ఒడిదుడుకుల ప్రారంభం
By Sakshi

పలు ప్రతికూల, సానుకూల సంకేతాల నడుమ గురువారం ప్రారంభంలో స్టాక్ సూచీలు స్వల్ప హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 85 పాయింట్ల లాభంతో 40,737 పాయింట్ల వద్ద ప్రారంభమైన కొద్ది నిముషాల్లోనే స్వల్ప నష్టాల్లోకి మళ్లింది. ఇదే రీతిలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 26 పాయింట్ల గ్యాప్అప్తో 12,025 పాయింట్ల వద్ద మొదలై, వెనువెంటనే 12,000 లోపునకు పడిపోయింది. దేశీయంగా టెలికాం కంపెనీలకు స్పెక్ర్టం చెల్లింపుల్లో ప్రభుత్వం ఊరటనివ్వడం, కొన్ని ప్రభుత్వ రంగ కంపెనీల ప్రైవేటీకరణకు కేంద్ర కేబినెట్ పచ్చజండా ఊపడం సానుకూల అంశాలుకాగా, అమెరికా-చైనా ట్రేడ్ డీల్ ఈ సంవత్సరంలో కుదరకపోవచ్చన వార్తలు మార్కెట్లో ప్రతికూలతను నింపాయి.
You may be interested
వొడా-ఐడియా 10% క్రాష్, నష్టాల్లో ఎయిర్టెల్, రిలయన్స్ షేర్లు!
Thursday 21st November 2019టెలికాం కంపెనీలు చెల్లించవలసిన ఏజీఆర్(ఎడ్జస్టడ్ గ్రాస్ రెవెన్యూ) బకాయిలను మాఫీ చేయడం లేదా ఈ బకాయిలు చెల్లించడానికి టెలికాం కంపెనీలకు కొంత సమయం ఇవ్వడం వంటి ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద లేవని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం పార్లమెంట్లో తెలిపారు. కాగా గత కొన్ని రోజుల నుంచి ప్రభుత్వం టెలికాం కంపెనీలకు ఉపశమన ప్యాకేజిని ప్రకటిస్తుందనే వార్తలు మార్కెట్ వర్గాలలో చక్కర్లు కొడుతున్నాయి. ఫలితంగా గత కొన్ని సెషన్లలో
ప్రైవేటీకరణ..నష్టాల్లో బీపీసీఎల్, కాంకర్, ఎస్సీఐ
Thursday 21st November 2019చమురు దిగ్గజం బీపీసీఎల్(భారత పెట్రోలియం కార్పోరేషన్), షిప్పింగ్ సంస్థ ఎస్సీఐ, కార్గో సేవల సంస్థ కాన్కర్లో వాటాల విక్రయానికి కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. దీంతో పాటు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను 51 శాతం లోపునకు తగ్గించుకునే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన ప్రకారం, దేశీయంగా రెండో అతి పెద్ద రిఫైనరి సంస్థయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)లో కేంద్రం తనకున్న మొత్తం