News


ఇండస్‌ఇండ్‌ నికర లాభం 32% అప్‌

Tuesday 14th January 2020
Markets_main1578995131.png-30924

షేరు హెచ్చుతగ్గులు
పెరిగిన వడ్డీ ఆదాయం
తగ్గిన మొండిబకాయిలు

ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ఇండస్‌ఇండ్‌ నికర లాభం 32 శాతం ఎగసి రూ. 1300 కోట్లను అధిగమించింది. ఇందుకు ప్రధానంగా వడ్డీ ఆదాయం పుంజుకోవడం, పన్ను వ్యయాలు తగ్గడం వంటి అంశాలు సహకరించాయి. వార్షిక ప్రాతిపదికన నికర వడ్డీ ఆదాయం(NII) సైతం 34 శాతం పెరిగి రూ. 3074 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో మధ్యాహ్నం మూడు సమయంలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరు దాదాపు 3 శాతం క్షీణించి రూ. 1498 వద్ద ట్రేడవుతోంది. ఫలితాలు వెలువడిన వెంటనే తొలుత రూ. 1585 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకిన ఈ షేరు తదుపరి.. రూ. 1493 దిగువన కనిష్టాన్నీ చవిచూడటం గమనార్హం!

ఎన్‌పీఏలు తగ్గాయ్‌
త్రైమాసిక ప్రాతిపదికన క్యూ3లో స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.19 శాతం నుంచి 2.18 శాతానికి నీరసించగా.. నికర ఎన్‌పీఏలు సైతం 1.12 శాతం నుంచి 1.05 శాతానికి తగ్గాయి. అయితే స్లిప్పేజెస్‌ రూ. 1945 కోట్లకు ఎగశాయి. ఈ ఏడాది క్యూ2లో ఇవి రూ. 1102 కోట్లు మాత్రమే. ఇక ప్రొవిజన్లు కూడా 41 శాతం పెరిగి రూ. 1043 కోట్లను తాకాయి. వార్షిక ప్రాతిపదికన నిర్వహణ లాభం 30 శాతం బలపడి రూ. 2746 కోట్లకు చేరగా.. వడ్డీయేతర ఆదాయం 22 శాతం పుంజుకుని రూ. 1789 కోట్లను అధిగమించింది.



You may be interested

భౌతిక బంగారం కంటే సావరిన్‌ బాండ్లే ఉత్తమం..!

Tuesday 14th January 2020

సంపద సముపార్జనలో లాభం కంటే ముందు భద్రత ముఖ్యం. అని భావించేవారు సాధారణంగా బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి వాతావరణంలో బంగారంలో పెట్టుబడులు మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భౌతిక బంగారం కంటే సావరిన్‌ పసిడి బాండ్లు అధిక రాబడినిస్తున్న కారణంగా ఈ బాండ్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా సావరిన్‌ బాండ్ల ధరలు ఇటీవల రికార్డు స్థాయిని అందుకున్నాయి.  సావరిన్‌ పసిడి బాండ్ల 2019-20

సిమెంట్‌, రియల్టీ రంగాలు భేష్‌?!

Tuesday 14th January 2020

స్థానిక కంపెనీలకు అవకాశాలెక్కువ సిమెంట్‌లో అల్ట్రాటెక్‌ పరిశీలించొచ్చు గోద్రెజ్‌, ప్రెస్టేజ్‌, ఒబెరాయ్‌.. గుడ్‌ -యస్‌ సెక్యూరిటీస్‌ నిపుణులు ప్రశాంత్‌ పటిష్ట యాజమాన్య నిర్వహణలో ఐటీ దిగ్గజం టీసీఎస్‌.. డిజిటల్‌, ప్రొడక్టుల విభాగాలలో స్థిరమైన వృద్ధిని చూపుతున్నట్లు యస్‌ సెక్యూరిటీస్‌ నిపుణులు ప్రశాంత్‌ ప్రభాకరన్‌ పేర్కొన్నారు. దీంతో ఐటీ రంగంలో టీసీఎస్‌ బాగా ముందు‍న్నట్లు చెబుతున్నారు. ఇటీవల వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ ఇన్ఫోసిస్‌ మెరుగైన పనితీరును ప్రదర్శించిందని.. రానున్న త్రైమాసికాలలో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ పీఈల మధ్య అంతరం​ తగ్గే

Most from this category