News


నష్టాల ప్రారంభం....నిముషాల్లో లాభాల్లోకి

Tuesday 6th August 2019
Markets_main1565062702.png-27557

అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యద్ధం....కరెన్సీ యుద్ధంగా పరిణమించడం, కశ్మీర్‌ను విభజించడం వంటి అంతర్జాతీయ, దేశీయ అంశాల నడుమ భారీ పతనాల్ని చవిచూస్తున్న భారత్‌ సూచీలు మంగళవారం సైతం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 132 పాయింట్ల నష్టంతో 36,568 పాయింట్ల వద్ద, నిఫ్టీ 47 పాయింట్ల క్షీణతతో 10,815 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. అయితే ఆసియా సూచీలు భారీ నష్టాల నుంచి కోలుకుంటున్ననేపథ్యంలో భారత్‌ సూచీలు సైతం మార్కెట్‌ ప్రారంభమైన కొద్ది నిముషాల్లోనే లాభాల్లోకి మళ్లాయి. 9.25 గంటల సమయానికి సెన్సెక్స్‌ 135 పాయింట్లు లాభపడి 36,835 పాయింట్ల వద్దకు, నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 10,917 పాయింట్ల వద్దకు చేరుకుంది. అమెరికా విధించబోతున్న అదనపు టారీఫ్‌ల నుంచి రక్షణగా చైనా తన కరెన్సీ యూవాన్‌ను క్షీణింపచేయడంతో గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు 2.5-4 శాతం మధ్య పతనమయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఆసియా సూచీలన్నీ భారీ క్షీణతతో ప్రారంభమైనప్పటికీ, మన మార్కెట్‌ మొదలయ్యే సమయానికి కొంతవరకూ నష్టాల్ని తగ్గించుకోగలిగాయి. యువాన్‌ విలువ మరింత తగ్గకుండా చైనా కేంద్ర బ్యాంక్‌...బాండ్ల విక్రయాన్ని చేపట్టాలని నిర్ణయించడంతో ఆసియా స్టాక్‌ సూచీలు ప్రారంభపతనం నుంచి కొంత కోలుకున్నాయి. 



You may be interested

పతనం నుంచి కోలుకుంటున్న రూపీ

Tuesday 6th August 2019

రూపీ డాలర్‌ మారకంలో మంగళవారం 7 పైసలు బలహీనపడి 70.80 వద్ద ప్రారంభమయినప్పటికి, దేశియ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడవుతుండడంతో రూపీ డాలర్‌ మారకంలో తిరిగి పుంజుకొంటుంది. ఉదయం 9.45 సమయానికి రూపీ 26 పైసలు బలపడి 70.54 వద్ద ట్రేడవుతోంది. గత ఆరేళ్లలో ఒకే రోజు అత్యధికంగా రూపీ, గత సెషన్లో(అగష్టు 5) 113 పైసలు బలహీనపడి 70.73 వద్ద ముగిసింది. అంతర్జాతీయ వాణిజ్య భయాలు, దేశియ ఈక్విటీ మార్కెట్ల

విల్సన్‌ సోలార్‌ ఐపీవో నేటి నుంచే... కంపెనీ విశేషాలు

Tuesday 6th August 2019

సోలార్‌ ఇంజనీరింగ్‌, నిర్మాణ రంగ కంపెనీ, షాపూర్‌జీ పల్లోంజీ గ్రూపులో భాగమైన ‘స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌’ (ఎస్‌డబ్ల్యూఎస్‌ఎల్‌) ఐపీవో ఆగస్ట్‌ 6 నుంచి (మంగళవారం) ప్రారంభం అవుతోంది. ఒక్కో షేరుకు ధరల శ్రేణి రూ.775-780. బుధవారం ( ఈ నెల 8న)తో ఇష్యూ ముగుస్తుంది. ఐపీవోలో కనీసం 19 షేర్లకు (ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఇష్యూకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌, క్రెడిట్‌ సూసే ఇండియా,

Most from this category