News


ఆ ఏడు మార్కెట్ల కన్నా ఇండియాలోకే ఎక్కువ

Wednesday 20th March 2019
Markets_main1553077212.png-24717

విదేశీ సంస్థాగత నిధుల ప్రవాహం
మార్చి ఆరంభం నుంచి దేశీ మార్కెట్లోకి విదేశీ నిధులు(ఎఫ్‌పీఐ) ప్రవాహం ఒక్కమారుగా ఊపందుకుంది. ఈ నెల్లో ఎఫ్‌పీఐలు దాదాపు 22వేల కోట్ల రూపాయలను ఇండియా ఈక్విటీల్లోకి కుమ్మరించారు. ఫిబ్రవరిలో ఎయిర్‌స్ట్రైక్స్‌ అనంతరం ఎన్నికల్లో స్థిర ప్రభుత్వం వస్తుందన్న నమ్మకాలు పెరిగాయి. దీంతో ఎఫ్‌ఐఐలు ఒక్కమారుగా నికర కొనుగోలుదారులుగా మారారు. బీజేపీ చూపిన తెగువ ఎన్నికల్లో మరో 30,40 సీట్లు పెంచుకునేందుకు అవకాశాలు కల్పించిందని, అందువల్ల ఎన్‌డీఏ ప్రభుత్వంపై ఆశలతో ప్రీఎలక‌్షన్‌ర్యాలీని ఎఫ్‌ఐఐలు ఆరంభించాయని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ నోమురా పేర్కొంది. గత నెల రోజుల్లో ఇండియాలోకి ఏడు వర్ధమాన ఏసియా దేశాల మార్కెట్లన్నింటిలో గరిష్ఠంగా విదేశీనిధులు వచ్చాయని గోల్డ్‌మన్‌ సాక్స్‌ వెల్లడించింది. అందుకే నెలరోజుల్లో సెన్సెక్స్‌ దాదాపు 3వేల పాయింట్లు, నిఫ్టీ 930 పాయింట్ల మేర ర్యాలీ జరిపాయి. 1996 నుంచి ఎన్నికల ఏడాదిలో ఎంఎక్స్‌ఏపీజే(ఆసియా పసిఫిక్‌ ప్రాంతీయ సూచీ) కన్నా ఇండియా సూచీలు మెరుగైన ప్రదర్శన జరిపినట్లు గత గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ దఫా ర్యాలీలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు సైతం పాలుపంచుకుంటున్నాయి.


ఈ సూపర్‌ర్యాలీకి ముందు గతేడాది కాలంలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు దాదాపు 26-39 శాతం పతనమయ్యాయి. దీంతో వాల్యూషన్లు భారీగా దిగివచ్చాయి. దీనికితోడు ఏడాది కాలంగా ఎఫ్‌ఐఐలు ఈ ప్రాంతంలో ఇండియా మార్కెట్‌ను పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా ఇవన్నీ తిరిగి భారత్‌పై దృష్టి సారించాయని హెచ్‌ఎస్‌బీసీ తెలిపింది. గత 12నెలల్లో ఎఫ్‌ఐఐలు ఇండియా మార్కెట్లో దాదాపు 83వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరిపాయి. ఈ సమయంలో మార్కెట్లు మరింత క్రాష్‌కాకుండా డీఐఐలు ఆదుకున్నాయి. యూఎస్,  చైనాల్లో మందగమన ఛాయలు కనిపించడం కూడా ఎఫ్‌ఐఐలు ఇండియాపై మరలా కన్నేయడానికి కారణం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఇండియన్‌ ఎకానమీలో స్థూల ఆర్థిక అంశాలు మెరుగ్గా ఉన్నాయని, ఎన్నికల అనంతరం అస్థిరత తొలగి మరింతంగా ఎకానమీ, మార్కెట్‌ దూసుకుపోతాయని భావించి ఎఫ్‌ఐఐలు ఇండియాకు క్యూ కట్టాయని హెచ్‌ఎస్‌బీపీ తెలిపింది. 



You may be interested

సెన్సెక్స్‌ ప్లస్‌, నిఫ్టీ మైనస్‌

Wednesday 20th March 2019

ఏడురోజుల సుధీర్ఘ ర్యాలీ తర్వాత సూచీలు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్‌ 23 పాయిం‍ట్ల లాభంతోనూ 38387 వద్ద, నిఫ్టీ 11 నష్టంతోనూ 11521 వద్ద స్థిరపడ్డాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ కారణంగా బ్యాంక్‌ నిఫ్టీ 65పాయింట్లు లాభపడి 29,832 వద్ద స్థిరపడింది. సూచీలు వరుస ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు తోడు  ఫెడరల్‌ రిజర్వ్ పాలసీ సమీక్ష, చైనా, అమెరికా మధ్య వాణిజ్య వివాద చర్చలు

ఇన్ఫోసిస్‌కు బైబ్యాక్‌ జోష్‌

Wednesday 20th March 2019

ఇన్ఫోసిస్‌ షేర్ల బైబ్యాక్‌ ఇష్యూ నేటి నుంచి ప్రారంభమైంది. దీంతో మార్కెట్లో ఈ కంపెనీ షేర్లకు భారీగా గిరాకీ నెలకొంది. ఫలితంగా ఇంట్రాడేలో షేర్లు 3శాతం లాభాన్ని ఆర్జించాయి. జనవరి 12న విడుదల చేసిన కంపెనీ త్రైమాసిక ఫలితాల సందర్భంగా కంపెనీ షేర్ల బైబ్యాక్‌ ఇష్యూను ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.8,260 కోట్ల విలువైన ఈ బైబ్యాక్‌ ఇష్యూలో భాగంగా ఒక్కో షేరుకు గరిష్టంగా రూ.800 ధర నిర్ణయించింది. దీనికింద

Most from this category