News


రెండు రెట్లకు మించిన ఇండిగో లాభం

Tuesday 28th January 2020
Markets_main1580180914.png-31250

  • మొత్తం ఆదాయం 26 శాతం అప్‌
  • 2 శాతం తగ్గిన ఇంధన వ్యయాలు 

న్యూఢిల్లీ/ముంబై: చౌక ధరల విమానయాన సంస్థ, ఇండిగో మాతృ కంపెనీ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో రెండు రెట్లకు మించి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.185 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.496 కోట్లకు పెరిగిందని ఇండిగో సీఈఓ రనోజాయ్‌ దత్తా తెలిపారు.  మొత్తం ఆదాయం రూ.8,229 కోట్ల నుంచి 26 శాతం వృద్ధితో రూ.10,330 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. 

నెట్‌వర్క్‌ విస్తరణ...
టికెట్ల ఆదాయం 24 శాతం వృద్ధితో రూ.8,770 కోట్లకు, అనుబంధ ఆదాయం 29 శాతం వృద్ధితో రూ.1,037 కోట్లకు పెరిగాయని దత్తా తెలిపారు. గత క్యూ3లో కిమీకు. రూ.3.83గా ఉన్న సగటు టికెట్‌ ధర ఈ క్యూ3లో రూ.3.88కు పెరిగిందని వివరించారు. ఇంధన వ్యయాలు రూ.341 కోట్ల నుంచి 2 శాతం క్షీణించి రూ.334 కోట్లకు తగ్గాయని పేర్కొన్నారు. నెట్‌వర్క్‌ విస్తరణ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. షిర్డి, షిల్లాంగ్‌ వంటి చిన్న నగరాలకు, హనోయ్‌, గాంగ్జూ వంటి విదేశీ నగరాలకు విమాన సర్వీసులను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఏడు విదేశీ నగరాలకు, దేశీయంగా 17 కొత్త రూట్లలో విమానాలను నడుపుతున్నామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం చివరి నాటికి నగదు నిల్వలు రూ.20,068 కోట్లుగా ఉన్నాయని తెలిపారు. 



You may be interested

పట్టణ సహకార బ్యాంకుల్లో మోసాలు వెయ్యి

Tuesday 28th January 2020

‘పంచవర్ష’ పాపమిది ఆర్‌బీఐ గణాంకాల వెల్లడి విలువ రూ.220 కోట్లు న్యూఢిల్లీ: పట్టణ సహకార బ్యాంకుల్లో గత ఐదు ఆర్థిక సంవత్సరాల కాలంలో దాదాపు 1,000 మోసాలు చోటుచేసుకున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పేర్కొంది. ఈ మోసాల విలువ దాదాపు రూ.220 కోట్లని పేర్కొంది. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద ఆర్‌బీఐ అందించిన సమాచారంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... 2018-19 మధ్య కాలంలో జరిగిన మోసాల సంఖ్య 181. వీటి విలువ

డాక్టర్‌ రెడ్డీస్‌కు రూ.570 కోట్ల నష్టం

Tuesday 28th January 2020

(అప్‌డేటెడ్‌...) ఆదాయం 14 శాతం పెరిగి రూ.4,384 కోట్లు ఎబిటా 24 శాతం అధికమై రూ.1,074 కోట్లకు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఆర్థిక ఫలితాల విషయంలో అనలిస్టుల అంచనాలు తారుమారయ్యాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో భారీ నష్టం చవిచూసింది. ఈ కాలంలో కంపెనీ రూ.569.7 కోట్ల నష్టం ప్రకటించింది. 2018-19 క్యూ3లో రూ.485 కోట్ల నికరలాభం ఆర్జించింది. డిసెంబరు త్రైమాసికంలో ఆదాయం రూ.4,384

Most from this category