News


లాభాల ప్రారంభం

Tuesday 2nd July 2019
Markets_main1562038738.png-26724

క్రితం రోజు అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ మంగళవారం భారత్‌ స్టాక్‌ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 125 పాయింట్ల పెరుగుదలతో 39,812 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 25 పాయింట్లు జంప్‌చేసి 39,812 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. పలు దేశాల తయారీ రంగం నెమ్మదించిందన్న వార్తలతో ప్రపంచవృద్ధి మందగిస్తుందన్న భయాలు నెలకొనడంతో ఆసియా మార్కెట్లు స్వల్ప క్షీణతతో ట్రేడవుతున్నాయి. హాంకాంగ్‌ మినహా మిగిలిన ఆసియా సూచీలన్నీ తగ్గాయి.  క్రితం రోజు సెలవుతర్వాత ట్రేడింగ్‌ ప్రారంభించిన హాంకాంగ్‌లో హాంగ్‌సెంగ్‌ ఇండెక్స్‌ మాత్రం 1.2 శాతం లాభపడింది. 



You may be interested

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 2nd July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  కాక్స్‌ అండ్‌ కింగ్స్‌: ఈ కంపెనీ రేటింగ్‌ను కేర్‌(సీఏఆర్‌ఏ) ఏఏ- నుంచి బీబీకి మార్చింది. హీరో మోటర్‌ కార్ప్‌: 2018 జూన్‌లో 6,52,028 యూనిట్ల అమ్మకాలు జరగగా 2019 జూన్‌లో వాహన విక్రయాలు 6,16,526 యూనిట్లకు పడిపోయాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌: రిజల్యూషన్‌ ప్రణాళికను జులై 5 కల్లా అమలు చేయాలని రుణదాతల మధ్య అంగీకారం కుదిరింది. ఈ కంపెనీ జూన్‌ నెలలో కొన్ని బ్యాంకుల రుణాలను

ఓలా, ఓయో, పేటీఎం వాటాలకు భారీ ధరలు!

Monday 1st July 2019

ఇవన్నీ అన్‌లిస్టెడ్‌ కంపెనీలు. కానీ, కోరకుంటే వీటి వాటాలను సొంతం చేసుకోవచ్చు. ఆఫ్‌ మార్కెట్‌ ఇందుకు వీలు కల్పిస్తుంది. కానీ, కొనాలంటే వేలాది రూపాయలు వెచ్చించాల్సిందే. ఓలా మాతృ సంస్థ ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌, ఓయో రూమ్స్‌ మాతృ సంస్థ ఓరావెల్‌ స్టేస్‌, పేటీఎం మాతృ సంస్థ వన్‌97కమ్యూనికేషన్స్‌ షేర్లకు రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి మంచి డిమాండ్‌ ఉన్నట్టు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఈ కంపెనీలకు మంచి పేరుంది. అన్‌లిస్టెడ్‌

Most from this category