News


లాభాల ప్రారంభం

Tuesday 29th October 2019
Markets_main1572320393.png-29192

ఆదివారంనాటి మూరత్‌ ట్రేడింగ్‌లో 2076 హిందూ నామ సంవత్సరాన్ని శుభారంభం చేసిన స్టాక్‌ సూచీలు ఒక రోజు సెలవు అనంతరం మంగళవారం తిరిగి లాభాల్లో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 49 పాయింట్ల పెరుగుదలతో 39,300 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 17 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,644 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. అమెరికా-చైనాల వాణిజ్య ఒప్పందం ఒక కొలిక్కివస్తున్నదంటూ ఇరుదేశాల అధికారులూ చేసిన ‍ప్రకటనలు, యూరోపియన్‌ యూనియన్‌ బ్రెగ్జిట్‌ గడువును జనవరి 31 వరకూ పొడిగించడం వంటి సానుకూల అంశాల ప్రభావంతో గత రాత్రి అమెరికాలో ప్రధాన స్టాక్‌ సూచీ ఎస్‌ అండ్‌ పీ-500 కొత్త రికార్డుస్థాయి 3,039 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే తాజాగా ఆసియా సూచీలు మూడు నెలల గరిష్టస్థాయి వద్ద జరుగుతున్న లాభాల స్వీకరణ కారణంగా స్వల్పంగా తగ్గినప్పటికీ, భారత్‌ సూచీలు పాజిటివ్‌గా ఆరంభమయ్యాయి.

టాటా మోటార్స్‌ 6 శాతం జంప్‌...

అంచనాల్ని మించి ఫలితాల్ని ప్రకటించిన టాటా మోటార్స్‌ షేరు ప్రారంభంలోనే మరో 6 శాతం జంప్‌చేసి రూ. 156 స్థాయిని చేరింది. ఈ షేరు మూరత్‌ ట్రేడింగ్‌లో 17 శాతం లాభపడిన సంగతి తెలిసిందే. టాటా స్టీల్‌, ఐషర్‌ మోటార్స్‌, వేదాంత, మహింద్రాలు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 1-2 శాతం లాభపడ్డాయి. మరోవైపు ఈ రోజు ఆర్థిక ఫలితాల్ని వెల్లడించనున్న భారతీ ఎయిర్‌టె్‌ 3.5 శాతం గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యింది. యస్‌బ్యాంక్‌, నెస్లే ఇండియా, ఇన్‌ఫ్రాటెల్‌లు 2 శాతం వరకూ ప్రారంభంలో నష్టపోయాయి. 



You may be interested

పెరిగిన రూపాయి

Tuesday 29th October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో మంగళవారం సెషన్‌లో 14 పైసలు బలపడి 70.74 వద్ద ప్రారంభమైంది. కాగా చమురు ధరలు తగ్గడంతో పాటు, దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభపడడంతో అక్టోబర్‌ 25(శుక్రవారం) సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 14 పైసలు బలపడి 70.88 వద్ద ముగిసింది. దీపావళి బలిప్రతిపాద సందర్భంగా అక్టోబర్‌ 28న ఫారెక్స్‌ మార్కెట్లు పనిచేయలేదు. అంతర్జాతీయంగా చమురు డిమాండ్‌ ఆందోళనలు వెంటాడుతుండడంతో చమురు ధరలు మంగళవారం

వృద్ధికి మరిన్ని సంస్కరణలే కీలకం..

Tuesday 29th October 2019

ఆర్థిక రంగంలో కొత్త ఆవిష్కరణలు అవసరం భారత్‌కు ఏటా 6 బిలియన్ డాలర్ల సహాయం కొనసాగుతుంది ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ డేవిడ్ మల్‌పాస్‌ న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే భారత ఆర్థిక వ్యవస్థ మందగమనానికి కూడా కారణమని ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ డేవిడ్ మల్‌పాస్ పేర్కొన్నారు. మరిన్ని సంస్కరణలు, నవకల్పనలు భారత వృద్ధికి కీలకంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, 2024-25 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఎదగాలంటే.. ఆర్థిక

Most from this category