News


పాజిటివ్‌ జోన్‌లో ఇన్ఫోసిస్‌

Saturday 11th January 2020
Markets_main1578717822.png-30854

విజిల్‌ బ్లోయర్‌ ఆరోపణలు తేలిపోవడం సానుకూలం
పటిష్ట ఫలితాలు, గైడెన్స్‌ పెంపుతో షేరుకి జోష్‌ 
ప్రధాన విభాగాల్లో వృద్ధిపైనే భవిష్యత్‌ కదలికలు
క్యూ3 తదుపరి మార్కెట్‌ విశ్లేషకుల అంచనాలు

ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ పనితీరు ఆకట్టుకున్నప్పటికీ కొన్ని అంశాలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే.. ఆదాయ అంచనాలు(గైడెన్స్‌) పెంపుతోపాటు..విజిల్‌ బ్లోయర్‌ ఆరోపణల్లో వాస్తవాలు లేవంటూ ఆడిట్‌ కమిటీ తోసిపుచ్చడం కంపెనీకి సానుకూల అంశాలని తెలియజేశారు. స్వతంత్ర న్యాయ సంస్థ నిర్వహించిన దర్యాప్తులో భాగంగా ఆర్థిక అవకతవకలు లేదా కంపెనీ ఎగ్జిక్యూటివ్స్‌ అపసవ్య విధానాలు అవలంబించిన ఆధారాలు లేవని ఆడిట్‌ కమిటీ పేర్కొంది.​ ‌దీంతో సమీప కాలంలో ఇన్ఫోసిస్‌ షేరుకి ఈ అంశాలు ప్రోత్సాహాన్నిచ్చే వీలున్నట్లు మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే నిర్వహణ లాభం అంచనాలకు దిగువనే నమోదైనట్లు తెలియజేశారు. కంపెనీకి ప్రధానమైన ఫైనాన్షియల్‌ సర్వీసులు, రిటైల్‌ విభాగాలలో వృద్ధి కనిపించకపోవడం ఆందోళనకర అంశమని పేర్కొన్నారు. మొత్తం ఆదాయంలో ఈ విభాగాల వాటా 47 శాతం కావడం గమనార్హం!

డిజిటల్‌ స్పీడ్‌..
తాజా క్వార్టర్‌లో 1.8 బిలియన్‌ డాలర్ల లార్జ్‌ డీల్స్‌ను పొందినట్లు ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. కాగా.. గత 12 నెలల కాలాన్ని పరిగణిస్తే.. డాలర్ల రూపేణా డిజిటల్‌ ఆదాయం పుంజుకుంటూ వస్తోంది. 2017 సెప్టెంబర్‌ క్వార్టర్‌లో నమోదైన 558 మిలియన్‌డాలర్ల నుంచీ చూస్తే తదుపరి రెండేళ్ల కాలంలో అంటే 2019 డిసెంబర్‌కల్లా 1.1 బిలియన్‌ డాలర్లను అందుకుంది. వార్షిక ప్రాతిపదికన చూసినా ఆదాయంలో వృద్ధి 5.6 శాతం నుంచి 9.5 శాతానికి బలపడింది. వేగవంత వృద్ధిలో ఉన్న డిజిటల్‌ విభాగం వాటా.. తాజాగా మొత్తం ఆదాయం(3.24 బిలియన్‌ డాలర్లు)లో 41 శాతానికి చేరింది.

ఫైనాన్షియల్‌ విభాగం?
మొత్తం ఆదాయంలో 31.5 శాతం వాటా కలిగిన ఫైనాన్షియల్‌ విభాగం క్యూ3లో 6.2 శాతం వృద్ధినే సాధించింది. అంతక్రితం క్వార్టర్‌లో ఇది 10.3 శాతంగా నమోదైంది. దీంతో ఆదాయ అంచనాలను 9-10 శాతం నుంచి తాజాగా 10-10.5 శాతానికి పెంచినప్పటికీ కంపెనీ ఆర్జనలో అధిక వృద్ధికి అవకాశం తక్కువేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.​ కాగా.. శుక్రవారం ఇన్ఫోసిస్‌ షేరు రూ. 738కు చేరింది. విజిల్‌బ్లోయర్‌ ఆరోపణలతో అక్టోబర్‌ 22న రూ. 643కు నీరసించింది. ఈ ఆరోపణలకు ముందు ఇన్ఫోసిస్‌ రూ. 770 స్థాయిలో ట్రేడయ్యింది. ఫైనాన్స్‌, రిటైల్‌ విభాగాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం, నిర్వహణ లాభాలను బలపరచుకోవడం వంటి అంశాలు భవిష్యత్‌లో ఇన్ఫోసిస్‌ కౌంటర్‌ను నడిపించే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. You may be interested

అసలు వాళ్లు ఇన్ఫీ ఉద్యోగులేనా..నీలకేని

Saturday 11th January 2020

విజిల్‌బ్లోయర్స్‌పై నందన్‌ అనుమానం గతేడాది ఇన్ఫోసిస్‌ టాప్‌మేనేజ్‌మెంట్‌పై కొందరు విజిల్‌ బ్లోయర్లు చేసిన ఆరోపణలకు ఆధారాల్లేవని కంపెనీ ఏర్పాటు చేసిన ఆడిట్‌ కమిటీ నివేదిక ఇచ్చింది. కంపెనీ టాప్‌మేనేజ్‌మెంట్‌కు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఈనేపథ్యంలో కంపెనీ త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా సంస్థ చైర్మన్‌ నందన్‌ నీలకేని సదరు విజిల్‌ బ్లోయర్స్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు వాళ్లు నిజంగా తమ కంపెనీ ఉద్యోగులేనా? ఈ విషయం చెక్‌ చేయాలని అభిప్రాయపడ్డారు. తమ ఉద్యోగులు,

చందా కొచర్‌ ఆస్తులు ఈడీ జప్తు

Saturday 11th January 2020

న్యూఢిల్లీ: అక్రమ ధనార్జన కేసులో ఐసీఐసీఐ మాజీ చైర్మన్‌ చందా కొచర్‌, మరికొందరికి చెందిన రూ.78 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. ఈ మేరకు అక్రమ ధనార్జనా  నిరోధక చట్టం నిబంధనల కింద ఒక ఉత్తర్వ్యు జారీ అయ్యింది. ముంబైలో కొచర్‌కు ఉన్న ఇల్లు, అమెతో సంబంధం ఉన్న ఒక కంపెనీకి చెందిన ఆస్తులు... జప్తు అయిన వాటిలో ఉన్నట్లు శుక్రవారం అత్యున్నత స్థాయి

Most from this category