News


ఇన్ఫీబీమ్‌ హైజంప్‌- ఐఐఎఫ్‌ఎల్‌ కుదేల్‌

Thursday 26th December 2019
Markets_main1577334135.png-30448

రెండు రోజుల పతనానికి ఇన్ఫీబీమ్‌ చెక్‌
7వ రోజూ పతన బాటలో ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌


ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌
గత కొద్ది రోజులుగా పతన బాటలో సాగుతున్న ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కౌంటర్లో మరోసారి అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో గురువారం ట్రేడింగ్‌ ప్రారంభంలో ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో 15 శాతం కుప్పకూలింది. రూ. 924 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. తదుపరి అమ్మకాలు ఉపశమించడంతో రికవరీ వచ్చింది. 9.45 ప్రాంతంలో 2.5 శాతం నష్టంతో రూ. 1060 వద్ద ట్రేడవుతోంది. ఈ షేరు గత ఆరు రోజులుగా నష్టాల బాటలో కదులుతున్నట్లు నిపుణులు తెలియజేశారు.

ఇన్ఫీబీమ్‌ ఎవెన్యూస్‌
రెండు రోజులపాటు వరుసగా క్షీణించిన ఈకామర్స్‌ సేవల సంస్థ ఇన్ఫీబీమ్‌ ఎవెన్యూస్‌ కౌంటర్‌ టర్న్‌అరౌండ్‌ సాధించింది. ఇన్వెస్టర్లు అమ్మకాలు ఆపి కొనుగోళ్లకు దిగడంతో గురువారం ట్రేడింగ్‌లో ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో 12.5 శాతం దూసుకెళ్లింది. ఉదయం 9.46 ప్రాంతంలో రూ. 52.5 వద్ద ట్రేడవుతోంది. ఈ కౌంటర్లో గత 20 రోజుల సగటుతో పోలిస్తే ట్రేడింగ్‌ పరిమాణం ఐదురెట్లు ఎగసినట్లు మార్కెట్‌ వర్గాలు తెలియజేశాయి. ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు దిగడం ప్రభావం చూపుతున్నట్లు వివరించాయి.
 



You may be interested

ఆదాయపన్నులో కోత, శ్లాబ్‌ల్లో మార్పులు...?!

Thursday 26th December 2019

పలు ప్రతిపాదనలు పరిశీలిస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌పై అంచనాలు ఫిబ్రవరిలో వెలువడనున్న కేంద్ర బడ్జెట్‌ వచ్చే ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పటికే పలు రంగాల నిపుణులు, కంపెనీల ప్రతినిధులు తదితరుల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై పరిశీలన చేపట్టారు. ఈ బాటలో ప్రతి బడ్జెట్‌లోనూ మధ్యతరగతి ప్రజలు ఆసక్తి చూపే ఆదాయపన్ను శ్లాబులపైనా చర్చ జరుగుతున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు.

2నెలల గరిష్టానికి చేరువలో పసిడి

Thursday 26th December 2019

క్రిస్మస్‌ పండుగ సందర్భంగా ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్యూచర్ల ధర 2నెలల గరిష్టానికి చేరువులో ట్రేడ్‌ అవుతున్నాయి. ఆసియాలో మంగళవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ఫ్యూచర్స్‌ ధర 3.50డాలర్ల లాభంతో 1,508.45 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. వాణిజ్య చర్చల్లో భాగంగా ఇటీవల కుదిరిన తొలి ధపా ఒప్పందంపై అమెరికా, చైనా దేశాధ్యక్షుల అధికారిక సంతకాల కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా చైనాతో కొనసాగుతున్న వాణిజ్య వివాదాలకు

Most from this category