News


ముదిరిన వివాదం..ఇండిగో 17 శాతం పతనం

Wednesday 10th July 2019
Markets_main1562743916.png-26952

ఇండిగో ప్రమోటర్లు రాహుల్‌ భాటియా, రాకేష్‌ గంగ్వాల్‌ మధ్య వివాదం సెబీ వరకు వెళ్లడంతో బుధవారం(జులై 10) ట్రేడింగ్‌లో ఇంటర్‌ గ్లోబల్‌ ఏవియేషన్‌ షేరు విలువ 17 శాతం నష్టపోయింది. ఇండిగో సంస్థలో కార్పోరేట్‌ పాలన నిబంధనలకు అనుగుణంగా జరగడం లేదని, ఇండిగో నుంచి భాటియా ఐజీఈ గ్రూప్‌లోని ఇతర యూనిట్లకు అక్రమ లావాదేవిలు జరుగుతున్నాయని గంగ్వాల్‌ సెబీకి జులై 9న లేఖ రాశారు. గంగ్వాల్‌ రాసిన లేఖకు ప్రతి స్పందించాలని ఇండిగో బోర్డు డైరక్టర్లను సెబీ ఆదేశించింది. జులై 19 వరకు గడువును నిర్దేశించింది. ‘ఇండిగో ప్రమోటర్ల వివాదానికి ఇప్పటిలో పరిష్కారం దొరుకుతుందని అనుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితిలో ఈ షేరు బలహీనపడే అవకాశం ఉంది’ అని పెట్టుబడి సంస్థ సిటీ సెల్‌ కాల్‌ను పునరుద్ఘాటించింది. ఈ వివాదం ముగిసే వరకు ఇండిగో షేరు దూరంగా ఉండాలని కార్నెలిన్‌ క్యాపిటల్‌ అడ్వజర్స్‌ ఎల్‌ఎల్‌పీ పౌండర్‌ వికాశ్‌ ఖెమనీ ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చారు. 

ఆర్‌పీటీలే వివాదానికి కారణం..
 ఇంటర్‌ గ్లోబల్‌ ఏవియేషన్‌లో రాకేష్‌ గంగ్వాల్‌, శోభా గంగ్వాల్‌కు కలిపి 23.09 శాతం వాటా ఉంది. శోభ గంగ్వాల్‌, జేపీ మోర్గాన్‌ ట్రస్ట్‌ కంపెనీలు ట్రస్టీలుగా ఉన్న చింకెర్‌పూ ఫ్యామిలీ ట్రస్ట్‌కు 13.60 శాతం వాటా ఉంది. ఇండిగో కంపెనీ నుంచి ఐజీఈ గ్రూప్‌ ఇతర యూనిట్లకు జరుగుతున్న సంబంధిత పార్టీ లావాదేవీల(ఆర్‌పీటీ)పై ఈ ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది.  షేరు హోల్డర్ల ఎగ్రిమెంట్‌ ద్వారా భాటియాకు అసాధరణ అధికారాలు కట్టబెట్టారని ఫలితంగా మైనార్టీ వాటా గల ఐజీఈ గ్రూప్‌ ఇండిగో నిర్ణయాలపై ప్రభావం చూపుతుందని సెబీకి రాసిన లేఖలో గంగ్వాల్‌ పేర్కొన్నారు. ‘ నేను గత కొన్నేళ్ల నుంచి గమనించలేదు.   ఇండిగోతో ఇతర యూనిట్లు ఆర్‌పీటీలు చేసుకునే విధంగా భాటియా ఒక వాతవరణాన్ని సృస్టించారు. ఆర్‌పీటీలపై సరియైన తనిఖీలు జరిగినంత కాలం నాకు ఎటువంటి అభ్యంతరం లేదు’ అని గంగ్వాల్‌ లేఖలో పేర్కొన్కారు. 

13 ఏళ్లగా అభ్యంతరాలు లేవు
      అసలు పరికరాల తయారీదారుల(ఓఈఎం) అగ్రిమెంట్‌పై ఇతర అవకాశాలను కంపెనీ పరిశీలిస్తుంటే గంగ్వాల్‌ ఈగో దెబ్బతిందని జూన్‌ 12న రాసిన లేఖలో భాటీయా తెలిపిన విషయం తెలిసిందే. ‘షేరు హో‍ల్డర్ల ఎగ్రిమెంట్‌, ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోషియేషన్‌ ఏర్పాటు చేసిన భాద్యతలను స్వికరించడానికి గంగ్వాల్‌ భయపడుతున్నాడు. అంతే కాకుండా ఐజీఈ గ్రూప్‌ అధికారాలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాడు’ అని లేఖలో వివరించారు. ‘గత 13 ఏళ్ల నుంచి జరుగుతున్న సంబంధిత పార్టీ లావాదేవీలపై గంగ్వాల్‌ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఏడాదికేడాది వార్షిక ఖాతా ప్రకటనలపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా అనుమతులను ఇచ్చేవాడు’ అని ఆరోపించారు. 
    ఇంటర్‌ గ్లోబ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ గ్రూప్‌లో ఏవియేషన్‌ రంగంలో ఇండిగో ఒక సంస్థ మాత్రమే. దీనితో పాటు ఈ గ్రూప్‌కు హాస్పిటాలిటీ, ఎయిర్‌ లైన్‌ మానెజ్‌మెంట్‌, ట్రావెల్‌ కామర్స్‌, అడ్వాన్స్‌డ్‌ పైలేట్‌ ట్రైనింగ్‌, ఎయిర్‌ క్రాప్ట్‌ నిర్వహణ ఇంజనీరింగ్‌ , రియల్‌ ఎస్టెట్‌ విభాగాలలో కంపెనీలున్నాయి. 
    మధ్యాహ్నాం 12.42 సమయానికి ఇండిగో షేరు విలువ 11.39 శాతం నష్టపోయి రూ.1,387.95 వద్ద ట్రేడవుతోంది. You may be interested

ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల పతనం

Wednesday 10th July 2019

1.50శాతానికి పైగా నష్టపోయి పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌  మార్కెట్‌ పతనంతో భాగంగా ప్రభుత్వరంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదురుర్కోన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతనిథ్యం వహిస్తున్న నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్‌ 2.50శాతం నష్టపోయింది. ఈ ఇండెక్స్‌ నేడు 3,172.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ప్రభుత్వరంగ షేర్ల పతనంతో ఇండెక్స్‌ 1.67శాతం నష్టపోయి 3099.00 వద్ద ఇంట్రాడే కనిష్టస్థాయిని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.1:15ని.లకు ఇండెక్స్‌

బ్యాంకుల్లో రూ.1.85 లక్షల కోట్ల మోసాలు

Wednesday 10th July 2019

11 ఏళ్లలో నమోదైన కేసులు 44,016 న్యూఢిల్లీ: బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో గత పదకొండు ఏళ్లలో (2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 వరకు) 44,016 మోసం కేసులు నమోదు కాగా, వీటి ప్రభావం రూ.1,85,624 కోట్లుగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ రాజ్యసభకు తెలిపారు. అత్యధికంగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో 25,883 కోట్లకు సంబంధించి 3,927 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరం 2017-18లో

Most from this category