News


కొత్త జీవితకాల గరిష్టానికి ఇన్ఫోసిస్‌

Tuesday 23rd July 2019
Markets_main1563858675.png-27244

  • కలిసొచ్చిన రూపాయి బలహీనత

దేశీయ ఐటీ సేవల దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌ మంగళవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.785.45ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నేటి ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో డాలర్‌ మారకంలో రూపాయి మారకం విలువ 12 పైసలు నీరసించడంతో ఐటీ కంపెనీల షేర్లకు కలిసొస్తుంది. అందులో భాగంగా నేడు ఇన్ఫోసిస్‌ షేర్లు దాదాపు 2.50శాతం మేర లాభపడి రూ.804.25ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ఈ ధర షేరుకు జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఉదయం గం.10:10ని.లకు షేరు గతముగింపు (రూ.785.15)తో పోలిస్తే 2.13శాతం లాభపడి రూ.801.90ల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ విశ్లేషకులు మెప్పించడంతో ఇన్ఫో షేర్లు లాభాల బాట పట్టాయి. ఫలితాలు ప్రకటించిన నాటి నుంచి(జూలై 12) ఇప్పటి వరకు షేరు దాదాపు 10.50శాతం ర్యాలీ చేశాయి. 



You may be interested

కుమార్తెల కోసం తనఖా..యస్‌ బ్యాంక్‌ 4 శాతం పతనం

Tuesday 23rd July 2019

 రానా కపూర్‌ తన కుమార్తెల వెంచర్లకు సెక్యురిటీగా తన యస్‌ బ్యాంక్‌ షేర్లను తనఖా పెట్టారు. తన కుమార్తెలు రాధా ఖన్నా, రాఖే టాండన్, రోషిని కపూర్ యాజమాన్యంలో ఉన్న మోర్గాన్‌ క్రెడిట్స్‌ సంస్థకు అసురక్షిత రుణాలు ఉన్నాయని కపూర్ తెలిపారు. ‘నా కుమార్తెల వ్యవస్థాపక ప్రయత్నాల కోసం యస్‌ బ్యాంక్‌లో ఉన్న నా సొంత వాటాలను తనఖాగా పెట్టాను’ అని కపూర్ వివరించారు. అంతేకాకుండా మోర్గాన​ క్రెడిట్స్‌ సంస్థ

బ్యాంక్‌ నిఫ్టీ అరశాతం డౌన్‌

Tuesday 23rd July 2019

ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే అరశాతం క్షీణించింది. నేడు ఈ ఇండెక్స్‌ 29,342.45 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అధిక వెయిటేజీ కలిగిన యస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్ల 2.50శాతం నష్టపోవడంతో ఇండెక్స్‌ ఒకదశలో 0.65శాతం (190 పాయింట్లు) క్షీణించి 29,095.50 పాయింట్ల కనిష్టానికి పతనమైంది. ఉదయం గం.9:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(29,284.95)తో పోలిస్తే 108 పాయింట్లు(0.38) క్షీణించి 29,214.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే

Most from this category