News


ఇండిగో షేర్లకు రేటింగ్‌ బూస్టింగ్‌

Wednesday 19th June 2019
Markets_main1560932665.png-26416

దేశీయ విమానయాన రంగ సంస్థ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌ షేర్లు బుధవారం ట్రేడింగ్‌ ఆరంభంలో లాభాల్లోకి మరలాయి. ప్రముఖ బ్రోకరింగ్‌ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ షేరు టార్గెట్‌ ధరను పెంచడటం ఇందుకు కారణమైంది. నేడు ఎన్‌ఎస్‌ఈలో 1673 రూపాయల వద్ద ఆరంభమై ఒకదశలో 1683 రూపాయలకు చేరింది. ఇటీవల కంపెనీ కొత్తగా కొనుగోలు చేస్తున్న 280 విమానాలకు సంబంధించి లీప్‌-1ఏ ఇంజన్ల తయారీకి కంపెనీ సీఎఫ్‌ఎం ఇంటర్నేషన్‌ సంస్థకు 20 బిలియన్‌ డాలర్ల ఆర్డర్లను ఇచ్చింది. ఈ తరుణంలో ఈ కంపెనీ షేర్లకు కొనుగోళ్ల డిమాండ్‌ పెరిగి  ప్రస్తుత స్థాయి నుంచి మరో 28శాతం పొటెన్షియల్‌ అప్‌సైడ్‌కు ఆస్కారం ఉందని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తుంది. గతంలో ఇండిగో షేర్లకు తాము కేటాయించిన ఓవర్‌ వెయిట్‌ రేటింగ్‌ను కొనసాగిస్తున్నామని, అలాగే షేరు టార్గెట్‌ ధర సైతం రూ.2,132లకు పెంచుతున్నట్లు మోర్గాన్‌ స్టాన్లీ తెలిపింది. అలాగే ఏవియేషన్‌ మార్కెట్లో ఇండిగో వాటా పెరగడంతో పాటు, విమాయాన రంగంలో ప్రత్యర్థి సంస్థలో కంటే మెరుగైన స్థానంలో ఇండిగో లాభాలున్నాయని బ్రోకరేజ్‌ సంస్థ చెప్పుకొచ్చింది. కంపెనీ ఆదాయ వృద్ధి 2020 ఆర్థిక సంవత్సరంలో 16శాతంగానూ, 2021 ఆర్థిక సంవత్సరంలో 18శాతంగా నమోదు కావచ్చనే అంచనాలతో ఇప్పటికే క్రెడిట్‌ సూసీ రేటింగ్‌ సంస్థ ఇండిగో షేర్ల టార్గెట్‌ ధరను రూ.1800ల నుంచి రూ.1900లకు పెంచిన సంగతి తెలిసిందే. దేశీయంగా జెట్‌ ఎయిర్‌వేస్‌ సంక్షోభం, అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధర స్థిరమైన ర్యాలీని సద్వినియోగం చేసుకున్న ఈ కంపెనీ షేర్లు గడిచిన ఆరు నెలల్లో  51శాతం ర్యాలీ చేసింది. మిడ్‌ సెషన్‌ సమయానికి షేరు గతముగింపు(రూ.1663.2)తో పోలిస్తే అరశాతం స్వల్పంగా నష్టపోయి రూ.1651ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట  ధరలు వరుసగా రూ. 697.00 రూ.1716.00లుగా నమోదయ్యాయి. 
ఇక ఇదే సమయానికి సెన్సెక్స్‌ 111.61 పాయింట్ల లాభంతో 39157.95 వద్ద, నిఫ్టీ 15 పాయిం‍ట్ల లాభంతో 11705.90  వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. You may be interested

2.50శాతం ర్యాలీ చేసిన టైటాన్‌ షేర్లు

Wednesday 19th June 2019

అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ యూబీఎస్‌ రేటింగ్‌ పెంచడంతో టైటాన్‌ కంపెనీ షేర్లు బుధవారం 2.50శాతం ర్యాలీ చేశాయి. నేడు టైటాన్‌ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో రూ.1280ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఒకదశలో 1288 రూపాయలకు చేరాయి. ‘‘టైటాన్‌ కంపెనీ వ్యూహాత్మక ప్రణాళికలు, మేనేజ్‌మెంట్‌ పారదర్శకమై పనితీరుతో మేము సంతృప్తికరంగా ఉన్నాము. షేరు ప్రస్తుత స్థాయిల నుంచి 28శాతం అప్‌ట్రెండ్‌కు కొనసాగించే అవకాశం ఉంది. ఈ క్రమంలో గతంలో  షేరకు కేటాయించిన అవుట్‌

టాప్‌5లో మూడు ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు

Wednesday 19th June 2019

సెక్టార్‌తో సంబంధం లేకుండా ఉత్తమ ప్రదర్శన నమోదు గత కొంత కాలంగా లిక్విడిటీ సమస్యలతో అధ్వాన్నంగా ఉన్న నాన్‌ బాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ) సెక్టార్‌ బుధవారం ఆకర్షించింది. ఆవాస్‌ ఫైనాన్స్‌, మనప్పురం ఫైనాన్స్‌ కంపెనీలు నిఫ్టీ500 సూచీలో మంచి ప్రదర్శన చేసిన మొదట ఐదు కంపెనీలలో ఉండడం గమనార్హం. ఈ రంగంలో సంక్షోభం ఉన్నప్పటికి నాణ్యమైన స్టాక్‌లకు మంచి ఈ రంగంలో అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీటితో పాటు మైక్రో

Most from this category