STOCKS

News


నిఫ్టీ 86 పాయింట్లు, సెన్సెక్స్‌ 307 పాయింట్లు అప్‌

Tuesday 7th January 2020
Markets_main1578368448.png-30718

అమెరికా-ఇరాన్‌ సంక్షోభంతో క్రితం రోజు భారీ నష్టాల్ని చవిచూసిన భారత్‌ స్టాక్‌ సూచీలు మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో జోరుగా పుంజుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 307 పాయింట్ల లాభంతో 40,984 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 86 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 12,079 పాయింట్ల వద్ద ఆరంభమయ్యాయి. గత రాత్రి అమెరికా మార్కెట్‌ పాజిటివ్‌గా ముగియడంతో, తాజాగా ఆసియా సూచీలు సైతం రిబౌండ్‌కావడం.. ఇక్కడి ప్రారంభర్యాలీకి కారణమయ్యింది. అలాగే పసిడి ధర 1,560 డాలర్ల స్థాయికి, క్రూడ్‌ ధర 68 డాలర్ల వద్దకు చల్లబడటం కూడా స్థానిక ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చింది. 



You may be interested

సెప్టెంబర్‌ కల్లా ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ !

Tuesday 7th January 2020

వెల్లడించిన ఎన్‌ఎస్‌ఈ ఎమ్‌డీ విక్రమ్‌ లిమాయే  న్యూఢిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ)  ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఈ ఏడాది సెప్టెంబర్‌ కల్లా  వచ్చే అవకాశాలున్నాయి. ఐపీఓ ప్రక్రియకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం కోరామని ఎన్‌ఎస్‌ఈ ఎమ్‌డీ, సీఈఓ విక్రమ్‌ లిమాయే పేర్కొన్నారు. సెబీ ఆమోదం రాగానే మర్చంట్‌ బ్యాంకర్ల నియామక ప్రక్రియను ఆరంభిస్తామని తెలిపారు. ఆ తర్వాత ఐపీఓ సంబంధిత పత్రాలను సెబీకు సమర్పిస్తామని వెల్లడించారు. ఈ

ఫ్లిప్‌కార్ట్‌కు ఓటీపీ అవసరం లేదు..

Tuesday 7th January 2020

రూ. 2,000 వరకు పరిమితి వీసా సేఫ్‌ క్లిక్‌ పేరిట సేవలు న్యూఢిల్లీ: ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌.. తాజాగా వన్‌ టైమ్‌ పాస్‌వార్డ్‌ (ఓటీపీ) అవసరం లేని చెల్లింపుల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. చిన్న మొత్తాల్లో కొనుగోలు చేసేవారి చెల్లింపులను సులభతరం చేయడంలో భాగంగా.. ‘వీసా సేఫ్‌ క్లిక్‌’ పేరిట సేవలను ప్రారంభించినట్లు సోమవారం ప్రకటించింది. రూ. 2,000 వరకు పూర్తి భద్రతతో ఓటీపీ లేకుండా ఈ విధానంలో చెల్లించవచ్చని ఫ్లిప్‌కార్ట్ హెడ్

Most from this category