News


ఇన్ఫోసిస్‌కు బైబ్యాక్‌ జోష్‌

Wednesday 20th March 2019
Markets_main1553076102.png-24716

ఇన్ఫోసిస్‌ షేర్ల బైబ్యాక్‌ ఇష్యూ నేటి నుంచి ప్రారంభమైంది. దీంతో మార్కెట్లో ఈ కంపెనీ షేర్లకు భారీగా గిరాకీ నెలకొంది. ఫలితంగా ఇంట్రాడేలో షేర్లు 3శాతం లాభాన్ని ఆర్జించాయి. జనవరి 12న విడుదల చేసిన కంపెనీ త్రైమాసిక ఫలితాల సందర్భంగా కంపెనీ షేర్ల బైబ్యాక్‌ ఇష్యూను ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.8,260 కోట్ల విలువైన ఈ బైబ్యాక్‌ ఇష్యూలో భాగంగా ఒక్కో షేరుకు గరిష్టంగా రూ.800 ధర నిర్ణయించింది. దీనికింద 10.32 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనుంది. ఇది కంపెనీ మొత్తం వాటాలో సుమారు 2.36 శాతంగా ఉంటుంది. బై బ్యాక్‌ ఇష్యూ ప్రారంభం జోష్‌తో నేటీ ఇంట్రాడేలో కంపెనీ షేరు 3శాతం లాభపడి రూ.742 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.3:00లకు షేరు గత ముగింపు ధర(రూ.721.5)తో పోలిస్తే 2శాతం లాభంతో రూ.737ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కంపెనీ బైబ్యాక్‌ నేపథ్యంలో షేరు ఈ రెండు ట్రేడింగ్‌ సెషన్స్‌లో 4.50శాతం ర్యాలీ చేసింది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 549.50 రూ.771.15లుగా నమోదయ్యాయి.



You may be interested

ఆ ఏడు మార్కెట్ల కన్నా ఇండియాలోకే ఎక్కువ

Wednesday 20th March 2019

విదేశీ సంస్థాగత నిధుల ప్రవాహం మార్చి ఆరంభం నుంచి దేశీ మార్కెట్లోకి విదేశీ నిధులు(ఎఫ్‌పీఐ) ప్రవాహం ఒక్కమారుగా ఊపందుకుంది. ఈ నెల్లో ఎఫ్‌పీఐలు దాదాపు 22వేల కోట్ల రూపాయలను ఇండియా ఈక్విటీల్లోకి కుమ్మరించారు. ఫిబ్రవరిలో ఎయిర్‌స్ట్రైక్స్‌ అనంతరం ఎన్నికల్లో స్థిర ప్రభుత్వం వస్తుందన్న నమ్మకాలు పెరిగాయి. దీంతో ఎఫ్‌ఐఐలు ఒక్కమారుగా నికర కొనుగోలుదారులుగా మారారు. బీజేపీ చూపిన తెగువ ఎన్నికల్లో మరో 30,40 సీట్లు పెంచుకునేందుకు అవకాశాలు కల్పించిందని, అందువల్ల ఎన్‌డీఏ

టాప్‌ ట్రేడింగ్‌ ఐడియాలు

Wednesday 20th March 2019

బుధవారం మధ్యాహ్నానికి సెన్సెక్స్‌ స్వల్పలాభంలో, నిఫ్టీ ఫ్లాట్‌గాను కొనసాగుతున్నాయి. మధ్యాహ్న ట్రేడింగ్‌ కోసం టాప్‌ ఐడియాలు మీకోసం... ఎడెల్‌వీజ్‌ రికమండేషన్లు: 1. ఎన్‌ఐఐటీ టెక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1390. స్టాప్‌లాస్‌ రూ. 1310. 2. ఓఎఫ్‌ఎస్‌ఎస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 3650. స్టాప్‌లాస్‌ రూ. 3050.  3. అపోలోటైర్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ., 238. స్టాప్‌లాస్‌ రూ. 213. కునాల్‌ బోత్రా రికమండేషన్లు: 1. గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 555. స్టాప్‌లాస్‌ రూ. 520.  2.

Most from this category