News


ఇన్ఫోసిస్‌ 15% క్రాష్‌!

Tuesday 22nd October 2019
Markets_main1571716674.png-29041

 స్వల్ప కాలంలో మార్జిన్‌లు, లాభాలను పెంచుకోడానికి అనైతిక విధానాలను అనుసరిస్తోందని ఇన్ఫోసిస్‌కు వ్యతిరేకంగా, కొంత మంది ఉద్యోగులు యుఎస్‌ సెక్యురిటీ ఎక్సెంజ్‌కి, ఇన్ఫోసిస్‌ బోర్డుకు లేఖలు రాయడంతో సోమవారం సెషన్‌లో ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌లు(యుఎస్‌ మార్కెట్లో) 16 శాతం మేర పడిపోయాయి. అదే విధంగా దేశీయ మార్కెట్‌లో కూడా ఇన్ఫోసిస్‌ షేరు మంగళవారం సెషన్‌లో 10 శాతం లేదా రూ. 76.75 నష్టపోయి రూ. 691.10 వద్ద ప్రారంభమైంది. ప్రారంభంలో షేరు భారీగా పడిపోవడంతో ఇన్ఫోసిస్‌ ట్రేడింగ్‌ను కొంత సమయం వరకు ఎక్సేంజిలు ఫ్రీజ్‌ చేశాయి. తిరిగి ఉదయం 9.30 సమయానికి ఇన్ఫోసిస్‌ ట్రేడింగ్‌ ప్రారంభమైంది. కాగా తిరిగి ట్రేడింగ్‌ ప్రారంభమవ్వడంతోనే కంపెనీ షేరు 15 శాతం పతనమయ్యింది. మొత్తంగా ఉదయం 9.46 సమయానికి కంపెనీ షేరు 13.75 శాతం లేదా రూ. 105 నష్టపోయి రూ. 662.30 వద్ద ట్రేడవుతోంది.  గత సెషన్‌లో ఇన్ఫోసిస్‌ 1.65 శాతం నష్టపోయి రూ. 767.85 వద్ద ముగిసింది.



You may be interested

ఫలితాల ఎఫెక్ట్‌...ఆర్‌ఐఎల్‌ 1.5 శాతం అప్‌

Tuesday 22nd October 2019

రిలయన్స్‌ ఫలితాలు బాగుండడంతో మంగళవారం ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేరు 1.5 శాతం గ్యాప్‌అప్‌తో రూ. 1,436 వద్ద ప్రారంభమయ్యింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించి రికార్డ్‌ స్థాయిలో లాభాన్ని శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో రూ.9,516 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ క్యూ2లో రూ.11,262 కోట్లకు ఎగిసింది. ఉదయం 9.45 సమయానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 0.96శాతం

విమానయాన రంగంపై పన్నుల భారం దించాలి: సింగ్‌

Tuesday 22nd October 2019

వాషింగ్టన్‌: విమానయాన రంగంపై పన్నుల భారం తగ్గించాలని స్పైస్‌జెట్‌ చీఫ్‌ అజయ్‌ సింగ్‌ ప్రభుత్వానికి సూచించారు. ఎంఆర్‌వో(నిర్వహణ, రిపెయిర్‌, ఓవర్‌హాల్‌) విభాగంలో భారత్‌ అద్భుతంగా పనిచేయగలదని అభిప్రాయపడ్డారు. భారత్‌లో పౌర విమానాయన రంగంపై అధిక పన్నుల భారం ఉందని, అంతర్జాతీయంగా పోటీ పడేందుకు ఇది అవరోధంగా ఉన్నట్టు సింగ్‌ చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ‘‘విమానయాన రంగం ఉద్యోగాలు కల్పిస్తోంది. భారత్‌ను ప్రపంచంతో అనుసంధానిస్తోంది.

Most from this category