News


ఆల్‌టైం గరిష్టానికి ఇన్ఫోసిస్‌

Friday 8th February 2019
Markets_main1549611709.png-24090

దేశీయ ఐటీ దిగ్గజం సంస్థ ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌ షేరు శుక్రవారం కొత్త ఆల్‌టైంకి నమోదు చేసింది. నేడు బీఎస్‌ఈలో ఇన్ఫీ షేరు రూ. 763.35ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో ఐటీ షేర్లలో ర్యాలీ భాగంగా ఈ షేరు 1శాతం లాభపడి రూ.771.15ల వద్ద కొత్త ఆల్‌టైం హైని అందుకుంది. మధ్యాహ్నం గం.12:45ని.లకు షేరు గతముగింపు(రూ.763.35)తో​ పోలిస్తే అరశాతం లాభంతో రూ.767ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ పతనంలో భాగంగా ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలకు చెందిన షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., ఇన్ఫోసిస్‌ అండతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ మాత్రం 0.10శాతం లాభంతో ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 545.85 రూ.771.15ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఈ ఏడాది జోడు గుర్రాలివే!

Friday 8th February 2019

కుంజ్‌ బన్సాల్‌ రికమండేషన్‌ బ్యాకింగ్‌రంగంలో వాల్యూషన్లు, ఫండమెంటల్స్‌ పరంగా ఈ ఏడాది యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ దుమ్ముదులుపుతాయని ప్రముఖ అనలిస్టు కుంజ్‌ బన్సాల్‌ అంచనా వేశారు. గతేడాది తాను చెప్పిన జంట స్టాకులు రిలయన్స్‌, టీసీఎస్‌లు సత్తా చూపాయని, ఈ ఏడాది యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు దూసుకుపోతాయని అంచనా వేశారు. క్యు3 ఫలితాలపై వ్యాఖ్యానిస్తూ ఎఫ్‌ఎంసీజీ రంగంలో మంచి వాల్యూం వృద్ధి కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా పెయింట్స్‌ విక్రయాలు

టాటా మోటర్స్‌షేరుపై అనలిస్టులు ఏమంటున్నారు?

Friday 8th February 2019

క్యు3 ఫలితాల ప్రభావంతో టాటామోటర్స్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో కుప్పకూలింది. ఇంట్రాడేలో దాదాపు 29 శాతం పతనమైంది. జేఎల్‌ఆర్‌ దెబ్బ కంపెనీ ఫలితాలపై గట్టిగా పడింది. దీంతో పలు అనలిస్టులు కంపెనీ ఈపీఎస్‌ టార్గెట్‌ను 25 శాతం వరకు తగ్గించారు. ఇకపై జేఎల్‌ఆర్‌ విషయమై మరిన్ని ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికల ఫలితంగా ఇంట్రాడేలో దశాబ్దకాలంగా చూడని పతనాన్ని కంపెనీ షేరు చవిచూసింది. ఇకమీదట ఈ షేరులో పెద్దగా

Most from this category