News


ఇన్ఫీ షేరు 6 శాతం అప్‌

Monday 4th November 2019
Markets_main1572849522.png-29330

ఆరోపణలపై ఆధారాల్లేవన్న కంపెనీ
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ షేరు సోమవారం మధ్యాహ్న ట్రేడింగ్‌ సమయానికి అనూహ్యంగా కోలుకొని దాదాపు 6 శాతం పైగా దూసుకుపోయింది. మునుపటి క్లోజింగ్‌ 687.90రూపాయల దిగువన ఆరంభమైన షేరు ఒకదశలో 678 రూపాయల వరకు పతనమైంది. అయితే కంపెనీపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక ఆధారాల్లేవన్న ప్రకటనతో షేరు ఒక్కసారిగా లాభాల్లోకి మరలింది. అలా స్పీడుగా దాదాపు 6.5 శాతం లాభపడి రూ.732 వద్ద ఇంట్రాడే హైని తాకిన షేరు ప్రస్తుతం 4 శాతం లాభంతో రూ.715 వద్ద కదలాడుతోంది.

కంపెనీ ఉన్నతాధికారులు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారంటూ కొందరు వ్యక్తులు నియంత్రణా సంస్థలకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై స్పందించాలని ఎక్చేంజ్‌లు కంపెనీని కోరాయి. తాజాగా ఈ లేఖల్లో ఫిర్యాదులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని కంపెనీ స్టాక్‌ఎక్చేంజ్‌లకు వెల్లడించింది. ప్రస్తుతానికి ఇంకా ఈ ఫిర్యాదులపై విచారణ జరుగుతూనే ఉందని, వీటి విశ్వసనీయతను ఇప్పటికి ఇంకా నిర్ధారించలేమని నవంబర్‌ 2న ఎక్చేంజ్‌లకు రాసిన ప్రత్యుత్తరంలో తెలిపింది. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు దేశీయ నిబంధనలకు సంబంధంలేనివని, అందువల్ల సదరు ఫిర్యాదును బహిర్గతం చేయలేదని తెలిపింది. కాగా ఈ విషయమై అమెరికా సెక్‌ విచారణ జరపుతుందని గతనెల్లో ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. 



You may be interested

రాణిస్తున్న ప్రభుత్వరంగ షేర్లు

Monday 4th November 2019

మార్కెట్‌కు లభిస్తున్న కొనుగోళ్ల మద్దతలో భాగంగా సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ప్రభుత్వరంగ షేర్లు రాణిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ప్రభుత్వరంగ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 2శాతానికి పైగా లాభపడింది. నేడు ఇండెక్స్‌ 2,558.75 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఇండెక్స్‌లో ప్రధాన షేర్లైన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3.50శాతం లాభపడింది. ఇండియన్‌ బ్యాంక్‌ 3శాతం, పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓరియంటల్‌ బ్యాంక్‌

61 డాలర్ల పైకి క్రూడ్‌

Monday 4th November 2019

యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ఈ నెలలో ఖరారు కానుందనే అంచనాల నేపథ్యంలో శుక్రవారం రాత్రి అమెరికా ట్రేడింగ్‌లో 3 శాతానికి పైగా లాభపడిన చమురు ధరలు, సోమవారం ఆసియాలో లాభాల స్వీకరణ ఫలితంగా  గరిష్టస్థాయి నుంచి తగ్గాయి. ఉదయం 10.45 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.55 శాతం నష్టపోయి బారెల్‌ 61.35 డాలర్ల వద్ద, డబ్ల్యూటీఐ క్రూడ్‌ 0.59 శాతం నష్టపోయి బారెల్‌ 55.87 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. యుఎస్‌ క్రూడ్‌ ఆయిల్‌

Most from this category