ఫలితాల ప్రభావం: ఇండిగో షేరు క్రాష్‌ల్యాండింగ్
By Sakshi

ఇండిగో మాతృ కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ రెండో త్రైమాసిక ఫలితాలు మార్కెట్ వర్గాలను తీవ్ర నిరాశపరచడంతో శుక్రవారం ఇండిగో షేర్లు కుప్పకూలాయి. కంపెనీ నిన్న మార్కెట్ ముగింపు అనంతరం ఈ ఆర్థిక సంవత్సరపు క్యూ2(జులై-సెప్టెంబర్)లను విడుదల చేసింది. క్యూ2లో రూ. 1062 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది గతేడాది క్యూ2లో రూ. 652 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం 31 శాతం ఎగసి రూ. 8105 కోట్లను తాకింది. ఈ కాలంలో రూ. 97 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించగా.. గతంలో రూ. 116 కోట్ల నష్టం నమోదైంది. ఫలితాలను నిరాశపరచడంతో పలు బ్రోకరేజ్ సంస్థలు సైతం షేర్లపై రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయడంతో పాటు షేర్ల కొనుగోళ్ల టార్గెట్ ధరను తగ్గించాయి. ఈ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో నేడు బీస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు 3.50శాతం నష్టంతో రూ.1610.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంట్రాడే అమ్మకాలు మరింత పెరగడంతో ఒకదశలో 10శాతం నష్టపోయి రూ.1501.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ఉదయం గం.11:30నిల.కు షేర్లు క్రితం ముగింపు(రూ.1666.35)తో పోలిస్తే 9.70శాతం నష్టంతో రూ.1504.65 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.755.00, రూ.1911.00లుగా నమోదయ్యాయి.
You may be interested
మారుతీ సుజుకీ.. మరింత డౌన్‌సైడ్!
Friday 25th October 2019బ్రోకరేజ్‌ల అంచనాలు సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల అనంతరం అంతర్జాతీయ బ్రోకరేజ్‌లు మారుతీ సుజుకీ షేరుపై పాత అభిప్రాయాన్నే కొనసాగిస్తున్నాయి. క్యు2లో కంపెనీ అనలిస్టుల అంచనాలకన్నా మిన్నగానే ఫలితాలు చూపింది. కానీ ఫలితాలు రికవరీని సూచించడం లేదంటూ చాలా బ్రోకరేజ్‌లు షేరుపై బేరిష్ అంచనాలనే కొనసాగిస్తున్నాయి. - మారుతీపై యూబీఎస్ అమ్మొచ్చు రేటింగ్ ఇచ్చింది. టార్గెట్ ధరను రూ. 5700గా నిర్ణయించింది. తాజా ఫలితాలు అంచనాలను మించినా, వాల్యూషన్లు ఇంకా ఖరీదుగానే ఉన్నాయని తెలిపింది. -
ధన్‌తెరాస్ ఎఫెక్ట్: ఏడాది గరిష్ఠానికి టైటాన్
Friday 25th October 2019ధన్‌తెరాస్ ప్రభావంతో డైమండ్, ఆభరణాల షేర్లు శుక్రవారం సెషన్లో మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. టైటాన్ షేరు స్వల్పంగా పెరిగి ఏడాది గరిష్ఠాన్ని తాకింది. ఉదయం 11.37 సమయానికి టైటాన్ షేరు 0.60 శాతం లాభపడి రూ. 1,382.80 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్లో రూ. 1,374.55 ముగిసిన ఈ షేరు, శుక్రవారం సెషన్లో రూ. 1,378.90 వద్ద ప్రారంభమై, రూ. 1,389.95 వద్ద 52 వారాల గరిష్ఠానికి చేరుకుంది. ఇతర డైమండ్,