News


సెన్సెక్స్‌ తక్షణ మద్దతు 36,830

Monday 2nd September 2019
Markets_main1567399892.png-28139

ఆదాయపు పన్ను సర్‌ఛార్జ్‌ పెంపును ఉపసంహరించడం, ప్రభుత్వ బ్యాంకులకు తక్షణ మూలధనాన్ని అందించడం, వ్యవస్థలో లిక్విడిటీ పెంపు, రుణాల్ని చౌకగా లభింపచేయడం, ఆటోమొబైల్‌ రంగానికి రాయితీలు వంటి కేంద్రం చర్యలపై గతవారం ఆరంభంలో ఈక్విటీలు సానుకూలంగా స్పందించినప్పటికీ, పెద్దగా ముందడుగు వేయలేకపోయాయి. బ్యాంకింగ్‌ ఎన్‌పీఏలపై వెన్నాడుతున్న భయాలు, ఆర్థికాభివృద్ధి రేటు తగ్గుతుందన్న అంచనాలు ఇందుకు కారణం కావొచ్చు. మరోవైపు  ట్రేడ్‌వార్‌ పట్ల అమెరికా-చైనాలు కాస్త మెత్తబడినట్లు కన్పించడంతో ప్రపంచ మార్కెట్లు గతవారం కుదుటపడ్డాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మన మార్కెట్‌ ముగిసిన తర్వాత వెలువడిన భారత్‌ వృద్ధి రేటు గణాంకాలు (క్యూ1లో 5 శాతానికి) ఇన్వెస్టర్లను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసే అంశం. ఆరేళ్ల కనిష్టస్థాయికి పడిపోయిన వృద్ధిరేటు పునరుద్ధరణకు కేంద్రం వేగంగా తీసుకోబోయే తదుపరి చర్యల ఆధారంగా మార్కెట్‌ కదలికలు వుండవచ్చు.  ఇక సూచీల సాంకేతికాంశాల విషయానికొస్తే...,

సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
ఆర్థిక మంత్రి ప్రకటించిన ప్యాకేజీ ప్రభావంతో ఆగస్టు 30తో ముగిసినవారంలో పాజిటివ్‌గా ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ క్రమేపీ పెరుగుతూ గత మార్కెట్‌ పంచాంగంలో సూచించిన అంచనాలకు అనుగుణంగా  37,732  పాయింట్ల గరిష్టస్థాయిని అందుకుంది. చివరకు అంత క్రితం వారంతో పోలిస్తే 632 పాయింట్ల లాభంతో 37,333 పాయింట్ల వద్ద ముగిసింది. గత శుక్రవారం వెలువడిన జీడీపీ గణాంకాలు, ట్రేడ్‌వార్‌ పరిణామాలకు స్పందనగా ఈ మంగళవారం సెన్సెక్స్‌ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 36,830 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని ముగింపులో కోల్పోతే 36,490 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ లోపున తిరిగి 36,100 పాయింట్ల స్థాయిని పరీక్షించే ప్రమాదం వుంటుంది. ఈ వారం గ్యాప్‌అప్‌తో మొదలైనా, తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకున్నా తొలుత 37,730 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. అటుపైన 37,950 పాయింట్ల వరకూ పెరిగే అవకాశాలుంటాయి. ఈ స్థాయిపైన ముగిస్తే సెన్సెక్‌​‍్స సాంకేతికంగా అప్‌ట్రెండ్‌లోకి ప్రవేశించే ఛాన్స్‌ వుంటుంది. 

నిఫ్టీ తొలి మద్దతు 10,875...
 గతకాలమ్‌లో సూచించిన రీతిలో క్రితం వారం 11,142 పాయింట్ల గరిష్టస్థాయివరకూ ర్యాలీ జరిపిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 194 పాయింట్ల లాభంతో 11,023 పాయింట్ల వద్ద ముగిసింది. ఈవారం నిఫ్టీ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 10,875 పాయింట్ల స్థాయి తక్షణ మద్దతును అందించవచ్చు. ఈ లోపున ముగిస్తే 10,755 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే తిరిగి 10,640 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం గ్యాప్‌అప్‌తో మొదలైనా, పైన సూచించిన తక్షణ మద్దతుస్థాయిని పరిరక్షించుకున్నా, నిఫ్టీ 11,145 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన కీలకమైన 200 డీఎంఏ రేఖ కదులుతున్న 11,210 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు.  ఈస్థాయిపైన ముగిస్తేనే నిఫ్టీ తిరిగి మధ్యకాలిక అప్‌ట్రెండ్‌లోకి ప్రవేశించే అవకాశం వుంటుంది.You may be interested

పాప కోసం.. ఏ ఫండ్‌ ?

Monday 2nd September 2019

ప్ర: నాకు నెల క్రితమే ఒక పాప పుట్టింది. ఆమెను డాక్టర్‌ చెయ్యాలనేది నా కల. ఆమె భవిష్యత్తు కోసం ఏదైనా మ్యూచువల్‌ ఫండ్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) నెలకు కొంత మొత్తం ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఏ ఫండ్‌ను ఎంచుకోవాలి? సిప్‌ మొదలు పెట్టే ప్రక్రియ సంబంధిత వివరాలు తెలియజెయ్యండి ?  -రఘువీర్‌, హైదరాబాద్‌  జ: ఒక పాపకు తండ్రి అయినందుకు ముందుగా మీకు అభినందనలు. ఆమె భవిష్యత్తు కోసం సిప్‌ విధానంలో

ర్యాలీ కొనసాగేనా..?

Monday 2nd September 2019

స్థూల ఆర్థికాంశాలే ఈవారంలో కీలకం అమెరికా-చైనాల మధ్య ముదురుతున్న వాణిజ్య యుద్ధం కేవలం 5 శాతంగా నమోదైన దేశ క్యూ1 జీడీపీ ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితం వినాయక చవితి సందర్భంగా సోమవారం మార్కెట్‌కు సెలవు న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్‌ భారీ పతనానికి గడిచిన వారంలో అడ్డుకట్ట పడింది. అంతక్రితం రెండు వారాల వరుస నష్టాల నుంచి కోలుకుని, లాభాల బాట పట్టిన ప్రధాన సూచీలు.. దాదాపు 1.79 శాతం లాభపడి ఏకంగా మూడు నెలల గరిష్టస్థాయిని

Most from this category