News


ఇన్ఫోసిస్‌ రికార్డు

Friday 23rd August 2019
Markets_main1566533134.png-27959

రూపీ డాలర్‌ మారకంలో గత ఏడాది డిసెంబర్‌ తర్వాత అత్యంత కనిష్ఠానికి(71.91 డాలర్‌ మారకంలో) పడిపోవడంతో ఇన్ఫోసిస్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో పాజిటివ్‌గా ప్రారంభమైంది. ఉదయం 9.26 సమయానికి ఈ షేరు 1.67 శాతం లాభపడి చరిత్రాత్మక గరిష్టస్థాయి రూ. 809.00 వద్ద ట్రేడవుతోంది. ఇన్ఫోసిస్‌ షేరు ఆల్‌టైం గరిష్ఠాన్ని తాకడంతో ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌  రూ. 3,46,395.17 కోట్లకు చేరుకోవడం గమనార్హం. గత సెషన్‌లో రూ. 795.70 వద్ద ముగిసిన ఈ షేరు, రూ. 796.45 వద్ద శుక్రవారం ప్రారంభమైంది. కాగా ఇదే సమయానికి నిఫ్టీ 50 85 పాయింట్లు నష్టపోయి 10,653.50 పాయింట్ల వద్ద ట్రేడవుతుండడం గమనార్హం.



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1.5 శాతం పతనం

Friday 23rd August 2019

నిన్నటి ట్రేడింగ్‌లో రెండువారాల కనిష్టానికి పతనమైన నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 1.50శాతం క్షీణించింది. ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్ల భారీ క్షీణిత ఇందుకు కారణమవుతోంది. నేడు నిఫ్టీ ఇండెక్స్‌ 26,835.35 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభంలోనే ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లైన ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంకు షేర్లు 3శాతం మేర నష్టపోవడంతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఒకదశలో

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Friday 23rd August 2019

 ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపన ప్యాకేజీ వుండబోదంటూ చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వయిజర్‌ సంకేతాలివ్వడంతో క్రితం రోజు భారీ పతనాన్ని చవిచూసిన భారత్‌ సూచీలు శుక్రవారం సైతం గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 85 పాయింట్ల తగ్గుదలతో 36,387 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 42 పాయింట్ల నష్టంతో 10,700 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

Most from this category