News


క్యూ3 ఎఫెక్ట్‌- ఇన్ఫోసిస్‌ 3 శాతం అప్‌

Monday 13th January 2020
Markets_main1578888317.png-30879

3 శాతం ఎగసిన ఇన్ఫోసిస్‌ షేరు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించడంతో దేశీ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌ జోరందుకుంది. అంతేకాకుండా భారీ ఆర్డర్లు లభించడంతో ప్రోత్సాహకర ఆదాయ అంచనాలు(గైడెన్స్‌) సైతం ప్రకటించడంతో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం(ఉదయం 9.25 ప్రాంతంలో) ఎన్‌ఎస్‌ఈలో ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ షేరు 3.2 శాతం జంప్‌చేసి రూ. 762 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 763 వరకూ పెరిగింది. 

ఫలితాలు ఇలా
క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ రూ. 4457 కోట్ల నికర లాభం​ఆర్జించింది. త్రైమాసిక ప్రాతిపదికన ఇది 11 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం సైతం 2 శాతం పుంజుకుని రూ. 23,092 కోట్లను తాకింది. పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాలలో 10-10.5 శాతం వృద్ధి సాధించనున్నట్లు ఇన్ఫోసిస్‌ తెలియజేసింది. గతంలో ఇచ్చిన 9-10 శాతం గైడెన్స్‌కంటే ఇది అధికంకాగా.. మరోవైపు ప్రజావేగు(విజిల్‌బ్లోయర్‌) ఆరోపణల్లో వాస్తవాలు లేవంటూ ఆడిట్‌ కమిటీ పేర్కొంది. దీంతో శుక్రవారం న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో లిస్టయిన ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 1.6 శాతం బలపడి 10.65 డాలర్ల వద్ద ముగిసింది. ఫలితంగా ఈ కౌంటర్‌ నేటి ట్రేడింగ్‌లో లాభాలలతో ప్రారంభమైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.


 



You may be interested

పన్ను ఆదా రాచమార్గాలు

Monday 13th January 2020

అధిక రాబడులు ఈఎల్‌ఎస్‌ఎస్‌లోనే ఆ తర్వాత ఎన్‌పీఎస్‌ టాప్‌ ఎన్‌పీఎస్‌తో పన్ను ఆదా, రిటైర్మెంట్‌ కోసం నిధి పన్ను ఆదా కోసం బీమా వైపు చూడొద్దు టర్మ్‌ ప్లాన్ల ప్రీమియంపైనా పన్ను ఆదా చివరి నిమిషంలో ఇన్వెస్ట్‌ చేయాలంటే బ్యాంకు ఎఫ్‌డీ పన్ను ఆదాయం ఉన్న వారు కొంత మొత్తంపై పన్ను పడకుండా చూసుకునేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను లేకుండా చేసుకోవచ్చు. ఇందుకోసం ఎన్నో పెట్టుబడి

చిన్న స్టాకుల సందడి కొనసాగుతుంది!

Monday 13th January 2020

సందీప్‌ పోర్వల్‌ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌లో ర్యాలీ కొనసాగుతుందని టెక్నికల్‌ సెటప్‌ సూచిస్తోందని ఆషికా స్టాక్‌ బ్రోకింగ్‌ అనలిస్టు సందీప్‌ పోర్వల్‌ చెప్పారు. చిన్న షేర్లు బుల్లిష్‌గా ఉన్నందున ప్రస్తుత తరుణంలో ఈ విభాగానికి చెందిన నాణ్యమైన స్టాకులను ఎంచుకోవచ్చని సూచించారు. ఎంఅండ్‌ఎం, ఎక్సైడ్‌, అపోలోటైర్స్‌, షాపర్స్‌ స్టాప్‌ షేర్లను ఈ విభాగం నుంచి రికమండ్‌ చేశారు. లార్జ్‌క్యాప్స్‌లో ఆర్‌ఐఎల్‌ను పెరిగినప్పుడుల్లా అమ్మొచ్చని సిఫార్సు చేశారు. నిఫ్టీకి 12300 పాయింట్ల వద్ద

Most from this category