News


స్వల్ప లాభాలతో ప్రారంభం

Thursday 2nd January 2020
Markets_main1577936464.png-30604

ఆసియా ట్రెండ్‌ను అనుసరిస్తూ గురువారం భారత్‌ స్టాక్‌ సూచీలు స్వల్ప లాభంతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 34 పాయింట్ల లాభంతో 41,340 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 16 పాయింట్ల పెరుగుదలతో 12,198 పాయింట్ల వద్ద ఆరంభమయ్యాయి. న్యూఇయర్‌ సెలవుల అనంతరం ఈ రోజు ట్రేడింగ్‌ను ప్రారంభించిన చైనా, హాంకాంగ్‌, తైవాన్‌ మార్కెట్లు 1.2 శాతం జంప్‌చేశాయి. జనవరి 15న ట్రేడ్‌డీల్‌పై సంతకాలు జరగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన నేపథ్యంలో కొన్ని ఆసియా సూచీల్లో ఈ ట్రెండ్‌ నెలకొంది. జపాన్‌కు ఈ రోజు కూడా సెలవు. 



You may be interested

‘నల్లబంగారం’ ఇక జిగేల్‌!

Thursday 2nd January 2020

వేగం పుంజుకోనున్న బొగ్గు ఉత్పత్తి... వచ్చే ఐదేళ్లలో వేలానికి 200 బొగ్గు బ్లాకులు ప్రైవేటు రంగానికి భారీ అవకాశాలు... 2024 నాటికి దిగుమతులకు చెక్‌... న్యూఢిల్లీ: దేశంలో అపారంగా బొగ్గు నిక్షేపాలు ఉండి కూడా దిగుమతి చేసుకుంటున్నాం. కోల్‌ ఇండియా ఒక్కటీ దేశ అవసరాల్లో అధిక శాతం తీరుస్తోంది. అయినా, అవసరానికంటే ఉత్పత్తి తక్కువగానే ఉంటోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు, దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచడం ద్వారా దిగుమతుల భారానికి కళ్లెం వేసేందుకు ప్రైవేటు

అసెట్స్‌ విక్రయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌

Thursday 2nd January 2020

రూ. 300 కోట్ల సమీకరణపై కసరత్తు న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అసెట్స్ విక్రయం ద్వారా దాదాపు రూ. 300 కోట్లు సమీకరించడంపై ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నిర్దిష్ట భూములను విక్రయించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) తదితర సంస్థలతో చర్చలు జరుపుతోందని టెలికం శాఖ (డాట్‌) సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌తో పాటు ప్రభుత్వ రంగానికి చెందిన

Most from this category