News


ఆల్‌టైం గరిష్ఠానికి ఇన్ఫోసిస్‌

Thursday 5th September 2019
Markets_main1567665004.png-28212

యుఎస్‌-చైనా మధ్య మరో రౌండ్‌ వాణిజ్య చర్చలు అక్టోబర్‌ నెల ప్రారంభంలో ఉండడంతో గురువారం ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఫలితంగా దేశియ ఐటీ దిగ్గజమైన ఇన్ఫోసిస్‌ తన ఆల్‌ టైం గరిష్ఠాన్ని చేరుకుంది. ఉదయం 11.53 సమయానికి ఇన్ఫోసిస్‌ స్టాకు 1.53 శాతం లాభపడి రూ. 833.85  వద్ద ట్రేడవుతోంది. రూపీ డాలర్‌ మారకంలో భారీగా పడిపోవడంతో సెప్టెంబర్‌ 3 సెషన్‌లో తన 52 వారాల గరిష్ఠాన్ని తాకిన ఈ షేరు, గురువారం(సెప్టెంబర్‌ 5) ట్రేడింగ్‌లో ఆల్‌టైం గరిష్ఠాన్ని తాకడం గమనార్హం. గత సెషన్‌లో ఇన్ఫోసిస్‌ స్టాకు రూ. 821.30 వద్ద ముగియగా, గురువారం ట్రేడింగ్‌లో రూ. 830.10 వద్ద ప్రారంభమై, రూ. 826.65 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని, రూ. 837.50 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. You may be interested

చిన్న స్టాకులు ఆకర్షణీయం!

Thursday 5th September 2019

కోటక్‌ మహీంద్రా ఏఎంసీ డైరెక్టర్‌ నీలేశ్‌ షా వాల్యూషన్ల పరంగా మార్కెట్లు చౌకగా ఉన్నాయని, ముఖ్యంగా స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌ ఆకర్షణీయంగా ఉన్నాయని కోటక్‌ మహీంద్రా ఏఎంసీ డైరెక్టర్‌ నీలేశ్‌ షా చెప్పారు. లార్జ్‌క్యాప్స్‌ సైతం సరసమైన వాల్యూషన్ల వద్ద ఉన్నాయని, సూపర్‌ లార్జ్‌క్యాప్స్‌ మాత్రం ఇంకా ఖరీదుగానే ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లు నెగిటివ్‌ నుంచి న్యూట్రల్‌ ధృక్పథంలో కదలాడుతున్నాయని తెలిపారు. ఎర్నింగ్స్‌ అంచనాలను అందుకోలేకపోవడం, వివిధ టాక్సులు మార్కెట్‌ సెంటిమెంట్‌పై

లాభాల్లో ఆటో షేర్లు..టాటామోటర్స్‌ 5 శాతం అప్‌

Thursday 5th September 2019

యుఎస్‌-చైనా మధ్య మరో రౌండ్‌ వాణిజ్య చర్చలు అక్టోబర్‌ నెల ప్రారంభంలో జరగనున్నాయని చైనా వాణిజ్య మంత్రి ప్రకటించడంతో గురువారం అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతేకాకుండా దేశియ బెంచ్‌మార్క్‌ సూచీలు పాజిటివ్‌గా ట్రేడవుతుండడంతో ఉదయం 11.34 సమయానికి నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ 1.68 శాతం లాభపడి 6,896.10 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన  మారుతి సుజుకీ 1.43 శాతం లాభపడి రూ. 5,914.00 వద్ద,

Most from this category