ చివరి అర్ధగంటలో ట్రేడర్ల షార్ట్‌ కవరింగ్‌ రికార్డు గరిష్టాల రెండు రోజుల ర్యాలీకి బుధవారం బ్రేక్‌ పడింది. వాణిజ్య వివాద పరిష్కారానికి వీలుగా నేడు అమెరికా, చైనా ప్రాథమిక ఒప్పందంపై సంతకాలు చేయనున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మా‍ర్కెట్లు అమ్మకాలతో కుదేలయ్యాయి. అయితే చివరి అర్ధగంటలో నష్టాల నుంచి కోలుకున్నాయి. చివరికి స్వల్ప నష్టాలతో నిలిచాయి. సెన్సెక్స్‌ 80 పాయింట్లు క్షీణించి

రానున్న రోజుల్లో మార్కెట్‌ మున్ముందుకే..!

Wednesday 15th January 2020

ఆసియా యూరప్‌ మార్కెట్లలో నెలకొన్న అమ్మకాలతో రెండు రోజుల వరుస రికార్డు ర్యాలీ తర్వాత దేశీయ మార్కెట్‌ బుధవారం కన్సాలిడేషన్‌ దిశగా కదులుతోంది. ఈ తరుణంలో మార్కెట్‌ గమనంపై విశ్లేషకులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. మార్కెట్‌ ర్యాలీలో సత్తా ఇంకా అయిపోలేదని, మార్కెట్‌ దిగివచ్చిన ప్రతిసారి కొనుగోలు చేయమని ఇన్వెస్టర్లకు వారు సలహానిస్తున్నారు. చైనాపై సుంకాలు ప్రస్తుతానికి కొనసాగుతాయని అమెరికా ఉన్నతాధికారి ఒకరు చేసిన వ్యాఖ్యలతో నేడు ప్రపంచ వ్యాప్తంగా

Most from this category