News


ఇండిగో షేరుకు ఆర్డర్ల హుషారు!

Tuesday 18th June 2019
Markets_main1560837733.png-26373

బీఎస్‌ఈ లో 2శాతం​పెరిగిన షేరు విలువ
ఇండిగో షేరు విలువ మంగళవారం సెషన్‌లో 2 శాతం పెరిగి రూ. 1,673.60వద్ద ట్రేడవుతోంది. యూఎస్‌ ఆధారిత సీఎఫ్‌ఎమ్‌ ఇంటర్నేషనల్‌ లీప్‌-1ఏ ఇంజిన్‌ల కోసం 20 బిలియన్‌ డాలర్ల ఆర్డర్లను పెట్టామని కంపెనీ ప్రకటించడంతో ఇండిగో షేరు విలువ పెరిగింది.  గత మూడేళ్ల నుంచి ఉపయోగిస్తున్నా ఏ320 నియో ఇంజిన్‌ల వలన ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అందుకే సీఎఫ్‌ఎమ్‌ ఇంజిన్‌లను ఉపయోగించాలని నిర్ణయించుకున్నామని కంపెనీ తెలిపింది.  ప్రాటీ అండ్‌ విట్నీ ద్వారా నియో ఏ320 ఇంజిన్స్‌ లభ్యమవుతుండగా, సీఎఫ్‌ఎమ్‌ ఇంటర్నేషనల్‌ లీప్‌ 1ఏ ఇంజిన్‌లను అందిస్తున్నాయి. ఇండిగో సీఎఫ్‌ఎమ్‌ వినియోగదారుడిగా 2016 నుంచి ఉంది. ప్రస్తుతం 215 ఏ320/ఏ321 విమానాలలో 17 ఏ320 సీఈఓ విమానాలను సీఎఫ్‌ఎమ్‌56-5బీ ఆధారిత ఇంజిన్‌లతో నడుపుతోంది. దీనిని చరిత్రలో అతిపెద్ద ఆర్డర్‌గా ఇండిగో తెలిపింది. లీప్1ఏ ఇంజిన్‌ ఆధారిత ఏ320 నియో 2020లో అందుబాటులోకి రానుందని సంస్థ సోమవారం ప్రకటించింది. ఉదయం 11.20 సమయానికి ఇండిగో షేరు బీఎస్‌ఈలో 1.13శాతం పెరిగి 1658.90 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

సూక్ష్మ రుణాలపై బంధన్‌ బ్యాం‍క్‌ వడ్డీ తగ్గింపు

Tuesday 18th June 2019

కోల్‌కతా: సూక్ష్మ రుణాలపై బంధన్‌ బ్యాంక్‌ వడ్డీరేటు 70 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తగ్గింది. దీనితో ఈ రేటు 17.95 శాతానికి చేరింది. బ్యాంక్‌ సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సవరించిన రేటు... మంగళవారం నుంచీ ‍ఇచ్చే కొత్త రుణ పంపిణీలకు వర్తిస్తుందని పేర్కొంది. అంతకుముందు కేవలం మైక్రోఫైనాన్స్‌ కంపెనీగా ఉన్న ఈ బ్యాంక్‌, గత నాలుగేళ్లుగా పూర్తి

వృద్ధి స్పీడ్‌కు ఫిచ్‌ రెండవసారి బ్రేక్‌లు!

Tuesday 18th June 2019

 2019-2020లో   జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతమే - ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి స్పీడ్‌    అంచనాకు కోత ఇది రెండవసారి - ఇంతక్రితం 7 శాతం నుంచి   6.8 శాతానికి కుదింపు - తయారీ, వ్యవసాయం పేలవ పనితీరు నేపథ్యం న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం- ఫిచ్‌ వరుసగా రెండవసారి కుదించింది. 2019- 2020లో కేవలం 6.6 శాతమే నమోదవుతుందని

Most from this category