News


62 శాతం తగ్గిన ఇండస్‌ఇండ్‌ లాభం

Friday 24th May 2019
Markets_main1558683275.png-25910

  • ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సెగ 
  • రూ.7,550 కోట్లకు మొత్తం ఆదాయం
  • ఒక్కో షేర్‌కు రూ.7.50 డివిడెండ్‌

న్యూఢిల్లీ: ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018-19) నాలుగో త్రైమాసిక కాలంలో 62 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ.953 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.360 కోట్లకు తగ్గిందని ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ తెలిపింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ కంపెనీలకు ఇచ్చిన రుణాలకు కేటాయింపులు పెంచడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని ఈ ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ రమేశ్‌ సోబ్తి చెప్పారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ కంపెనీలకు రూ.3,004 కోట్ల రుణాలిచ్చామన్నారు. ఈ మొత్తం రుణాలను గత క్యూ4లో మొండి బకాయిలుగా గుర్తించామని, వీటికి గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.1,800 కోట్ల మేర కేటాయింపులు జరిపామని తెలియజేశారు. కేటాయింపులను కూడా పరిగణనలోకి తీసుకుంటే, నికర లాభం 25 శాతం ఎగసి ఉండేదని అంచనా. ఇక మొత్తం ఆదాయం మాత్రం రూ.5,859 కోట్ల నుంచి రూ.7,550 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం రూ.2,008 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.2,232 కోట్లకు, ఫీజు ఆదాయం 27 శాతం పెరుగుదలతో రూ.1,419 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభం రూ.1,769 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.2,068 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్‌ 3.97 శాతం నుంచి 3.59 శాతానికి తగ్గిందని తెలిపారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.7.50 డివిడెండ్‌ను ఇవ్వనున్నట్లు సోబ్తి తెలిపారు. 
8 శాతం తగ్గిన ఏడాది లాభం...
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017-18లో రూ.3,606 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 8 శాతం తగ్గి రూ.3,301 కోట్లకు పరిమితమయింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.22,031 కోట్ల నుంచి రూ.27,908 కోట్లకు ఎగసింది. గత ఏడాది మార్చి నాటికి 1.17 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 2.10 శాతానికి, అలాగే నికర మొండి బకాయిలు 0.51 శాతం నుంచి 1.21 శాతానికి పెరిగాయి. విలువ పరంగా చూస్తే, గత ఏడాది మార్చి నాటికి రూ.1,705 కోట్లుగా ఉన్న  స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి రూ.3,947 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.746 కోట్ల నుంచి రూ.2,248 కోట్లకు పెరిగాయి.  రుణాలు 29 శాతం వృద్ధితో రూ.1,86,394 కోట్లకు, డిపాజిట్లు కూడా 29 శాతం వృద్ధితో రూ.1,94,868 కోట్లకు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి 25 శాతంగా ఉండొచ్చని సోబ్తి తెలియజేశారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ కంపెనీలకు ఇచ్చిన రుణాలకు మూడో వంతుకు పైగా కేటాయింపులు జరపడం, షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు కూడా జత కావడం షేరుపై సానుకూల ప్రభావాన్ని చూపించింది. 



You may be interested

డీఎల్‌ఎఫ్‌ లాభం 76 శాతం అప్‌

Friday 24th May 2019

రెండు రెట్లు పెరిగిన బుకింగ్స్‌ రూ.2,661 కోట్లకు మొత్తం ఆదాయం  న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2018-19) నాలుగో క్వార్టర్‌లో 76 శాతం ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ.248 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.437 కోట్లకు పెరిగిందని డీఎల్‌ఎఫ్‌ తెలిపింది. అమ్మకాల బుకింగ్స్‌ దాదాపు రెట్టింపై రూ.2,435 కోట్లకు పెరగడంతో నికర లాభం

వాణిజ్య పోరుతో భారత్‌కు లాభం

Friday 24th May 2019

అమెరికా, చైనాకు ఎగుమతులు పెంచుకునే అవకాశం విశ్లేషకులు, పరిశ్రమవర్గాల అంచనా న్యూఢిల్లీ: అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధాన్ని భారత్‌ తనకు అనుకూలంగా మల్చుకునేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని పరిశ్రమవర్గాలు, విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తరుణంలో రెండు దేశాలకు దుస్తులు, వ్యవసాయోత్పత్తులు, వాహనాలు, యంత్రాలు మొదలైన వాటిని ఎగుమతి చేసే అవకాశాలను భారత్ అందిపుచ్చుకోవాలని వారు సూచిస్తున్నారు. ప్రస్తుత వాణిజ్య యుద్ధంలో చైనా నుంచి దిగుమతయ్యే యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ వంటి ఉత్పత్తులను

Most from this category